దక్షిణ కన్నడ జిల్లా

(దక్షిణ కన్నడ నుండి దారిమార్పు చెందింది)

దక్షిణ కన్నడ మునుపు దక్షిణ కనర అని పిలువబడింది. కర్ణాటక రాష్ట్రంలో ఇది సముద్రతీర జిల్లాలలో ఒకటిగా ఉంది. ఇది పశ్చిమ కనుమలలో తూర్పుదిశలో ఉన్నాయి. జిల్లా సరిహద్దులో అరేబియా సముద్రపు నీలజలాలు ఉన్నాయి. అందమైన పర్వతశ్రేణి, ఆలయ పట్టణాలు, సంపన్నమైన సంస్కృతి సమ్మిశ్రితం ఈ జిల్లాను అభిమాన పర్యాటక గమ్యంగా మార్చింది.[3] మంగుళూరు నగరం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 4,866. జనసాంధ్రత 430.జిల్లాలో 354 గ్రామాలు ఉన్నాయి.

Dakshina Kannada
ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆ
South kanara
జిల్లా
బెల్తంగడి లోని బండజే జలపాతం [1]
కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంకర్ణాటక
ప్రాంతంతుళు నాడు
ముఖ్య పట్టణంమంగళూరు
Talukasమంగళూరు, బంత్వల్, పుత్తూరు, సుల్య, బెల్తగడి
విస్తీర్ణం
 • Total4,866 కి.మీ2 (1,879 చ. మై)
 • Rank34
జనాభా
 • Total20,89,649
 • జనసాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
భాషలు
 • అధికారికకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌
5750xx(మంగళూరు), 574xxx
టెలిఫోన్ కోడ్+ 91 (082xx)
Vehicle registrationKA 19, KA 21, KA 62

విభాగాల వివరణ

మార్చు
విషయాలు వివరణలు
తాలూకాలు 5 తాలూకా మంగళూరు, బంత్వా, పుత్తూర్ (కర్ణాటక) సుల్లియా, బెల్తంగండి. .[4]

జిల్లాలో మునుపు ఉడిపి, కుందపూర్, కార్కల తాలూకాలు కూడా ఉండేవి. 1947 ఆగస్టు 15 న దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఉడిపికి జిల్లా హోదా ఇవ్వబడింది. తరచుగా దక్షిణ కన్నడ, ఉడిపి, కాసరగాడ్ జిల్లాలను తులునాడు అంటారు. ఈ ప్రాంతంలో తులుభాష ప్రధానభాషగా వాడుకలో ఉంది. ఈ ప్రాంతాన్ని 8-14 శతాబ్ధాల నుండి అలుపాలు పాలించారు. అలుపాలు ప్రధాన కర్నాటక సామ్రాజ్యాలకు సామంతరాజ్యంగా ఉంది. అందువలన కర్నాటక రాష్ట్రంలో తులు మాట్లాడే ప్రజలు ప్రత్యేకంగా ఉన్నారు.

సరిహద్దులు

మార్చు
సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు ఉడిపి
వాయవ్య సరిహద్దు చిక్కమగళూరు
తూర్పు సరిహద్దు హాసన్
ఆగ్నేయ సరిహద్దు కొడగు
దక్షిణ సరిహద్దు కాసరగాడ్ జిల్లా కేరళ రాష్ట్రం

నేపథ్యం

మార్చు
 
తన్నిర్భవి బీచ్
 
సురత్కల్ బీచ్ వెంటవున్న లైట్ హౌస్

1860కి ముందు దక్షిణ కనర జిల్లాలో భాగంగా ఉండేది. కనర జిల్లా ఒకటిగా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1860లో బ్రిటిష్ ప్రభుత్వం దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలుగా విభజించబడి 1862 వరకు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగానే ఉంటూ తరువాత బొబాయి ప్రెసిడెన్సీలో భాగంగా మారింది.[5] కుందపురా తాలూకా ముందు ఉత్తరకనర జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత అది దక్షిణ కనరాలో విలీనం చేయబడింది.

1956లో పునర్విభజన సమయంలో కాసరగాడ్ విభజించబడి కొత్తగా రూపొందిన కేరళ రాష్ట్రంలో విలీనం చేయబడింది. దక్షిణ కన్నడ మైసూరు రాష్ట్రంలో (ప్రస్తుత కర్నాటక) చేర్చబడింది. తరువాత కర్నాటక ప్రభుత్వం పాలనాసౌలభ్యం కొరకు గ్రేటర్ దక్షిణ కన్నడ నుండి ఉడిపి జిల్లా రూపొందించబడింది.[6]

జిల్లా ఎర్రమట్టి టైల్స్‌కు (మంగుళూరు టైల్స్), జీడిపప్పు, జిడిపప్పు సంబంధిత ఉత్పత్తులకు, బ్యాంకింగ్, విద్య, కుకరీ తరగతులకు ప్రసిద్ధి.

దక్షిణకనర

మార్చు

బ్రిటిష్ దక్షిణకన్నడ 13.00 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.40 డిగ్రీల తూర్పు రేఖంశంలో ఉంది.[7] 1949లో కనర జిల్లానుండి విభజించిన భూభాగం దక్షిణకన్నడ జిల్లాగా రూపొందించబడింది. తరువాత ఇది అవిభాజిత దక్షిణ కన్నడ జిల్లా ఉండేది.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,089,649,[8]
ఇది దాదాపు. రిపబ్లిక్ మెసిడోనియల్ దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 220 వ స్థానంలో ఉంది.[8]
1చ.కి.మీ జనసాంద్రత. 457 [8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.8%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 1018 [8]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 88.62%.[8]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రజలు

మార్చు

జిల్లా భూభాగంలో మొదటి సారిగా స్థిరపడిన వారు తులువ ప్రజలని భావిస్తున్నారు. వీరిలో బిల్లవ, మొగవీర, బంట్, కొరగాస్, కులాల, దేవడిగ ఉప తెగలు ఉన్నాయి. ఇతర జాతులలో తులువ బ్రాహ్మణులు, హొలెయాలు, వొక్కలిగాలు, కొండజాతులు, ముస్లిములు, మంగోలియన్ కాథలిక్కులు ఉన్నారు. బ్రాహ్మణులు ప్రధానంగా శివల్లి బ్రాహ్మణ, గౌడ శరవస్త బ్రాహ్మణులు (సారస్వత్), హవ్యక బ్రాహ్మణ, కోట బ్రాహ్మణులు మొదలైన ఉపజాతుల ప్రజలు ఉన్నారు. జిల్లాలో తులువ భాష, బియరీ భాష, కన్నడ, కొంకణి భాషలు వాడుకలో ఉన్నాయి.

భౌగోళిక స్వరూపం

మార్చు
 
దక్షిణ కన్నడ ప్రకృతి దృశ్యం
 
దక్షిణ కన్నడ లోని కుక్కే సుబ్రహ్మణ్య దగ్గర ఉన్న పశ్చిమ కనుమల దృశ్యం

జిల్లా భౌగోళికంగా తూర్పున పశ్చిమ కనుమలు, పశ్చిమ దిశలో అరేబియన్ సముద్రం ఉన్నాయి. జిల్లాలో నేత్రావతి, కుమారధార, ఫల్గుణి, శాంభవి, నందిని (పవంజె), పయాస్విని నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులన్నీ అరేబియన్ సముద్రంలో సంగమిస్తున్నాయి. నైసర్గికంగా జిల్లా చదరంగా ఉంటుంది. సముద్రతీరంలో భూభాగం 18-2 కి.మీ ఉంటుంది. తరువాత తూర్పుదిశగా ఉన్న పశ్చిమ కనుమలలోని ఎగుడు దిగుడుగా కొండప్రాంతం వైపు సాగుతూ ఉంటుంది. .[11] జిల్లాలో సతతహరితారణ్యాలు విస్తారంగా ఉన్నాయి. అరణ్యాలు ప్రణాళికారహిత వాణిజ్య అవసరాలు, నగరీకరణ కారణంగా ధ్వంసం చేయబడుతున్నాయి. అరణ్యాలలో టేకు, కర్మర (ఎబోనీ),విల్డ్ జాక్, భోగి, పలు ఇతర జాతుల వృక్షజాలం కనిపిస్తుంటుంది. దక్షిణ కన్నడ అరణ్యాలలో ఉన్న వృక్షజాలం పలుకారణాల వలన క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంది. మిలిన భారతీయ గ్రామాలలోలాగా కాకుండా దక్షిణ కన్నడ గ్రామాలు తోటలమద్య నిర్మించబడిన గృహసముదాయాలతో కనిపిస్తూ ఉంటాయి. దక్షిణ కన్నడ జిల్లా నివాసగృహాలు వ్యవసాయ తోటలు, పూదోటలు, కొబ్బరి, పోక మొదలైన ప్లాంటేషన్ మద్య నిర్మించబడి ఉన్నాయి. పలు గ్రామాల మద్య కొన్ని వందల మీటర్ల భూభాగం గ్రామాలను ప్రత్యేకంగా విభజిస్తున్నాయి. వ్యవసాయ భూములు, పూదోటలు, అరణ్యభూభాగం మద్య ఉండే గృహసముదాయ దృశ్యాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న జనసంఖ్య, ఉమ్మడికుటుంబాలు అవిచ్ఛిన్నం కావడం కారణంగా 1990 నుండి నివాస గృహాల నిర్మాణం అధికరించడం కారణంగా దక్షిణ కన్నడ జిల్లాలోని పచ్చని వాతావరణం క్షీణించడం మొదలైంది.

విద్య మరియి పరిశోధన

మార్చు
 
జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయము, కర్ణాటక, సురత్కల్
 
సేంట్ అలాసియస్ కాలేజీ

దక్షిణకన్నడ జిల్లా 4 స్థాయిల విద్యావిధానం అనుసరిస్తుంది. ప్రాథమిక, మాద్యమిక విద్య సమాజంలోని అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉంది.[12] జిల్లా అక్షరాస్యత జాతీయ అక్షరాస్యతకంటే అధికంగా ఉంటుంది. ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్న కారణంగా దేశంలోని పలుప్రాంతాల నుండి విద్యార్థులు ఉడిపి, దక్షిణకన్నడ జిల్లాలకు విద్యాధ్యయనం చేయడానికి వస్తుంటారు. జిల్లాలో ఉన్న విద్యాసంస్థలు వైద్య, ఇంజనీరింగ్, మందులతయారీ, నర్సింగ్, హోటెల్ & కోటరింగ్, లా & మేనేజ్మెంటు మొదలైన విద్యలను అందిస్తుంది. జిల్లాలో ప్రఖ్యాత " నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ " (నిట్- కె) విద్యాసంస్థ ఉంది. జిల్లాలో ఫిషరీ కాలేజ్ ఉంది.[13] ఇది కంకనడీ సమీపంలో ఉన్న యెక్కూర్ వద్ద ఉంది. జిల్లా పలు రీసెర్చ్ సంస్థలకు నిలయంగా ఉంది. వీటిలో పుత్తూర్ (కర్ణాటక) వద్ద ఉన్న " నేషనల్ ఇంస్టిట్యూట్ సెంటర్ ఫర్ కాష్యూ " ఒకటి. మరొకటి విట్ల వద్ద ఉన్న సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ ". వి.టి.యు. ఆధ్వర్యంలో పనిచేస్తున్న పలు కాలేజీలు సైన్సు, టెక్నాలజీ సంబంధిత పోస్ట్ గ్రాజ్యుయేట్ కోర్సులు అందిస్తున్నాయి. మంగుళూరులో 6 పైగా రీసెర్చి కేంద్రాలు పి.హెచ్.డి కోర్సులను అందిస్తున్నాయి. అవి మంగుళూరు, మూడబిద్రి, పుత్తూరు, బంత్వల్, ఉజిరె, సులియాల వద్ద ఉన్నాయి.

జిల్లాలో ప్రధానంగా తులు భాష వాడుకలో ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో తులు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.[14] అదనంగా బియరీ భాష, కన్నడ భాషలు వాడుకలో ఉన్నాయి. సమాచార పరిమార్పిడిలో ఆగ్లభాష కూడా వాడుకలో ఉంది.

చారిత్రాత్మక ప్రదేశాలు

మార్చు

కింద ఉన్నవి దక్షిణ కన్నడ జిల్లలో చూడదగిన చారిత్రాత్మక ప్రదేశాలు:[15]

 
Sri Manjunatha Temple at Dharmasthala
దస్త్రం:Kukke Subramanya Swami.jpg
Kukke Subramanya Temple
 
Milagres Church
 • మంగళా దేవి దేవాలయం: మంగళూరు హిందూ మతం దేవత మంగళా పేరు పెట్టారు.
 • వేణూర్ : ప్రముఖ ఏక బాహుబలి విగ్రహం (వేణూర్)
 • కద్రి : ప్రముఖ ఆలయంలోని కద్రి మంజునాథ్ ఆలయం.
 • మూడబిద్రి: పురాతన జైన దేవాలయాలు, భట్టారకుని సీటు సైట్.
 • కృష్ణపుర మఠాన్ని: మఠాన్ని (మఠం) ఒకటి అష్ట మఠాన్ని ఉడుపి చెందిన.
 • ధర్మస్ధల: లార్డ్ ఆఫ్ ది పాపులర్ ఆలయం ధర్మస్ధల దేవాలయం (శ్రీ మంజునతేశ్వర)
 • కటీల్: దేవత శ్రీ దుర్గా పరమేశ్వరి యొక్క ప్రసిద్ధ ఆలయం
 • కుద్రొలి: గొకర్ననథెశ్వర ఆలయం
 • ముంద్కుర్: శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం
 • కరింజెష్వర ఆలయం భారీ రాతి శివ పార్వతి ప్రసిద్ధ పురాతన ఆలయం
 • ఉల్లాల్: అద్భుతమైన సైట్ బీచ్ లో సూర్యాస్తమయం చూసిన
 • కుక్కే సుబ్రహ్మణ్య: పాము లార్డ్ సుబ్రహ్మణ్య యొక్క ప్రసిద్ధ పురాతన ఆలయం ఇక్కడ ఉన్న.
 • ముల్కి, భారతదేశం : దుర్గపరమెశ్వరి ఆలయం
 • సెయింట్ అలోయ్సిస్ చాపెల్, మంగళూరు
 • మిలగ్రెస్ చర్చి (మంగళూరు)
 • సయ్యద్ మదనీ మసీదు, దర్గా (ఉల్లాల్)
 • సుల్తాన్ బ్యాటరీ (మంగళూరు), మంగళూరు
 • పుత్తూర్ (కర్ణాటక) : శ్రీ మహాలింగేశ్వర యొక్క ప్రసిద్ధ దేవాలయం
 • విట్టల్: పంచలింగేశ్వర ఆలయ ప్రసిద్ధ పురాతన ఆలయం
 • ఉప్పినంగది: సహస్రలింగెష్వర ఆలయం.
 • కెపు, అనంతది (బల్నదు) : దేవత ఉల్లల్థి దేవాలయానికి ప్రసిద్ధి.
 • సోమనాథేశ్వర్ ఆలయం: సోమేశ్వర, ఉల్లాల్.
 • వేసవి శాండ్: ఉల్లాల్ బీచ్, ఉల్లాల్.
 • పిలికుల నిసర్గదమ: పిలికుల, మూదుసెద్దె, మంగళూరు.
 • కుదుపు ఆలయం: కుదుపు, మంగళూరు.
 • కుంబ్లది బలసుబ్రహ్మన్య
 • చర్వక కపిలేస్వర దేవస్థాన
 • శ్రీ క్షేత్ర దైపిల

Dakshina Kannada district features a Tropical Monsoon climate (Am) according to the Koppen-Geiger climate classification.[16] The rainfall varies from 3,796.9 మిల్లీమీటర్లు (149 అం.) at the Mangalore coast, 4,530 మిల్లీమీటర్లు (178 అం.) at Moodabidri and 4,329 మిల్లీమీటర్లు (170 అం.) at Puttur near the Western Ghats. The average humidity is 75% and peaks in July at 89%.

శీతోష్ణస్థితి డేటా - Mangalore, India
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 36.6
(97.9)
38.2
(100.8)
39.8
(103.6)
37.8
(100.0)
38.0
(100.4)
36.4
(97.5)
33.3
(91.9)
33.3
(91.9)
35.4
(95.7)
35.2
(95.4)
36.6
(97.9)
35.8
(96.4)
39.8
(103.6)
సగటు అధిక °C (°F) 32.8
(91.0)
33.0
(91.4)
33.5
(92.3)
34.0
(93.2)
33.3
(91.9)
29.7
(85.5)
28.2
(82.8)
28.4
(83.1)
29.5
(85.1)
30.9
(87.6)
32.3
(90.1)
32.8
(91.0)
31.5
(88.7)
రోజువారీ సగటు °C (°F) 26.8
(80.2)
27.4
(81.3)
28.6
(83.5)
29.5
(85.1)
29.2
(84.6)
26.6
(79.9)
25.6
(78.1)
25.7
(78.3)
26.3
(79.3)
27.0
(80.6)
27.4
(81.3)
27.0
(80.6)
27.3
(81.1)
సగటు అల్ప °C (°F) 20.8
(69.4)
21.8
(71.2)
23.6
(74.5)
25.0
(77.0)
25.1
(77.2)
23.4
(74.1)
22.9
(73.2)
23.0
(73.4)
23.1
(73.6)
23.1
(73.6)
22.4
(72.3)
21.2
(70.2)
22.9
(73.2)
అత్యల్ప రికార్డు °C (°F) 16.1
(61.0)
17.3
(63.1)
18.8
(65.8)
19.7
(67.5)
20.4
(68.7)
20.5
(68.9)
19.8
(67.6)
19.4
(66.9)
20.2
(68.4)
19.1
(66.4)
15.9
(60.6)
16.1
(61.0)
15.9
(60.6)
సగటు వర్షపాతం mm (inches) 1.1
(0.04)
0.2
(0.01)
2.9
(0.11)
24.4
(0.96)
183.2
(7.21)
1,027.2
(40.44)
1,200.4
(47.26)
787.3
(31.00)
292.1
(11.50)
190.8
(7.51)
70.9
(2.79)
16.4
(0.65)
3,796.9
(149.48)
సగటు వర్షపాతపు రోజులు 0.2 0 0.3 1.6 7 23.5 27.4 24.9 13.7 9.1 3.6 0.6 111.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 62 66 68 71 71 87 89 88 85 79 73 65 75
Mean monthly sunshine hours 313 296 299 292 276 119 94 133 178 226 271 292 2,789
Source 1: India Meteorological Department - Monthly mean maximum & minimum temperature and total rainfall [17][18]
Source 2: Weather-And-Climate (Humidity and Sunshine hours) [19][20]
శీతోష్ణస్థితి డేటా - 1994 rainfall in Mangalore, India
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు వర్షపాతం mm (inches) 2.5
(0.10)
0.0
(0.0)
0.0
(0.0)
97.2
(3.83)
66.2
(2.61)
1,920.6
(75.61)
1,549.3
(61.00)
925.2
(36.43)
179.9
(7.08)
290.9
(11.45)
51.7
(2.04)
0.0
(0.0)
5,083.5
(200.14)
Source 1: India Meteorological Department - Mangalore climate summary from 1957-2000
http://www.imd.gov.in/section/nhac/mean/MANGALORE.htm [21]
Source 2: TuTiempo - Mangalore climate from 1973-2014
http://www.tutiempo.net/en/Climate/Mangalore_Bajpe/432840.htm [22]


శీతోష్ణస్థితి డేటా - Puttur, India
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 31.3
(88.3)
31.8
(89.2)
32.7
(90.9)
33.1
(91.6)
32.4
(90.3)
29.3
(84.7)
28.0
(82.4)
28.2
(82.8)
28.8
(83.8)
29.9
(85.8)
30.8
(87.4)
31.2
(88.2)
30.6
(87.1)
రోజువారీ సగటు °C (°F) 26
(79)
26.9
(80.4)
28.1
(82.6)
29.1
(84.4)
28.8
(83.8)
26.4
(79.5)
25.5
(77.9)
25.6
(78.1)
25.9
(78.6)
26.5
(79.7)
26.6
(79.9)
26.1
(79.0)
26.8
(80.2)
సగటు అల్ప °C (°F) 20.8
(69.4)
22.0
(71.6)
23.6
(74.5)
25.2
(77.4)
25.2
(77.4)
23.5
(74.3)
23.0
(73.4)
23.1
(73.6)
23.0
(73.4)
23.2
(73.8)
22.4
(72.3)
21.0
(69.8)
23.0
(73.4)
సగటు వర్షపాతం mm (inches) 0
(0)
1
(0.0)
6
(0.2)
63
(2.5)
208
(8.2)
938
(36.9)
1,489
(58.6)
858
(33.8)
386
(15.2)
277
(10.9)
81
(3.2)
22
(0.9)
4,329
(170.4)
Source: Climate-Data.org - Climate Table of Puttur, Karnataka, India [23]


శీతోష్ణస్థితి డేటా - Moodabidri, India
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 31.2
(88.2)
31.4
(88.5)
32.4
(90.3)
32.8
(91.0)
32.4
(90.3)
32.2
(90.0)
29.2
(84.6)
27.8
(82.0)
28.5
(83.3)
29.7
(85.5)
30.8
(87.4)
31.3
(88.3)
30.8
(87.4)
రోజువారీ సగటు °C (°F) 25.8
(78.4)
26.4
(79.5)
27.9
(82.2)
28.9
(84.0)
28.6
(83.5)
26.3
(79.3)
25.3
(77.5)
25.5
(77.9)
25.6
(78.1)
26.3
(79.3)
26.4
(79.5)
26.0
(78.8)
26.6
(79.8)
సగటు అల్ప °C (°F) 20.5
(68.9)
21.5
(70.7)
23.4
(74.1)
25.1
(77.2)
25.1
(77.2)
23.4
(74.1)
22.9
(73.2)
23.0
(73.4)
22.8
(73.0)
23.0
(73.4)
22.1
(71.8)
20.8
(69.4)
22.8
(73.0)
సగటు వర్షపాతం mm (inches) 1
(0.0)
0
(0)
5
(0.2)
46
(1.8)
204
(8.0)
1,048
(41.3)
1,511
(59.5)
933
(36.7)
422
(16.6)
260
(10.2)
80
(3.1)
20
(0.8)
4,530
(178.2)
Source: Climate-Data.org - Climate Table of Moodabidri, Karnataka, India [24]

Cultures, Traditions and rituals

మార్చు
 
Yakshagana stage
 
Traditional House in Dakshina Kannada

దక్షిణ కన్నడ ఆచారాలకు, సంప్రదాయాలకు, సంస్కృతికి నిలయం. ప్రజలు ప్రస్తుత కాలంలో కూడా ఆచారాలు, సంప్రదాయాలు, మతాచారాలు అనుసరిస్తూనే ఉన్నారు. జిల్లాలో హిందూ దేవుళ్ళు, దేవతలకు చెందిన పలు ఆలయాలు ఉన్నాయి. అవి అతి పురాతనమైనవి, లోతైన ఆధ్యాత్మిక అనుబంధం కలిగి ఉన్నాయి. దక్షిణ కన్నడ ప్రజలు నాగదేవత అయిన సుభ్రహ్మణ్యస్వామిని (మురుగన్) ఆరాధిస్తుంటారు. పురాణ కథనాలను అనుసరించి జిల్లా భూభాగం సముద్ర నుండి పరశురాముని కొరకు వెలువడిందని విశ్వసిస్తున్నారు. నాగజాతిని రక్షించడానికి నాగారాధన ఆచరించబడిందని భావిస్తున్నారు.[25] ఈ ప్రాంతంలో పితృదేవతారాధన కూడా ప్రజలలో వాడుకలో ఉంది. భుటాకోల వంటి ఆరాధనా కార్యక్రమాల ద్వారా పితృదేవతలను ఆరాధిస్తుంటారు. కంబల పేరుతో వరి పొలాలలో బర్రెల పందాలు నిర్వహించబడుతుంటాయి. మతపరమైన, సాంస్కృతిక స్థాయిలో తెయ్యం దేవతలకు రక్తం, కోడిని సమర్పించడం ఆచారంగా ఉంది. సాంస్కృతిక ఉత్సవాలలో కోడి పందాలు కూడా నిర్వహించబడుతుంటాయి. [26] గ్రామీణ పామర ప్రజలకు కోడి పందాలు కాలక్షేపంగా ఉంటుంది. దురదృష్టకరంగా కోడిపందాలు (కోరి కట్టా) జూదాలకు దారితీస్తున్నాయి. యక్షగానం ప్రముఖ జానపద కళగా గుర్తించబడుతుంది. సాధారణంగా యక్షగానం రాత్రంతా ప్రదర్శించబడుతూ ఉంటుంది. యక్షగానానికి తులునాడులో అత్యంత అభిమానుల ఆదరణ లభిస్తుంది. .[27][28] జిల్లాలోని యువత, పెద్దవారిలో కూడా పులివేషం (హుళివేషం) ప్రత్యేక జానపద కళారూపం ప్రాబల్యం సంతరించుకుంది. ఇది మైసూరు దసరా ఉత్సవాలు, కృష్ణజమాష్టమి దినాలలో ప్రదర్శించబడుతుంది. [29] జిల్లాలో కరడి వేష (ఎలుగుబంటు వేషం) నృత్యరూపం అధిక ప్రాబల్యం కలిగి ఉంది. ఇది మైసూరు దసరా ఉత్సవాలలో ప్రదర్శించబడుతూ ఉంది. [30] కంబల లేక బర్రెల పందాలు వరి పొలాలలో నిర్వహించబడుతుంటాయి.

దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఉగాది, కృష్ణజయంతి, గణేశచతుర్ధి, నవరాత్రి, దసరా, దీపావళి, అతి హునిమె మొదలైన హిందూ పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటారు.

దక్షిణకన్నడ బసు సర్వీసులను ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక స్టేట్ రోడ్డు ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ (కె.ఎస్.ఆర్.టి.సి) ఆధ్వర్యంలో నడుపబడుతున్నాయి. జిల్లాలో 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు నడిపే ట్రాంస్‌పోర్ట్ బసులు ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తుంది. .[31][32]

జిల్లాలో మూడు జాతీయరహదారులు పయనిస్తున్నాయి. ఇవి జిల్లాను కర్ణాటకలోని పలు ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి. జాతీయ రహదారి 17 జిల్లాను ఉడిపి, కర్వార్, ముంబయి, గోవా, కొచ్చిలతో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షోలాపూర్‌తో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 48 జిల్లాను బెంగుళూరు, హాసన్, సక్లేష్‌పురాతో అనుసంధానిస్తుంది. మంగుళూర్ - ముదిగెరె రాష్ట్రీయ రహదారి జాతీయరహదారి 234గా ప్రకటించబడింది. జాతీయరహదారి 234 మంగుళూరును చర్మాడి, ముదిగెరె, బేలూర్, హళిబీడు, చింతామణి, వేలూరు మీదుగా తమిళనాడులోని విల్లిపురంతో అనుసంధానిస్తుంది.[33]

రైలు మార్గం

మార్చు

సా.శ. 1907లో జిల్లా మొదటి రైలు మార్గం నిర్మించబడింది. రైలుమార్గం జిల్లాను అళికల్‌తో అనుసంధానిస్తుంది. ఈ రైలు మార్గం జిల్లాను మద్రాసు ప్రెసిడెన్సీ లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. కొంకణి రైలుమార్గం (1988) దక్షిణకన్నడ జిల్లాను మహారాష్ట్రా, గోవా, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, కేరళలతో అనుసంధానిస్తుంది. మంగుళూరు నుండి ముంబయి, తానే, చెన్నై, గోవా, త్రివేండ్రం లకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. మీటర్ గేజి రైలు మార్గం బ్రాడ్ గేజిగా మార్చబడిన తరువాత బెంగుళూరు నుండి హాసన్ కుక్కి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం అనుసంధానిస్తూ మంగుళూరు వరకు రైళ్ళు నడుపబడుతున్నాయి. కేరళాలో మొదలై గుజరాత్, రాజస్థాన్, గోవా, ఢిల్లీలతో అనుసంధానించబడిన రైళ్ళు జిల్లా మీదుగా పయనిస్తున్నాయి.

నౌకాశ్రయం

మార్చు

దక్షిణకన్నడ జిల్లాలో పనంబూర్ వద్ద నౌకాశ్రయం ఉంది. ఈ నౌకాశ్యయాన్ని మంగుళూరు పోర్ట్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఇక్కడ నుండి కార్గో, టింబర్, పెట్రోలియం, క్రూడాయిల్ ఎగుమతి చేయబడుతున్నాయి. పశ్చిమభారత తీరంలో ప్రధాన నౌకాశ్రయాలలో ఇది ఒకటి.

వాయిమార్గం

మార్చు

జిల్లాకు సమీపంలోని విమానాశ్రయం " మంగుళూరు విమానాశ్రయం". (ఇది బజ్పీ వద్ద ఉంది).[34] కర్నాటక రాష్ట్రంలో రైలుమార్గం, రహదారి మార్గం, వాయు మార్గం, నౌకా మార్గాలతో అనుసంధానితమై ఉన్న ఒకేఒక నగరం మంగళూరు నగరం ఒక్కటే.

 
Arecanut plantation in DK
 
Monsoon scene of rural Dakshina Kannada

జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధాన జివనాధారాంగా ఉంది. ఇతర రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడిన ప్రజలద్వారా వచ్చి పడుతున్న పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం వ్యవసాయం మీద ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. ఈ జిల్లా నుండి గుర్తించతగినంత మంది దేశంలోని ఇతర రాష్ట్రాలు, గల్జ్ దేశాలలో పనిచేస్తూ ఉన్నారు. పొలాలు, తోటలు నివాసగృహాలు, షాపింగ్ కాంప్లెక్సులుగా మార్చబడుతున్నాయి. కూలీలు అధికం కావడం, శ్రామికులు లభించక పోవడం మొదలైన కారణాలతో హార్టికల్చర్ కూడా వెనుకబడి పోతుంది. అసమానమైన భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయ భూములు చిన్న చిన్న భూభాగాలుగా ఉన్నందున యంత్రాలవాడకం సాధ్యపడడం లేదు. జిల్లాలో ప్రధానంగా వరి, కొబ్బరి, పోక, నల్లమిరియాలు, కోకో పండించబడుతున్నాయి. వార్షికంగా వరి మూడు మార్లు పండించబడుతుంది. కార్తిక (యెనెల్) (మే నుండి అక్టోబరు) సుగ్గి (అక్టోబరు నుండి జనవరి), కొలకె (జనవరి నుండి ఏప్రిల్) మాసాలలో వరి పండించబడుతుంది.[35] వరి పంటకు నీరు పుష్కలంగా లభించడమే అందుకు కారణం. సుగ్గి సీజన్లో కొన్ని ప్రాంతాలలో మినుములు పండించబడుతున్నాయి. కూరగాయలు, పండ్లు, పూతోటలు స్వంత ఉపయోగానికి పండించబడుతున్నాయి. వీటి అమ్మకం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొరకు జిల్లాలోని పలు తాలూకాలలో (ఎ.పి.ఎం.సి) మార్కెట్ నిర్వహించబడుతుంది. మంగుళూరు లోని కులశేఖర వద్ద ది కర్నాటక మిల్క్ ఫెడరేషన్ పనిచేస్తుంది. ఈ ప్లాంటు వ్యవసాయదారుల పశువుల నుండి పాలను సేకరించి ప్రజలకు విక్రయిస్తుంది.[36]

ఆర్ధికం

మార్చు

జిల్లా " క్రేడిల్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ " అని పిలువబడుతుంది. [37] అలాగే కర్నాటక రాషట్రంలో అధికంగా పారిశ్రామీకరణ చేయబడిన జిల్లాగా గుర్తించబడుతుంది. కనరాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంక్, ప్రైవేట్ సెక్టరుకు చెందిన కర్నాటక బ్యాంకు మొదలైన జాతీయం చేయబడిన ప్రధాన బ్యాంకులు ఈ జిల్లాలో ఆరంభం అయ్యాయి. [38]

 
Houses with Mangalore Tiles

మంగుళూరు పెంకులు (ఎర్రమట్టి పెంకులు), జీడిపప్పు తయారీ పరిశ్రమలు, బీడి పరిశ్రమలు ఒకప్పుడు ఈ జిల్లాలో ఉచ్చస్థితిలో ఉండేవి. సేవారంగం, ప్రొఫెషనల్ ఎజ్యుకేషన్ ఇంస్టిట్యూట్లు, ఇంఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నాయి.

జిల్లా అరేబియన్ సముద్రతీరంలో ఉంది. సముద్రతీరంలో ఉన్న కారణంగా చేపలు పట్టడం ప్రజల ప్రధానవృత్తిగా మారింది. బుండర్ (పాత నౌకాశ్రయం), పనంబూర్, కోటేశ్వర్, ససిహితులు.

జిల్లాలో ప్రధాన పరిశ్రమలు మంగుళూరు పరిసరప్రాంతాలలో కేంద్రీకరించబడి ఉన్నాయి. మంగుళూరు కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, (ఎం.ఎఫ్.సి), కుద్రెముఖ్ ఇరన్ ఓర్ కంపనీ లిమిటెడ్, కనరా వర్క్ షాప్స్ లిమిటెడ్ (కనరా స్ప్రింగ్స్ తయారీ), మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికస్ లిమిటెడ్ [39] బి.ఎ.ఎస్.ఎఫ్. టోటల్ గాజ్, భారతి షిప్యార్డ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎల్), మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలోని పుత్తూరు వద్ద కాంప్కొ నిర్వహిస్తున్న చాక్లెట్ తయారీ కంపనీ ఉంది.[40]

ప్రధాన ఇంఫర్మేషన్ టెక్నాలజీ, ఔట్ సౌర్సింగ్ మంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. జిల్లాలో ఇంఫోసిస్, లేజర్‌సాఫ్ట్ సిస్టంస్ లిమిటెడ్, ఎంఫాసిస్ బి.పి.ఒ మొదలైన ఐ.టి కంపనీలు ఉన్నాయి. విప్రొ కంపనీ కూడా మంగుళూరులో స్థిరపడే ప్రయత్నాలు చేస్తుంది. ఐ.టి డెడికేటెడ్ కంపనీలు నిర్మాణదశలో ఉన్నాయి. గంజిమఠ్ వద్ద " ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ " (ఇ.పి.ఐ.పి) ఒకటి, మంగుళూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరొక ఐ.టి సెజ్ నిర్మాణదశలో ఉన్నాయి. మూడవ ఐ.టి సెజ్ గంజిమఠ్ వద్ద ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది. ఆయిల్, గ్యాస్ కాత్పొరేషన్ ఒ.ఎన్.జి.సి. 35,000 కోట్ల పెట్టుబడితో " మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) స్థాపించాలని యోచిస్తుంది. .[41] 2 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంలో మరొక ఐ.టి సెజ్ నిర్మాణదశలో ఉంది. ఇది వ్యాపారకూడలి, కాంవెంషన్ కూడలి, మ్మాల్, హెలిపాడ్ సౌకర్యాలతో కూడుకుని ఉంటుందని భావిస్తున్నారు .[42]

Demand for a separate Tulunadu state

మార్చు

స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగిన సమయంలో తులువ ప్రజలు తులువ భాషకు అధికార హోదా, ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటం సాగించారు. ప్రస్తుత కర్ణాటక రాషంలోని దక్షిణ కన్నడ, ఉడిపి, కేరళ రాషంలోని కాసరగాడ్ జిల్లాలను కలిపిన భూభాన్ని కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం సాగించారు. తరువాత ఇది కొంత ఆణిచివేయబడినప్పటికీ సమీపకాలంగా ఈ కోరిక తిరిగి బలపడుతూ ఉంది. తులు రాజ్య హోరాట సమితి వంటి సంస్థలు ఈ కోరికను కేంద్రీకరించి తరచుగా సమావేశాలు, ప్రదర్శనలు తులువనాడు లోని పట్టణాలలో పోరాటం సాగిస్తున్నారు. తులు అధికారభాషగా చేయడం, తులువనాడులో తులువ భాషను బోధనా భాషగా చేయడం, తులు సంప్రదాయ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఈ పోరాటానికి ప్రధానాంశాలుగా పోరాటం కొనసాగుతూనే ఉంది. .[43][44][45][46]

మూలాలు

మార్చు
 1. "Karnataka Holidays - Bandaje Falls". Karnataka Holidays. Archived from the original on 14 మార్చి 2015. Retrieved 31 January 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 2. "Dakshina Kannada District : Census 2011 data". Census 2011. Retrieved 31 January 2015.
 3. "Brief Industrial Profile of Dakshina Kannada District" (PDF). Government of India - Ministry of MSME. Archived from the original (PDF) on 12 మార్చి 2014. Retrieved 31 January 2015.
 4. "Dakshina Kannada Tehsil Map". Maps Of India. Retrieved 31 January 2015.
 5. "Imperial Gazetteer of India, South Kanara". dsal.uchicago.edu. Retrieved 4 September 2009.
 6. "South Kanara, 1799-1860: A Study in Colonial Administration and Regional Response". N. Shyam Bhat. Retrieved 31 January 2015.
 7. Patsy Lozupone, Bruce M. Beehler, Sidney Dillon Ripley.(2004).Ornithological gazetteer of the Indian subcontinent, p. 82.Center for Applied Biodiversity Science, Conservation International. ISBN 1-881173-85-2.
 8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Macedonia 2,077,328 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
 11. Mausam: quarterly journal of meteorology, hydrology & geophysics, Volume 56, Issue 1. India Meteorological Department. 2005. p. 76.
 12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2015-02-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 13. "College of Fisheries, Mangaluru". kvafsu. 31 August 2006. Archived from the original on 4 అక్టోబరు 2017. Retrieved 7 September 2009. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 14. "Imperial Gazetteer of India, South Kanara". dsal.uchicago.edu. Retrieved 4 September 2009.
 15. "ఆర్కైవ్ చేసిన కాపీ". Archived from the original on 22 ఫిబ్రవరి 2015. Retrieved 4 ఫిబ్రవరి 2015.
 16. "Climate Table of Moodabidri, Karnataka, India". Climate-Data.org. Retrieved 31 January 2015.
 17. "IMD - Monthly mean maximum & minimum temperature and total rainfall based upon 1901 - 2000 data" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 17 అక్టోబరు 2015. Retrieved 24 December 2014.
 18. "Extremes of India" (PDF). Indian Meteorological Department. Archived from the original (PDF) on 16 మార్చి 2014. Retrieved January 25, 2015.
 19. "Average humidity over the year for Mangalore,India". Weather-And-Climate. Retrieved 11 December 2014.
 20. "Average monthly hours of sunshine over the year for Mangalore,India". Weather-And-Climate. Retrieved January 30, 2015.
 21. "IMD - total rainfall summary for Mangalore". India Meteorological Department. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 24 December 2014.
 22. "TuTiempo - Mangalore climate from 1973-2014". Tutiempo. Retrieved 27 December 2014.
 23. "Climate Table of Puttur, Karnataka, India". Climate-Data.org. Retrieved 31 January 2015.
 24. "Climate Table of Moodabidri, Karnataka, India". Climate-Data.org. Retrieved 1 February 2015.
 25. "Nagarapanchami Naadige Doddadu". Mangalorean.Com. Archived from the original on 9 ఫిబ్రవరి 2012. Retrieved 28 January 2008. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 26. A Panorama of Indian Culture: Professor A. Sreedhara Menon Felicitation Volume - K. K. Kusuman - Mittal Publications, 1990 - p.127-128"[1]"
 27. "Yakshagana". SZCC, Tamil Nadu. Archived from the original on 17 ఆగస్టు 2007. Retrieved 4 ఫిబ్రవరి 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 28. Plunkett, Richard (2001). South India. Lonely Planet. p. 53. ISBN 1-86450-161-8.[permanent dead link]
 29. Pinto, Stanley G (26 October 2001). "Human `tigers' face threat to health". Times of India. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 7 December 2007. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 30. Stephen D'Souza. "What's in a Name?". daijiworld.com. Archived from the original on 5 మార్చి 2008. Retrieved 4 March 2008.
 31. "The Beginning". canarasprings.in. Archived from the original on 2 మే 2014. Retrieved 1 May 2014. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 32. "Wheels of change turn Karnataka State Transport Corporation into winner". timesofindia. Retrieved 1 May 2014.
 33. "DK's New NH to connect three states". timesofindia.com. Archived from the original on 2011-08-11. Retrieved 16 November 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 34. "Airports Authority of India". Airports Authority of India. Archived from the original on 7 ఫిబ్రవరి 2015. Retrieved 31 January 2015.
 35. "South Kanra". dsal.uchicago.edu/reference/. Retrieved 4 September 2006.
 36. "Agriculture Contingency Plan for District: DAKSHINA KANNADA" (PDF). Agricoop. Retrieved 31 January 2015.
 37. "Brief history of banking in India". GK Today. Retrieved 10 January 2015.
 38. "The Evolution of Banking in India" (PDF). Avishkar – Solapur University Research Journal, Volume 2, 2012. Archived from the original (PDF) on 29 మే 2015. Retrieved 31 January 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 39. "Mangalore Refinery and Petrochemicals Limited". MRPL. 31 January 2015. Retrieved 31 January 2015.
 40. "The CAMPCO Ltd". Puttur, Karnataka, India: Campco. 31 January 2015. Archived from the original on 21 జనవరి 2015. Retrieved 31 January 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 41. "ONGC's huge outlay for Mangalore SEZ". Chennai, India: The Hindu. 19 September 2006. Archived from the original on 20 మార్చి 2007. Retrieved 29 September 2006. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 42. "Two more plans for EPIP cleared". Chennai, India: The Hindu. 31 August 2006. Archived from the original on 25 అక్టోబరు 2012. Retrieved 29 September 2006.
 43. http://webcache.googleusercontent.com/search?q=cache:TF4m2ofQx1UJ:www.deccanherald.com/Archives/oct222006/district1955220061020.asp+tulu+separate+state&cd=6&hl=en&ct=clnk&gl=in[dead link]
 44. "News headlines". Archived from the original on 2012-03-04. Retrieved 2015-02-04.
 45. "Tulu organisations to meet soon". The Hindu. Chennai, India. 6 March 2008. Archived from the original on 4 మార్చి 2012. Retrieved 4 ఫిబ్రవరి 2015.
 46. "Beltangady Litterateur Kudyady Vishwanath Rai Voices Need for Tulunadu State". Archived from the original on 2020-01-11. Retrieved 2015-02-04.

బయటి లింకులు

మార్చు