సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలిలో ఉన్న పోలీసు కమిషనరేట్. ఇది 2003లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను విభజించడం ద్వారా ఏర్పడింది.[1][2]
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ | |
---|---|
నినాదం | మీ భద్రతే మా బాధ్యత |
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 2003 |
అధికార పరిధి నిర్మాణం | |
కార్యకలాపాల అధికార పరిధి | సైబరాబాదు, తెలంగాణ, భారతదేశం |
చట్టపరమైన అధికార పరిధి | రంగారెడ్డి జిల్లా |
ప్రధాన కార్యాలయం | గచ్చిబౌలి, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ |
ఏజెన్సీ అధికారులు |
|
మాతృ ఏజెన్సీ | తెలంగాణ పోలీసు |
వెబ్‌సైట్ | |
అధికారిక వెబ్‌సైటు |
ఏర్పాటు
మార్చుసైబరాబాద్ పోలీసును 2003 లో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం కింద స్థాపించారు. దీని అధికార పరిధి రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ ప్రాంతం వస్తుంది. దీని ప్రధాన కార్యాలయం గచ్చిబౌలిలో ఉంది.
సైబరాబాద్ పోలీస్ విభాగంలో మూడు కార్యాచరణ జోన్లున్నాయి. అవి మాదాపూర్, బాలానగర్, శంషాబాద్. మాదాపూర్ మండలంలో కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్ డివిజన్లు, బాలానగర్ మండలంలో బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు, శంషాబాద్ మండలంలో రాజేంద్ర నగర్, షాద్ నగర్, శంషాబాద్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. సైబరాబాద్ పోలీసులకు మాదాపూర్, బాలానగర్, శంషాబాద్‌లో మూడు జోన్‌లతో కూడిన ట్రాఫిక్ వింగ్ కూడా ఉంది.
కమిషనర్లు
మార్చు- సి.హెచ్. ద్వారకా తిరుమలరావు
- సీవీ ఆనంద్
- వి.నవీన్‌చంద్ [3]
- వీసీ సజ్జనార్ - 13 మార్చి 2018 - 25 ఆగస్టు 2021
- స్టీఫెన్ రవీంద్ర - 25 ఆగష్టు 2021 - ప్రస్తుతం
జోనులు
మార్చుమాదాపూర్ జోను
మార్చుశంషాబాద్ జోను
మార్చు- శంషాబాద్ ఏసిపి
- శంషాబాద్
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- రాజేంద్రనగర్ ఏసిపి
- రాజేంద్రనగర్
- మైలార్‌దేవరంపల్లి
- మొయినాబాద్
- చేవెళ్ళ ఎసిపి
- చేవెళ్ళ
- షాబాద్
- శంకర్పల్లి
- షాద్‌నగర్ ఎసిపి
- షాద్‌నగర్
- కొత్తూరు
- కేశంపేట
- కొండూర్గ్
- నందిగామ
- చౌదరిగూడెం
- అమన్‌గల్
- తలకొండపల్లి
- కడ్తాల్
బాలానగర్ జోను
మార్చు- బాలానగర్
- సనత్‌నగర్
- జీడీమెట్ల
- జగద్గిరిగుట్ట
- పేట్ బషీరాబాద్
- మేడ్చల్
- శామీర్‌పేట
- అల్వాల్
- దుండిగల్
వివాదాలు
మార్చు2019 హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం సైబరాబాద్ పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని విచారణ కమిషన్ న్యాయమూర్తి వి. ఎస్. సిర్పుర్కర్ ప్రకటించారు.[4] హేమాంగి శర్మ మోసం కేసులో సైబరాబాద్ పోలీసులు నకిలీ సాక్షులు, నకిలీ అఫిడవిట్లు, నకిలీ పంచనామా సహాయంతో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు, తప్పుడు ఛార్జ్ షీట్‌లు నమోదు చేశారని ఒడిషా కవి తపన్ కుమార్ ప్రధాన్ సోషల్ మీడియాలో ఆరోపించాడు.[5]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Hyderabad traffic guard's photo of feeding a homeless woman is going viral for all the right reasons". 2 April 2018.
- ↑ "Outer Ring Road in Hyderabad speed limit likely to be 120 kmph again". The New Indian Express.
- ↑ Andrajyothy (2016). "సైబరాబాద్ జంట కమిషనరేట్లకు కొత్త సారథులు". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.
- ↑ "దిశా ఎన్‌కౌంటర్ - పది మంది అధికారులపై కమీషన్ హత్య అభియోగాలు కోరుతోంది". ది వైర్. 20 May 2022. Archived from the original on 17 అక్టోబర్ 2022. Retrieved 22 అక్టోబర్ 2022.
{{cite news}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ ప్రధాన్, డాక్టర్ తపన్ కుమార్ (2019). నేను, ఆమె , సముద్రం. కోహినూర్ బుక్స్. ISBN 978-81-942835-9-1.
ఇతర లంకెలు
మార్చుసైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ అధికారిక వెబ్సైటు Archived 2020-12-10 at the Wayback Machine