మీ శ్రేయోభిలాషి

2007 సినిమా

మీ శ్రేయోభిలాషి 2007 లో వి. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన స్ఫూర్తివంతమైన సినిమా.[1] ఇందులో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది.

మీ శ్రేయోభిలాషి
దర్శకత్వంచంద్ర సిద్ధార్థ
నిర్మాతవై. సోనియారెడ్డి
రచనవి. ఈశ్వరరెడ్డి
నటులురాజేంద్ర ప్రసాద్
రఘుబాబు
కృష్ణ భగవాన్
నరేష్
సంగీతంకోటి
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
విడుదల
28 డిసెంబర్ 2007
దేశంIndia
భాషతెలుగు

ప్రకృతిలో ఏ జీవి ఆత్మహత్య చేసుకోదు ఒక్క మనిషి తప్ప. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ఆత్మహత్య పరిష్కారం కాదు. చచ్చే దాకా బ్రతకాలి అని సందేశంతో నిర్మితమైన చిత్రం. బ్రతుకు మీద మమకారం పెంచుకోమని చెబుతుందీ చిత్రం. ఆత్మహత్యలకు పాల్పడున్నది ఎక్కువగా మధ్యతరగతి వాళ్లే. అందుకే మధ్య తరగతి పాత్రలతో రూపొందిందీ కథ.

2007 లో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది.[2] ఈ సినిమా 2008 లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితమైంది.[3][4]

చిత్రకథసవరించు

మూడుకోట్ల బడ్జెట్‌ అనుకున్న నాశనం సినిమా ఆరు కోట్లయినా పూర్తి కాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక సినిమా నిర్మాత రెడ్డి (నరేష్), తమ ప్రేమని పెద్దలు ఇష్టపడరు కాబట్టి చావొక్కటే తమకు శరణ్యమనుకున్న ప్రేమజంట, వృద్ధాప్యంలో కొడుకుల ఆదరణ కరువై జీవితానికి ముగింపు పలకాలనుకున్న ముసలి జంట (రాధాకుమారి, రావి కొండలరావు), చీటీల పేరుతో ప్రజల్ని మోసం చేసి ఆఖరికి ఆ చీటీల చిట్టామెడకి చుట్టుకోవడంతో చావు వైపు అడుగులు వేసిన ఓ చీటీల వ్యాపారి (కృష్ణ భగవాన్), అదనపు కట్నం తీసుకురాలేదని అనుక్షణం వేధించే అత్త, భర్త నుంచి పారిపోవడానికి ఓ ఇల్లాలి ఆరాటం, సంగీతం పట్ల ఉన్న ఆసక్తితో టెన్త్‌ పరీక్ష ఫెయిలయిన ఓ పదిహేనేళ్ళ కుర్రాడు, సముద్రమంతా సారా అయితే బావుండునని భావించి పెళ్ళాం పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వారి ఛీత్కారాలకు గురైన బస్సు డ్రైవర్‌ (రఘుబాబు), రోగంతో ప్రతిక్షణం చచ్చేబదులు ఒకేసారి చస్తే బావుంటుందనుకున్న ఓ రోగి (చిన్నా) ఆఖరికి శ్రేయోభిలాషి (రాజేంద్ర ప్రసాద్) - అంతా ఆత్మహత్యను ఆశ్రయించిన వాళ్ళే. విడివిడిగా బాగా ఆలోచించి చూస్తే, వీరి సమస్యలు ఏమంత పెద్దవి కావు. వారి సమస్యలు వారికి పెద్ద పర్వతాల్లా కనిపిస్తాయి. అందరి లక్ష్యం మరణం ఒక్కటే కాబట్టి, అది సహజ చావుగా ఉండాలని యాక్సిడెంట్‌లాగా ఉండాలని శ్రేయోభిలాషి సలహా మేరకు బస్సులో శ్రీశైలం బయలుదేరతారు. ఆరుగంటల ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలు మరణం పరిష్కారం కాదని తెలుసుకోవడంతో ముగుస్తుంది.

తారాగణంసవరించు

 • ప్రొఫెసర్ రాజాజీ గా రాజేంద్రప్రసాద్
 • అప్పుల్లో కూరుకుపోయిన సినీ నిర్మాత రెడ్డి గా నరేష్
 • కృష్ణ భగవాన్
 • రావి కొండల రావు
 • రాధా కుమారి
 • బస్సు డ్రైవరు గా రఘుబాబు
 • క్యాన్సర్ బాధితుడు రామకృష్ణ గా చిన్నా
 • ఆలీ
 • పోలీసు ఆఫీసరు గా నాజర్
 • బ్రహ్మానందం
 • జ్యోతిష్కుడు గా శ్రీనివాస రెడ్డి
 • తనికెళ్ళ భరణి

మూలాలుసవరించు

 1. జి. వి, రమణ. "మీ శ్రేయోభిలాషి సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 1 December 2017. CS1 maint: discouraged parameter (link)
 2. "2007 నంది పురస్కారాల ప్రకటన". idlebrain.com. Retrieved 1 December 2017. CS1 maint: discouraged parameter (link)
 3. http://dff.nic.in/2011/indianpanorama2008.pdf
 4. "Telugu cinema news - idlebrain.com". idlebrain.com.