సి. సుబ్బారావు ఆంధ్రరాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవిని నిర్వహించిన విద్యావేత్త.[1]

సి.సుబ్బారావు

జీవిత విశేషాలుసవరించు

అతను 1938లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేసి బంగారు పతకం సాధించాడు. మోడర్న్ పొయిట్రీ పై పి.హెచ్.డి పొందాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా 1960 నుంచి 1968 వరకు పనిచేసాడు. తర్వాత శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ మొదలు పెట్టి అక్కడ పదేళ్ళు పనిచేసి మంచి ఉపాధ్యాయుడుగా తన సేవలనందించాడు. తర్వాత ఓపెన్‌ యూనివర్సిటీలో పనిచేసాడు. ఉపాధ్యాయునిగా అతను ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు[2].


అతనిని 1996లో వారిని ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా నియమించడం జరిగింది. ఎవ్వరినీ నొప్పించ కుండా, పనిలో ఎక్కడా ఎవ్వరూ వేలెత్తి చూపలేని విధంగా, అందరినీ కలుపుకుని, సమన్వయంతో, అందరి సహకారంతో ఆయన విద్యారంగంలో సంస్కరణలు అమలుచేసాడు. నైపుణ్యాభివృద్ధి అంటే పెద్దగా తెలియని ఆరోజుల్లో ఆయన టెక్నికల్‌ కాలేజీల్లో కోర్సులు నడిపేలా చేశాడు. సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అత్యవసరమని గుర్తించి, అందర్నీ ఒప్పించి ఆ దిశగా మన విద్యార్థులకు శిక్షణనిప్పించి, వారికి ఉద్యోగావకాశాలు పెరిగేలా శ్రమించాడు. వారు 2004లో ఆ పదవి నుంచి తప్పుకున్నా, స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌పై వారి ఉత్సాహం చివరివరకూ కొనసాగింది[3].

సాహితీ సేవలుసవరించు

అతను పాశ్చాత్య సాహిత్యంలో కూడా కృషి చేసాడు. కవిత్యం రాసాడు. తెలుగు భాషా సాహిత్యంలో కూడా కృషి చేసాడు. భాష జీవభాష కావాలనీ, దానికి వ్యాకరణం వగైరాలు పెద్దగా అవసరం లేదనీ నమ్మిన సాహిత్యవేత్త అతను. అతనికి ఆడెన్‌, కీట్స్‌, షెల్లీ, ఈట్స్‌ కవులంటే ఇష్టం. దిగంబర కవులంటే అబిమానం. నగ్నముని "కొయ్యగుర్రం" అంటే గౌరవం. గురజాడ "కన్యాశుల్కం" అంటే ప్రాణం. ఇంగ్లీష్‌లో ఉడీ అలెన్‌, తెలుగులో శ్రీపాద, మల్లాది, ముళ్ళపూడి, శ్రీరమణల కథలంటే ఇష్టం[2].

వర్ధమాన రచయితలకు, ఔత్సాహిత రచయితలకు అతను ప్రోత్సాహం అందించేవాడు వారి రచనలను సునిశితంగా పరిశీలించి పీఠికలు రాసేవాడు. ఆయన ప్రోత్సహించిన రచయితల పుస్తకాల ప్రచురణకు వారు పడిన శ్రమ ఊహాతీతం. పుస్తకం అచ్చులో చూసి మురిసిపోయేవాడు. వారి కవిత్వం గానీ, వ్యాసాలు గానీ ఇంతవరకూ జర్నల్స్‌లో అచ్చవడమేకానీ పుస్తకరూపం దాల్చలేదు[3].

అతను 2014 డిసెంబరు 29న మరణించాడు.

మూలాలుసవరించు

  1. "Media urged not to sensationalise news". The Hindu (in ఇంగ్లీష్). Special Correspondent. 2013-04-15. ISSN 0971-751X. Retrieved 2019-01-14.CS1 maint: others (link)
  2. 2.0 2.1 "The Hindu : Yes professor". www.thehindu.com. Retrieved 2019-01-14.
  3. 3.0 3.1 "మంచిమనిషి సి. సుబ్బారావు - కాటా చంద్రహాస్‌". www.andhrajyothy.com. 2015-01-09. Retrieved 2019-01-14.[permanent dead link]

బయటి లంకెలుసవరించు