సిసండా సోమిలా బ్రూస్ మగాలా (జననం 1991 జనవరి 7) దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ క్రికెటరు. అతను 2021 ఏప్రిల్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ రంగప్రవేశం చేసాడు.[1]

సిసండా మగాలా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సిసండా సోమిలా బ్రూస్ మగాలా
పుట్టిన తేదీ (1991-01-07) 1991 జనవరి 7 (వయసు 33)
పోర్ట్ ఎలిజబెత్, కేఫ్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 143)2021 నవంబరు 26 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో
తొలి T20I (క్యాప్ 91)2021 ఏప్రిల్ 10 - పాకిస్తాన్ తో
చివరి T20I2023 మార్చి 26 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010/11–2017/18ఈస్టర్న్ ప్రావిన్స్
2013/14–2019/20వారియర్స్
2018నెల్సన్ మండేలా బే జయింట్స్
2019/20బార్డర్
2019కేప్‌టౌన్ బ్లిట్జ్
2020/21ఇంపీరియల్ లయన్స్
2021/22–presentGauteng
2023Sunrisers Eastern Cape
2023చెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 7 6 94 124
చేసిన పరుగులు 12 34 2,081 880
బ్యాటింగు సగటు 4.00 34.00 19.44 14.19
100లు/50లు 0/0 0/0 0/9 0/2
అత్యుత్తమ స్కోరు 5* 18* 79 78*
వేసిన బంతులు 318 120 13,550 5,242
వికెట్లు 14 6 275 189
బౌలింగు సగటు 23.92 37.66 28.91 26.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 11 9
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 5/43 3-21 6-23 6/24
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 56/– 25/–
మూలం: ESPNcricinfo, 2 April 2023

దేశీయ కెరీర్ మార్చు

2015 ఆఫ్రికా T20 కప్ కోసం తూర్పు ప్రావిన్స్ క్రికెట్ జట్టు జట్టులో మగాలాను చేర్చుకున్నారు.[2] 2016 ఆఫ్రికా T20 కప్‌లో 12 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [3] 2017 ఆగస్టులో అతను, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం నెల్సన్ మండేలా బే స్టార్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [4] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ దక్షిణాఫ్రికా మొదట్లో టోర్నమెంట్‌ను నవంబరు 2018కి వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. [5]

2018 అక్టోబరులో మగాలా, ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం నెల్సన్ మండేలా బే జెయింట్స్ జట్టులో ఎంపికయ్యాడు. [6] [7] 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంటు కోసం 2019 సెప్టెంబరులో కేప్ టౌన్ బ్లిట్జ్ జట్టుకు ఎంపికయ్యాడు. [8]

2021 ఏప్రిల్లో దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు గౌటెంగ్ జట్టుకు ఎంపికయ్యాడు. [9] 2021 మేలో, ఐర్లాండ్ పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టుకు మగాలా ఎంపికయ్యాడు గానీ,[10] చీలమండ గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. [11]

అంతర్జాతీయ కెరీర్ మార్చు

2021 నవంబరులో, నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్‌డే జట్టులో అతను ఎంపికయ్యాడు. [12] అతను 2021 నవంబరు 26న దక్షిణాఫ్రికా తరపున నెదర్లాండ్స్‌పై తన తొట్టతొలి వన్‌డే ఆడాడు. [13] మరుసటి నెలలో, భారత్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [14] అతను జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో 5-43 స్కోర్‌కార్డ్‌తో నెదర్లాండ్స్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా తన మొదటి అంతర్జాతీయ ఐదు వికెట్ల పంటను సాధించాడు.

2020 జనవరిలో, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో అతను ఎంపికయ్యాడు. [15] అయితే, వన్‌డే సిరీస్‌కు ముందు, మగాలా పూర్తిగా ఫిట్‌గా లేడని ప్రకటించి, దక్షిణాఫ్రికా జట్టు నుండి తొలగించారు. [16] అయితే, మరుసటి నెలలో, ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో మగాలా ఎంపికయ్యాడు. [17] 2021 మార్చిలో, పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల స్క్వాడ్‌లలో మగాలా ఎంపికయ్యాడు. [18] అతను 2021 ఏప్రిల్ 10న పాకిస్తాన్‌పై దక్షిణాఫ్రికా తరపున తన T20I రంగప్రవేశం చేసాడు.[19]

మూలాలు మార్చు

  1. "Sisanda Magala". ESPN Cricinfo. Retrieved 3 September 2015.
  2. Eastern Province Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  3. "Africa T20 Cup: Most wickets". ESPN Cricinfo. Retrieved 1 October 2016.
  4. "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 సెప్టెంబర్ 2017. Retrieved 28 August 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
  6. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  7. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  8. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబర్ 2019. Retrieved 4 September 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  9. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  10. "Plenty of new faces in Proteas squads named to tour West Indies and Ireland". The South African. Retrieved 18 May 2021.
  11. "Sisanda Magala ruled out of Ireland tour with ankle injury". ESPN Cricinfo. Retrieved 6 July 2021.
  12. "Bavuma, de Kock among six South Africa regulars rested for Netherlands ODIs". ESPN Cricinfo. Retrieved 10 November 2021.
  13. "1st ODI, Centurion, Nov 26 2021, Netherlands tour of South Africa". ESPN Cricinfo. Retrieved 26 November 2021.
  14. "Duanne Olivier returns as South Africa name 21-member squad for India Tests". ESPN Cricinfo. Retrieved 7 December 2021.
  15. "Lungi Ngidi, Temba Bavuma named in South Africa ODI squad, Quinton de Kock to be captain". ESPN Cricinfo. Retrieved 21 January 2020.
  16. "Proteas ODI squad update". Cricket South Africa. Retrieved 30 January 2020.
  17. "Quinton de Kock to lead, Dale Steyn returns for England T20Is". ESPN Cricinfo. Retrieved 8 February 2020.
  18. "Lubbe, Williams and Magala make the cut for Pakistan series". ESPN Cricinfo. Retrieved 18 March 2021.
  19. "1st T20I, Johannesburg, Apr 10 2021, Pakistan tour of South Africa". ESPN Cricinfo. Retrieved 10 April 2021.