సిరిమాను
సిరిమాను చెట్టు కొరకు చూడండి సిరిమాను చెట్టు
సిరిమాను (సిరిమానోత్సవం) అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం పేరిట ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.[1]
విజయనగర సామ్రాజ్య కాలంలో సిడిమ్రాను అనే ఉత్సవం జరిగేది. ఆ ఉత్సవం కూడా దాదాపు ఇదే పద్ధతిలో జరిగేది. అయితే భక్తులు కొక్కేనికి అమర్చిన పీఠంపై కాక, స్వయంగా తామే ఆ కొక్కేలకి వేళ్ళాడేవారు.
మూలాలు, వనరులుసవరించు
- ↑ ఈనాడు పత్రిక విజయనగరం జిల్లా సంచికలో 2001 అక్టోబరు 24 వ తేదీ నాటి వార్త ఇది. Archived 2007-10-31 at the Wayback Machine (ఈ లింకుకు మూడు నెలల్లో కాలదోషం పడుతుంది.)