సీ.ఎస్. నిరంజన్ కుమార్

సీ.ఎస్. నిరంజన్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో గుండ్లుపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

సీ.ఎస్. నిరంజన్ కుమార్

పదవీ కాలం
2018 – 2023
ముందు ఎం.సి. మోహన్ కుమారి
తరువాత హెచ్‌.ఎం. గణేష్ ప్రసాద్
నియోజకవర్గం గుండ్లుపేట

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

రాజకీయ జీవితం

మార్చు

సీ.ఎస్. నిరంజన్ కుమార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017లో గుండ్లుపేట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహదేవప్రసాద్ చేతిలో 10,887 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో గుండ్లుపేట నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహదేవ ప్రసాద్‌పై 16,684 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్‌.ఎం. గణేష్ ప్రసాద్ చేతిలో 36,675 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. The Hindu (13 April 2017). "Congress wins by-polls in Nanjangud and Gundlupet" (in Indian English). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  3. Election Commision of India (13 May 2023). "Karnataka Assemly Elections Results 2023- Gundlupet". Archived from the original on 5 June 2023. Retrieved 17 November 2024.
  4. CNBC TV18 (13 May 2023). "Gundlupet election result live: HM Ganesh Prasad of Congress defeats BJP's CS Niranjan Kumar by 36,675 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2023. Retrieved 17 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)