ఆల్విన్ కాలనీ
ఆల్విన్ కాలనీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1] ఇది హైదరాబాదు నగరానికి వాయవ్యంలో ఉన్న కూకట్‌పల్లికి సమీపంలో ఉంది. ఈ కాలనీ 1వ,[2] 2వ[3] ఫేజ్ లుగా విభజించారు. హైదరాబాదు ఆల్విన్ కంపెనీ తన ఉద్యోగుల కోసం 1980లలో ఈ కాలనీ నిర్మించింది.
ఆల్విన్ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 072 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
2015 హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి జోన్ పరిధిలోని కొత్త కార్పోరేషన్ వార్డుగా ఏర్పడింది.
చరిత్ర
మార్చుఆల్విన్ హౌసింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ అభివృద్ధి చేయబడింది. ఇందులో ఎ-టైప్, బి-టైప్, సి-టైప్ వంటి రకాలతో గృహాలను నిర్మించారు. ఎ-టైప్‌లో 120 గజాల భూమి ఉండగా, బి-టైప్ & సి-టైప్ క్వార్టర్స్‌లో 96 గజాలు ఉన్నాయి. లాటరీ పద్ధతి ఆధారంగా ఇవి కేటాయించబడ్డాయి. నిర్మాణం తరువాత, సొసైటీ దశ -1లో 600 ప్లాట్లను రూపొందించి, వీటిని 1987లో లాటరీ ద్వారా సభ్యులకు కేటాయించారు. 2011లో మంజీరా నీరు, విద్యుత్, రవాణా, దేవాలయాలు, వాణిజ్య సముదాయం, కళ్యాణ మండపం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా సొసైటీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆల్విన్ కాలనీలో 1000 కంటే ఎక్కువ సొంత గృహాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
- 10ఎ/ఎస్: సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుకు వెళుతుంది (ఎర్రగడ్డ మీదుగా)
- 185ఎస్: కోఠి, సిబిఎస్‌కు వెళుతుంది (ఎర్రగడ్డ మీదుగా)
- 30ఎ: సికింద్రాబాదుకు వెళుతుంది (జగద్గిరిగుట్ట, బాలానగర్ మీదుగా)
- 19కె/ఎ: మెహిదీపట్నం వెళ్తుంది (కూకట్‌పల్లి, అమీర్‌పేట, బంజారా హిల్స్ మీదుగా)
- 10కె/జె: జగద్గిరిగుట్ట నుండి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు (ఆల్విన్ కాలనీ, ఎర్రగడ్డ మీదుగా),
భరత్ నగర్ రైల్వే స్టేషను, బోరబండ రైల్వే స్టేషను ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
సమీప ప్రాంతాలు
మార్చువివేకానంద నగర్ కాలనీ, వెంకట్పపయ్య నగర్, సాయినగర్, కమల ప్రసన్న నగర్, మాధవరం నగర్, తులసి నగర్, భాగ్యనగర్ కాలనీ, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మ బండ, వెంకటేశ్వర నగర్, కూకట్ పల్లి మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.
- ↑ "1st Phase Allwyn Colony, Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.
- ↑ "2nd Phase, Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.