సిద్ధార్థనగర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
(సిద్దార్థనగర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సిద్ధార్థనగర్ జిల్లా (హిందీ:सिद्धार्थनगर ज़िला) (ఉర్దు: سدھارتھ نگر ضلع) ఒకటి. నౌగఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సిద్ధార్థనగర్ జిల్లా బస్తీ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లాకేంద్రం నౌగఢ్‌కు 22 కి.మీ దూరంలో ఉన్నపిప్రాలి గ్రామంలో శాక్య జనపద శిథిలాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో సిద్ధార్థనగర్ జిల్లా ఒకటి. 2001 సాంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది..[1]

సిద్ధార్థనగర్ జిల్లా
సిద్ధార్థనగర్
జిల్లా
పిప్రహ్వా వద్ద స్థూప
పిప్రహ్వా వద్ద స్థూప
సిద్ధార్థనగర్ జిల్లా is located in Uttar Pradesh
సిద్ధార్థనగర్ జిల్లా
సిద్ధార్థనగర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
Coordinates: 27°0′N 82°45′E / 27.000°N 82.750°E / 27.000; 82.750 - 27°28′N 83°10′E / 27.467°N 83.167°E / 27.467; 83.167
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజన్బస్తీ
విస్తీర్ణం
 • Total2,752 కి.మీ2 (1,063 చ. మై)
జనాభా
 (2011)
 • Total25,53,526
 • జనసాంద్రత882/కి.మీ2 (2,280/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN CODE
272207
Vehicle registrationUP 55
అక్షరాస్యత67.81 per cent%

పేరు వేనుక చరిత్ర

మార్చు

రాజకుమారూడు సిద్ధార్ధ ఇక్కడ జన్మించినందున ఈ జిల్లాకు ఈ పేరు నిర్ణయించబడింది. ఙానోదయం రావడానికి ముందు గౌతమ బుద్ధుని పేరు సిద్ధార్ధుడు. 29 సంవత్సరాల ముందు వరకు బుద్ధుడు కపిలవస్తులో నివసించాడు.

చరిత్ర

మార్చు

సిద్ధార్ధ్ నగర్ జిల్లా 1988 డిసెంబరు 29న బస్తీ జిల్లా ఉత్తర భూభాగం నుండి కొంతభూభాగం వేరుచేసి రూపొందించబడింది. ప్రస్తుతం పిప్రవ (సిద్ధార్ధ్ నగర్‌కు 22కి.మీ) పురాతన కపిలవస్తు నగరమని భావిస్తున్నారు. కపిలవస్తు నగరంలో గౌతమ బుద్ధుడు జన్మించి ఆరంభకాల జీవితం గడిపాడు. కపిలవస్తు శాఖ్యరాజ్యానికి రాజధానిగా ఉండేది. అందుకని గౌతమ బుద్ధుడిని శాఖ్యముని అని కూడా అంటారు. క్రీ.పూ 6వ శతాబ్దంలో ఉన్న 16 స్వతంత్ర రాజ్యాలలో శాఖ్యరాజ్యం ఒకటి. రాజకుమారుడు గౌతముడు తన 29వ సంవత్సరంలో కపులవస్తు నగరాన్ని విడిచి తరువాత 12 సంవత్సరాలకు తిరిగి కపిలవస్తు నగరంలో ప్రవేశించాడు. .

ప్రస్తుత కపిలవస్తు

మార్చు

ప్రస్తుత కపిలవస్తులో పలు గ్రామాలు ఉన్నాయి. పిప్రవ, గంవరియా. పురాత ప్రదేశంలో గౌతమబుద్ధుని అస్థికలు నిక్షేపించిన బృహత్తర స్థూపం నిర్మించబడి ఉంది. పిప్రవలో పురాతన బ్రాహ్మీ శిలాక్షరాలు లభించాయి. రాజాభవన శిథిలాలు విశాలమైన ప్రాంగణమంతా విస్తరించి ఉన్నాయి. ఆర్కిటెక్చురల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన వస్తువుల ఆధారంగా ఈ ప్రాంతంతో కుషానులకు సంబంధం ఉందని భావిస్తున్నారు. స్థూపం వద్ధ నిర్వహించిన త్రవ్వకాలలలో ఇక్కడ దేవపుత్ర పేరుతో ఒక పురాతన స్థూపంఉండేదని ౠజువైంది. దగ్గరదగ్గరా ఉన్న రెండు గుట్టల వద్ద త్రవ్వకాలను నిర్వహించినప్పుడు శుద్ధోధనుని రాజభవన చుహ్నాలు బయటపడ్డాయి.

ప్రముఖులు

మార్చు

జిల్లాలోని ప్రఖులలో అహ్మద్ హుస్సేన్ అక్రహ్ర, ఖజురియా, బాద్షా మెహ్ది హసన్ ఖాన్ ఖజురియా, స్వాతంత్ర్య సమరయోధుడు ఖాజీ అదీల్ అబ్బాసి, ఖాజీఇఫ్టేఖర్, అహ్మద్, లేట్ హాజీ నూరుల్ హక్ (నౌఘర్ బజార్), మౌలానా అబ్దుల్ ఖయ్యూం రహ్మాన్. భారతదేశం, మౌలానా అబ్దుల్ ఖయ్యూం రహ్మాన్ మొదలైన వారు ప్రధానమైనవారు. మౌలానా అబ్దుల్ ఖయ్యూం రహ్మాన్ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడిగా పేరు పొందిన తరువాత విభజన సమయంలో మతతత్వ అల్లర్లు, హత్యాకాండ కారణంగా వికల మనస్కుడై రాజకీయాలను త్యజించి తన స్వగ్రామం అయిన దుధ్వానియా గ్రామంలో తన శేషజీవితం గడిపాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ప్రభుదయాళ్ విద్యార్థిసేవాగ్రాం వద్ద ఖైదుచేయబడి మహారాష్ట్ర లోని నాగపూర్‌లో 1942- 1945 వరకు జైలులో బంధించబడ్డాడు. ఫరెండా - బర్హిని సరస్వతి రహదారిలో ఉన్న వంతెనకు " ప్రభుదయాళ్ విద్యార్థివనగంగా వంతెన " అని నామకరణం చేయబడింది. .[2]

భౌగోళికం

మార్చు

సిద్ధార్ధ్ నగర్ 27°నుండి 27°28' ఉత్తర అక్షాంశం 82°45' నుండి 83°10' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నేపాల్ దేశంలోని కపిలవస్తు జిల్లా, ఈశాన్య సరిహద్దులో నేపాల్ దేశంలోని రూపందేహి జిల్లా, తూర్పు సరిహద్దులో మహారాజ్‌గంజ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బస్తీ జిల్లా, సంత్ కబీర్ నగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బలరాంపూర్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 2,752 చ.కి.మీ.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

విభాగాల వివరణ

మార్చు
విషయాలు వివరణలు
తాలూకాలు నౌఘర్, షొహ్రత్గర్, బంసి, ఇత్వా (సిద్ధార్థనగర్), డొమరియాగంజ్
అసెంబ్లీ నియోజక వర్గం 5 షొహ్రత్గర్, కపిలవస్తు, బస్తీ, ఇత్వా,, డొమరియాగంజ్ .
పార్లమెంటు నియోజక వర్గం డొమరియాగంజ్

పర్యాటక ఆకర్షణలు

మార్చు

జిల్లాలో పలు ఆకర్షణీయ ప్రదేశాలు ఉన్నాయి:-

  • పిప్రవ [4][5]
  • పల్తదేవి ఆలయం [6][7]
  • యోగమాయ ఆలయం:- ఈ పవిత్ర దేవాలయం జోగియ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి భక్తులు ప్రతి సోమ, శుక్రవారాలాలో వస్తుంటారు. భక్తులు దేవికి కదై, ప్రసాద్ (పూరీ, స్వీట్ హల్వా) సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో చిన్న పిల్లల కొరకు ముందన్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతిసంవత్సరం కార్తిక పౌర్ణమి నాడు ఆలయంలో రెండు రోజులు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించబడుతుంది. భక్తులు సమీపంలోని నదిలో స్నానం చేసి యోగమాయాదేవిని దర్శించుకుంటారు. భక్తులు ఈ పవిత్ర ఆలయంలో ప్రశాంతత అనుభవిస్తారు. ఈ ఆలయాన్ని మహామాయ ఆలయం అని కూడా అంటారు. యోగమాయ సిద్ధార్ధుని (గౌతమ బుద్ధుని) తల్లి.[8]
  • బాణగంగ వంతెన.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,553,526, [9]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[10]
అమెరికాలోని. నవాడా నగర జనసంఖ్యకు సమం.[11]
640 భారతదేశ జిల్లాలలో. 164 వ స్థానంలో ఉంది.[9]
1చ.కి.మీ జనసాంద్రత. 882 [9]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.17%.[9]
స్త్రీ పురుష నిష్పత్తి. 970:1000 [9]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 67.81%.[9]
జాతియ సరాసరి (72%) కంటే.
మైనారిటీలు 27%
సోషియో ఎకనమిక్ అంతస్తు [12]

ప్రముఖ రాజకీయనాయకులు

మార్చు

ఈ జిల్లా రాజకీయ వ్యక్తిత్వాలను, జాతీయ చిహ్నాలు అనేక ఉత్పత్తి చేసింది.

  • భారత స్వాతంత్ర్య కార్యకర్తలు, నాయకుడు వార్ధా సేవాగ్రామ్ లో మహాత్మా గాంధీతో నివసించిన ప్రభుదయాళ్ విద్యార్థి సిద్దార్థ నగర్ జిల్లాలీని జోగియా ఉదయపూర్‌కు చెందినవాడు.
  • స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ రాష్ట్ర మంత్రి కాజి జలీల్ అబ్బాసి సిద్ధార్థ నగర్ భయారా విలేజ్ చెందినవాడు.
  • స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ శాసన సభ్యులు మథుర ప్రసాద్ పాండే, ఈ ప్రాంతంలో ఒక రాజకీయవేత్త
* లెఫ్టినెంట్ మంత్రి దినేష్ సింగ్ 2003 లో సమాజ్వాది పార్టీ ప్రభుత్వం స్థాపనలోలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారిలో ఒకరు.
  • శ్రీ మాతా ప్రసాద్ పాండే విద్యార్థి సిద్దార్థ జిల్లా చెందినవాడు. రాజకీయ నాయకుడుగా గుర్తించబడుతున్నాడు. ఆయన ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ శాసన సభ స్పీకర్.
  • జగదాంబికా పాల్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రఖ్యాత వ్యక్తి, ఇటీవల భారతీయ జనతా పార్టీ చేరారు ) కూడా దుమరియా (సిద్ధార్థ నగర్ జిల్లా పార్లమెంటరీ సీటు నుండి ఎన్నికల పోటీ చేసింది).
  • గత -శాసన సభ్యులు శ్రీమతి కమల సాహ్ని ప్రభుదయాళ్ విద్యార్థి .
  • మాజీ మంత్రి అభిమన్యు ప్రసాద్ పాండే, తౌఫీగ్ అహ్మద్, మహ్మద్ ముక్వీం, కమల్ యూసఫ్ మాలిక్ (ఉదా. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి), స్వయంబర్ చౌదరి (మాజీ శాసన సభ్యులు బిజెపి), మౌలానా హుమియతుల్లా చౌదరి (అధ్యక్షుడు ఎన్సిపి సిద్ధార్థ్ నగర్), రామ్ కృపాల్ చౌదరి (కుమారుడు స్వయంబర్ చౌదరి, మాజీ పంచాయితీ సభ్యుడు) కూడా ఈ జిల్లాకు చెందినవారు.
  • గొప్ప సామ్యవాద నాయకుడు, సమాజ్వాది పార్టీ 5 సార్లు ఎంపికైన సమాజ్‌వాది పార్టీ లేట్ శ్రీ, బ్రిజ్ భూషణ్ తివారీ వైస్ ప్రెసిడెంట్ కూడా జమిని, సోహర్ద్గర్ ఈ జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించాడు.
  • 2010 లో జి ఐ యల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన దివంగత శ్రీ లలిత ప్రసాద్ (ఉపాధ్యాయుడు) కుమారుడు శ్రీ.అవదేష్ కుమార్ యాదవ్

ఈ జిల్లాలోని బర్హిని మండలంలో ఇమాలియా అనే ఒక చిన్న గ్రామానికి చెందినవాడు.

బయటి లింకులు

మార్చు
  • అధికారిక వెబ్‌సైటు

మూలాలు

మార్చు
  1. http://pib.nic.in/release/release.asp?relid=28770
  2. [PDF]LegalSoft - Online Legal Library - India Law Legal Database legaldatabase.in/LegalDB/Home/ExportToPdf?SID=f1c803f3-d4f7... May 24, 2002 - known as 'Prabhu Dayal Vidyarthi Van Ganga Bridge', Siddharth Nagar. ...
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (8 సెప్టెంబరు 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 సెప్టెంబరు 2011.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 8 జూన్ 2013. Retrieved 16 డిసెంబరు 2014.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 4 ఏప్రిల్ 2015. Retrieved 16 డిసెంబరు 2014.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 4 డిసెంబరు 2014. Retrieved 16 డిసెంబరు 2014.
  7. http://wikimapia.org/11891659/JHANDE-NAGAR-PALTADEVI-SIDDHARTH-NAGAR-UP
  8. http://wikimapia.org/13739845/MAA-YOGMAYA-KA-MANDIR
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 సెప్టెంబరు 2011.
  10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 అక్టోబరు 2011. Kuwait 2,595,62
  11. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 సెప్టెంబరు 2011. Nevada 2,700,551
  12. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. Archived 2011-09-30 at the Wayback Machine F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS