సిల నేరంగల్ సిల మణితర్గల్
సిల నేరంగల్ సిల మణితర్గల్, 1977 ఏప్రిల్ 1న విడుదలైన తమిళ సినిమా.[2] ఎ.బి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానరులో బి. హృదయనాథ్ నిర్మించిన ఈ సినిమాకు ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లక్ష్మి, శ్రీకాంత్, సికె నగేష్, వైజి పార్థసారధి తదితరులు నటించారు.[3] డి.జయకాంతన్ రాసిన సిల నేరంగల్ సిల మణితర్గల్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.
సిల నేరంగల్ సిల మణితర్గల్ | |
---|---|
దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
స్క్రీన్ ప్లే | జయకాంతన్ |
దీనిపై ఆధారితం | జయకాంతన్ రాసిన సిల నేరంగల్ సిల మణితర్గల్ నవల ఆధారంగా |
నిర్మాత | బి. హృదయనాథ్ |
తారాగణం | లక్ష్మి శ్రీకాంత్ సికె నగేష్ |
ఛాయాగ్రహణం | జి. విఠల్ రావు |
కూర్పు | ఎ. పాల్ దురైసింగం |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | ఎ.బి.ఎస్. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1977, ఏప్రిల్ 1 |
సినిమా నిడివి | 130 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
24వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో లక్ష్మికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. 2011 చిల నేరంగళ్ చిల మనుష్యార్ అనే పేరుతో మలయాళ టెలివిజన్ ధారావాహికగా రీమేక్ చేయబడింది.[4]
నటవర్గం
మార్చు- లక్ష్మి (గంగ)
- శ్రీకాంత్ (ప్రభాకర్)
- సికె నగేష్ (ఆర్కే విశ్వనాథ శర్మ)
- వైజి పార్థసారథి (వెంకు మామ)
- ఆర్. నీలకంఠన్ (గణేషన్)
- సుకుమారి (గణేషన్ భార్య "అన్నీ")
- ఎస్. సుందరి బాయి (కనగం)
- రాజసులోచన (పద్మ)
- జయగీత (మంజు)
- భువనాదేవి (ఇమ్మాన్యుయేల్)
పాటలు
మార్చుఈ సినిమాకు ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం స్వరపరిచాడు. ఈ సినిమాలో "వేరు ఇదం తేది", "కండతాయ్ సొల్లుగిరెన్ ఉంగల్" అనే రెండు పాటలు మాత్రమే ఉన్నాయి.[5][6][7]
స్పందన
మార్చుఆనంద వికటన్ పత్రికలో 1977, ఏప్రిల్ 17న వచ్చిన సమీక్షలో సినిమా గురించి, ముఖ్యంగా లక్ష్మి నటన గురించి ప్రశంసిస్తూ రాశారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో, ఉత్తమ నటి పురస్కారం వచ్చింది.[8]
మూలాలు
మార్చు- ↑ Rajadhyaksha & Willemen 1998, p. 429.
- ↑ "சில நேரங்களில் சில மனிதர்கள்' - அப்பவே அப்படி கதை". Hindu Tamil Thisai. 1 April 2019. Archived from the original on 2 September 2019. Retrieved 2021-08-03.
- ↑ "Sila Nerangalil Sila Manithargal (1976)". Indiancine.ma. Retrieved 2021-08-03.
- ↑ "Chila Nerangalil Chila Manushyar comes alive on Amrita TV". Afaqs. 14 January 2011. Archived from the original on 22 March 2018. Retrieved 2021-08-03.
- ↑ Rangan, Baradwaj (27 March 2005). "Sila Nerangalil Sila Manidhargal". Baradwaj Rangan. Retrieved 2021-08-03.
- ↑ Dhananjayan 2014, p. 239.
- ↑ Kolappan, B. (27 April 2016). "Soon, an album of Jayakanthan's film songs". The Hindu. Retrieved 2021-08-03.
- ↑ The Times of India Directory and Year Book Including Who's who. The Times Group. 1978. p. 319.
గ్రంథ పట్టిక
మార్చు- Rajadhyaksha, Ashish; Willemen, Paul, eds. (1998) [1994]. Encyclopaedia of Indian Cinema (PDF). Oxford University Press. ISBN 0-19-563579-5.
- Dhananjayan, G. (2014). Pride of Tamil Cinema: 1931 to 2013. Blue Ocean Publishers. ISBN 978-93-84301-05-7.