చవ్వా చంద్రశేఖర్ రెడ్డి
(సి.సి. రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
విసు కన్సలటెన్సీ, విసు ఫిలింస్ అధినేత, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త సి.సి. రెడ్డి ( అక్టోబర్ 24, 1930 - అక్టోబర్ 6, 2014). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా కూడా వ్యవహరించారు.
సి.సి. రెడ్డి | |
---|---|
జననం | సి.సి. రెడ్డి 1930 అక్టోబరు 24 |
మరణం | 2014 అక్టోబరు 6 | (వయసు 83)
ప్రసిద్ధి | చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త |
మతం | హిందూ |
జననం
మార్చు1930, అక్టోబర్ 24 న జన్మించారు.
నిర్మించిన సినిమాలు
మార్చు- గౌతమ్ ఎస్.ఎస్.సి.
- రూమ్ మేట్స్
- మీ శ్రేయోభిలాషి
ఇతర వివరాలు
మార్చు- వెంగళ్‌రెడ్డి అంతర్జాతీయ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించాడు.
- విసు కన్సల్టెన్సీ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాడు.
- ఎడిటర్ గా ఈ భూమి అనే పత్రికను నడిపాడు.
ఆరోగ్య పరిస్థితి
మార్చు2008 సెప్టెంబరులో కాలి బొటన వేలికి సంబంధించిన "గౌట్" అనే వ్యాధితో బాధపడ్డారు. అది శ్రుతిమించి కేన్సర్‌గా మారే అవకాశముందని డాక్టర్లు తెలిపారు. సరైన ట్రీట్ మెంట్ తీసుకోకపోవడంతో కోమాలోకి వెళ్లి, ఐదురోజుల అనంతరం బయటపడ్డారు.
మరణం
మార్చుకొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. 2014, అక్టోబర్ 6 సోమవారం డయాలసిస్ కోసం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి వెళ్లారు. పక్రియ కొనసాగుతుండగానే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మృతి చెందారు.