సిద్ధార్థ్ రాయ్

సిద్ధార్థ్ రాయ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించిన ఈ సినిమాకు వి. యశస్వీ దర్శకత్వం వహించాడు. దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 జులై 1న[1], ట్రైలర్‌ను 2024 జనవరి 23న విడుదల చేసి[2], సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేశారు.[3]

సిద్ధార్థ్ రాయ్
దర్శకత్వంవి. యశస్వీ
రచనవి. యశస్వీ
పాటలురామజోగయ్య శాస్త్రి, బాలాజీ, పూర్ణాచారి, యశస్వి
నిర్మాతజయ అడపాక
ప్రదీప్ పూడి
సుధాకర్ బోయిన
తారాగణం
 • దీపక్ సరోజ్
 • తన్వి నేగి
 • నందిని
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థలు
శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా మే 3న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

మార్చు
 • దీపక్ సరోజ్
 • తన్వి నేగి
 • నందిని
 • ఆనంద్
 • కళ్యాణి నటరాజన్
 • మాథ్యూ వర్గీస్
 • కీర్తన

సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) తినడం, నిద్రపోవడం, కోరికలను తీర్చుకోవడాన్నే అతడు ఇష్టపడుతుంటాడు. ఇతర ఎమోషన్లను పట్టించుకోడు.ఈ క్రమంలో తన జీవితంలోకి ఇందు (తన్వి నేగి) రావడంతో జీవితంలో చిన్న‌గా మార్పులు మొద‌లై అ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ రాయ్ జీవితం ఎలా మారింది? వారి ప్రేమ సఫలమైందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[5]

మూలాలు

మార్చు
 1. Mana Telangana (9 July 2023). "మరో 'అర్జున్ రెడ్డి'లా 'సిద్ధార్థ్ రాయ్'... టీజర్ కు కనెక్ట్ అవుతున్న యూత్." Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.
 2. Hindustantimes Telugu (23 January 2024). "బోల్డ్ సీన్లు, ఎమోషన్‍తో సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్.. అర్జున్ రెడ్డిని గుర్తుచేసేలా." Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.
 3. Chitrajyothy (25 February 2024). "ఈ వారం వచ్చిన సినిమాల్లో 'సిద్ధార్థ్ రాయ్' మంచిగా రన్ అవుతోంది | Siddharth Roy Movie Going Well This Week srk". Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.
 4. Chitrajyothy (3 May 2024). "ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. పిల్ల‌ల‌ను దూరంగా ఉంచండి | Deepak Saroj Siddharth Roy Movie OTT Streaming on ktr". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 5. EENADU (23 February 2024). "రివ్యూ: సిద్ధార్థ్ రాయ్‌.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.

బయటి లింకులు

మార్చు