సీవీ ఆనంద్
సీవీ ఆనంద్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి & మాజీ క్రికెట్ క్రీడాకారుడు.[2] సీవీ ఆనంద్ 24 డిసెంబర్ 2021[3] నుండి 12 అక్టోబర్ 2023 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించాడు.[4]
అడిషనల్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ ఐపీఎస్ అధికారి | |
---|---|
జననం | 1969 |
బంధువులు | డా. లలితా (భార్య) మిలింద్, నిఖిల్ (కుమారులు) [1] |
Police career | |
విభాగము | ఇండియన్ పోలీస్ సర్వీస్ (1991) |
దేశం | తెలంగాణ క్యాడర్ |
Years of service | 1991 - ప్రస్తుతం |
Rank | అడిషనల్ డైరెక్టర్ జనరల్ |
ఆయన 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా,[5] 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి అందుకున్నాడు.[6] అడిషనల్ డీజీగా ఉన్నా సీవీ ఆనంద్ కు డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్ట్ 07న ఉత్తర్వులు జారీ చేసింది.[7]
తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల విధుల నిర్వహణ నుంచి ఆయనను 12 అక్టోబర్ 2023న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పించారు.[8]
నిర్వహించిన భాద్యతలు
మార్చు- వరంగల్ ఏఎస్పీ
- అడిషనల్ ఎస్పీ - ఆదిలాబాద్
- ఎస్పీ - నిజామాబాదు
- హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ
- సి.ఐ.డి - డి.ఐ.జి
- ఎక్సైజ్ & ప్రొహిబిషన్ డైరెక్టర్
- విజయవాడ పోలీస్ కమీషనర్
- హైదరాబాద్ ట్రాఫిక్ కమీషనర్
- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (2013 - 2016)
- పౌరసరఫరాల శాఖ కమిషనర్ (2016 - 2018)
- జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ (నిసా) డైరెక్టర్ ( ఫిబ్రవరి 16, 2018 - 24 డిసెంబర్ 2021)[9][10]
- హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (25 డిసెంబర్ 2021 - 2023 ) [11]
- ఏసీబీ డైరెక్టర్ & విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ
- హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (7 సెప్టెంబర్ 2024 - ప్రస్తుతం)[12]
పురస్కారాలు
మార్చు- 2002 రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్
- 2008 వృత్తిలో చేసిన విశిష్ట సేవలకుగాను ఇండియన్ పోలీస్ మెడల్
- 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆయన పని చేస్తున్న సమయంలో పోలీస్ శాఖ ఎన్నికల విధుల్లో పాల్గొన్ని తమ పనులను సమర్ధవంతంగా నిర్వహించినందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం నుండి అవార్డును అందుకున్నాడు.[13]
- 2017 రాష్ట్రపతి పోలీసు పతకం
- తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డు - 2017 (కమిషనర్‌గా పౌరసరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలకు, పనితీరు) [14]
- రాజస్థాన్ ప్రభుత్వ ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా చేపట్టిన వినూత్న పద్ధతులకు గాను (అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం) ఆయన 2017 మార్చి 3న జైపూర్‌లో జరిగిన ఈ - ఇండియా ఇన్నోవేటివ్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
క్రీడ జీవితం
మార్చుసీవీ ఆనంద్ 1986లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత అండర్ - 19 టీం జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన హైదరాబాద్ అండర్ - 19 & 22 జట్టులో ఆడాడు. సీవీ ఆనంద్ 45 కేటగిరి టెన్నిస్ లో అల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నాడు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథెటిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ ను గెలిచాడు. [15]
మూలాలు
మార్చు- ↑ Deccan Chronicle (8 December 2016). "Papa don't preach" (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ C.V.ANAND (2021). "C.V.ANAND". cvanandips.blogspot.com. Retrieved 7 September 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (24 December 2021). "హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్‌ల బదిలీ". Archived from the original on 24 December 2021. Retrieved 26 December 2021.
- ↑ V6 Velugu (12 October 2023). "20 మంది ఆఫీసర్లపై..బదిలీ వేటు". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (18 May 2016). "అడిషనల్ డీజీగా సీవీ ఆనంద్". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ Namasthe Telangana (20 August 2021). "సీవీ ఆనంద్, జితేందర్‌లకు కేంద్రంలో ఏడీజీ హోదా". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ Eenadu (8 August 2023). "సీవీ ఆనంద్ సహా ముగ్గురికి డీజీలుగా పదోన్నతి". Archived from the original on 8 August 2023. Retrieved 8 August 2023.
- ↑ Prajasakti (14 October 2023). "తెలంగాణలో కలెక్టర్లు, ఎస్‌పిలపై బదిలీ వేటు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Vaartha (16 February 2018). "సిఐఎస్ఎఫ్ ఐజీగా సివి ఆనంద్". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ Deccan Chronicle (11 August 2020). "C V Anand, the new director of National Industrial Safety Academy" (in ఇంగ్లీష్). Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.
- ↑ Eenadu (24 December 2021). "హైదరాబాద్ నగర కమిషనర్‌గా సీవీ ఆనంద్". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
- ↑ V6 Velugu (7 September 2024). "రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్". Retrieved 7 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Deccan Chronicle (22 January 2015). "Prestigious award for Cyberabad Police Commissioner C V Anand for poll role" (in ఇంగ్లీష్). Archived from the original on 15 September 2015. Retrieved 7 September 2021.
- ↑ Andrajyothy (12 November 2017). "పౌరసరఫరాలో పోలీస్ మార్క్". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ Deccan Chronicle (23 December 2016). "Ton of joy for C V Anand" (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.