సింధీ కాలనీ
సింధీ కాలనీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రాంతం.[1] ఇది సికింద్రాబాదుకు ప్రధాన శివారు ప్రాంతంగా ఉంది. 1947లో భారత విభజన తరువాత పాకిస్తాన్‌లో భాగమైన సింధ్ నుండి వచ్చిన శరణార్థ సింధీ ప్రజలను ఉంచడానికి ఇది ఏర్పాటుచబడింది. ఇది హైదరాబాదు నగరానికి ఉత్తర దిశలో ఉంది.
సింధీ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°28′N 78°31′E / 17.467°N 78.517°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 015 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
చరిత్ర
మార్చుఇక్కడ సింధీ కాలనీని నిర్మించటానికి ముందు, హుస్సేన్ సాగర్ సరస్సు వెనుక వైపు ఉన్న ప్రాంతాలు అదనపు నీటిని కలిగి ఉన్నాయి. ఇక్కడి మొదటి ఆనకట్టను 1946లో మైఖేల్ బేక్స్ నిర్మించాడు.
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమాపంలో జోఘని, ప్రేందర్‌ఘాస్ట్ రోడ్, పైగా కాలనీ, గన్ బజార్, మినిస్టర్ రోడ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం
మార్చుదీనికి శివారులో అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. 2002లో అనేక వస్త్ర పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు ఇక్కడ షాపింగ్ చేయడానికి వస్తారు.
ప్రార్థనా స్థలాలు
మార్చుఇక్కడికి సమీపంలో కనకదుర్గ దేవాలయం, హనుమాన్ దేవాలయం, సాయిబాబా దేవాలయం, బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరం, షియా ఇమామి ఇస్మాయిలీ జమత్ఖానా, జమత్ఖానా, మసీదు ఇ నజీరియా మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సింధీ కాలనీ మీదుగా సికింద్రాబాద్, సనత్‌నగర్, ఆల్విన్ కాలనీ, భరత్ నగర్, బోరబండ, కొండపూర్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[2]
మూలాలు
మార్చు- ↑ "Sindhi Colony , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-31.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.