సిర్సనగండ్ల సీతారామాలయం

సిర్సనగండ్ల సితారామాలయం, నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, సిర్సనగండ్ల గ్రామంలో నెలకొని ఉంది. ఇది అపర భద్రాద్రిగా పేరుగాంచింది.[1][2]

ఆలయ విశేషాలు

మార్చు

ఈ ఆలయాన్ని 14వ శతాబ్దిలో నిర్మించబడినట్లు అక్కడ ఉన్న శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, ముత్యాలమ్మ గుడి ఉండేవని స్థానికుల కథనం. సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి భద్రాచలంలో ప్రతిష్ఠించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిలో ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించినట్లు, వాటిని సిర్సనగండ్లలో ప్రతిష్ఠించమని చెప్పినట్లు కథనం ప్రచారంలో ఉంది. కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకొని వచ్చికోడికూత, రోకలిమోత వినిపించని సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్ఠించబడినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయం కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్ళు రహదారిలో కల్వకుర్తి నుంచి 30 కిమీ దూరంలో ఉన్న చారకొండ నుంచి 5 కిమీ లోనికి ఉంది. ఏటా ఇక్కడ చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. డేరము జంబురాలు సిర్సనగండ్ల రామచరిత్రము అనే యక్షగానాన్ని రచించాడు.

ఒకప్పుడు ఈ ప్రదేశం దండకారణ్యమయిన ఈ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ దత్తత్రేయ ఆశ్రమం ఉండేది. శ్రీరాముడు లక్ష్మణులు సీత దేవిని అన్వేషిస్తూ ఈ ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు దత్తత్రేయుడు కోరిక మేరకు సీతారాములు అర్చావతార రూపంలో ఇక్కడ వెలవాలని నిర్ణయించుకున్నరు అని ప్రతీతి. దాదాపు 600 ల సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ సీతారాములు వెలిసారని చరిత్ర. దాదాపు 300 అడుగుల ఎత్తులో, 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం శోడశ స్తంభాలతో ఏకప్రాకారాలతో నిర్మితమైంది. ఇక్కడ రాచకొండ పద్మనాయకులు వేయించిన శిలాశాసనాలు కూడా ఉన్నాయి. అలాగే 4 పర్సియన్ భాశాతో శాసనలు ఉన్నాయి. ఇక్కడ ఆదిమానవుల శిలా యుగం నాటి ఆనవాళ్ళూన్నాయి. ఈ ప్రాంతం క్రీస్తు శకం 13,14 శతబ్ధం నుంచి భాసిల్లింది అని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి.[3]

"శిరుసనగండ్ల శ్రీసీతారామ శిరస్సు వంచి మొక్కుతా సరసనే నిలుచొని వరములిఇవ్వు" అంటూ భక్తులు కొండ ఎక్కుతూవుంటారు. ఇక్కడ సీతారామ కళ్యాణం చాలా అధ్బుతంగా నిర్వహిస్తారు. పెద్ద తేరు ఉత్సవం జరుగుతుంది.మూలవిగ్రహాలు శ్రీ సీతారామలక్ష్మణులు. ఇక్కడ రాముడు, లక్ష్మణులకు ఇరువురికి మీసకట్టు ఉండటం విగ్రహాల ప్రత్యేకం. ఈ విగ్రహాలు భద్రాచలంలో ప్రతిశ్టించవల్సింవి అని, ఈ ఆలయ అర్చకుల పూర్వికులకు ఒకరికి స్వప్నంలో శ్రీరముడు కనిపించి నన్ను ఈ గుట్ట పై ప్రతిశ్టించమని అన్నట్టు కథ. ఇక్కడా నవగ్రహాలు, రామలింగేశ్వరాలయం, శ్రీ హనుమన్ ఆలయం, ముక్కిడి పోషమ్మ, దత్తత్రేయ సన్నిధి, నాగసన్నిధి, రామకోటి స్థూపం, కల్యాణ మంటపం, గణపతి దేవుడు, అంబికా దేవి అను పలు ఉప ఆలయాలున్నయు. ఈ ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంది.

ఇది తెలంగణ రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా పిలవబడుతుంది. ఈ క్షేత్రం రామాయణ గాథతో ముడిపడింది. సంవత్సరం పొడవునా కోట్ల మంది దర్శించుకుంటారు. నిత్యపూజలందుకుంటూ ధూపధీపాలతో సంవత్సరాంతం ఉత్సవాలు జరుగుతుంటాయి.[4]

మూలాలు

మార్చు
  1. "వైభవంగా సిర్సనగండ్ల రథోత్సవం మహబూబ్ నగర్".
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (12 January 2020). "మన మరో భద్రాద్రి సిర్సనగండ్ల". ntnews. మధుకర్ వైద్యుల. Archived from the original on 21 మే 2020. Retrieved 21 May 2020.
  3. etv2teerthayatra (2012-03-30), Etv2_Teerthayatra - Sri Sita Ramachandra Swamy Temple in Sirasanagandla - Part 1, retrieved 2018-01-18{{citation}}: CS1 maint: numeric names: authors list (link)
  4. etv2teerthayatra (2012-03-30), Etv2_Teerthayatra - Sri Sita Ramachandra Swamy Temple in Sirasanagandla - Part 2, retrieved 2018-01-18{{citation}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లింకులు

మార్చు