హేమా చౌదరి

(హేమాచౌదరి నుండి దారిమార్పు చెందింది)

హేమా చౌదరి దక్షణభారత ప్రముఖ సినిమా నటి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించి ఉత్తమనటిగా గుర్తింపు పొందారు. దక్షిణాది ప్రముఖనటులు ఎన్.టి.రామారావు, కృష్ణ, రాజకుమార్, విష్ణువర్దన్, కమల్ హాసన్, కృష్ణంరాజు, చంద్రమోహన్, అంబరీష్, చిరంజీవి, మోహన్ బాబు, ఎం.జి.సోమన్, ప్రేమనజీర్, సుకుమారన్, రవిచంద్రన్ ఇలా మొదలైన నటులతో నటించి ప్రముఖనటిగా స్థిరపడ్డారు.

హేమా చౌదరి
జన్మ నామందుర్గ ప్రభా
జననం 12 అక్టోబర్ 1955, హైదరాబాద్
క్రియాశీలక సంవత్సరాలు 1975నుండి
పిల్లలు పురోహిత్

విశేషాలుసవరించు

ఈమె అసలు పేరు దుర్గప్రభా. తెలుగునటి, దబ్బింగ్ ఆర్టిస్ట్ బృందావనం చౌదరి కుమార్తె. ఈ కాలం దంపతులు (1975) అనె తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 1976లో పెళ్ళి కాని పెళ్ళి సినిమానుంచి హీరోయిన్ గా అవకాశలు వచ్చాయి. ఈమె దక్షిణ భారత సినిమాల్లో పెద్ద నటిగా పేరు తెచ్చుకుంది. సుమారు 150కు పైగా సినిమాలలో నటించింది.[1][2] ఎం.ఆర్.విఠ్ఠల్, కె.బాలచందర్, పుట్టణ్ణ కణగాల్, దొరై భగవాన్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్ర రావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ లాంటి దర్శకుల దర్శకత్వంలొ సటించారు హేమాచౌదరి.

పురస్కారాలుసవరించు

  • సంతోషం జీవిత సాఫల్య పురస్కారం
  • ఇనోవేటివ్ ఫిలం అవార్డ్
  • పనోరమా అవార్డ్
  • 82వ కన్నడ సాహిత్య సమ్మేళన పురస్కారం

నటించిన కొన్ని తెలుగు సినిమాల జాబితాసవరించు

  1. ఈ కాలం దంపతులు (1975)
  2. పెళ్ళి కాని పెళ్ళి (1976)
  3. మన్మథ లీల (1976)
  4. బంగారు మనిషి (1978)
  5. ప్రేమాయణం (1978)
  6. జరుగుతున్న కథ (1978)
  7. నిజం (1979)
  8. కొత్త అల్లుడు (1979)
  9. శ్రీ రాఘవేంద్ర వైభవం (1981)
  10. ప్రేమాలయం (1986)
  11. తాండ్ర పాపారాయుడు (1986)
  12. డిస్కో సామ్రాట్ (1989)
  13. సుందరకాండ (1992)
  14. ప్రేమవిజేత (1992)
  15. లేడీ ఇన్పెక్టర్ (1992)
  16. పుట్టింటికి రా చెల్లి (2003)
  17. గోరింటాకు (2008)
  18. మేస్త్రీ (2009)

మూలాలుసవరించు

  1. ఎడిటర్ (17 February 2016). "ఇంటర్వ్యూ". నవ్య వీక్లీ. 12 (50): 72-73. మూలం నుండి 10 ఫిబ్రవరి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 10 February 2016.
  2. Dr.Seshagirirao. "Tollywood photo profiles". Tollywood photo profiles. Dr.Seshagirirao. మూలం నుండి 19 మార్చి 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 10 February 2016.

పురస్కారాలుసవరించు

  • 2015 సంతోషం జీవిత సాఫల్య పురస్కారం - దక్షణ భారత సినిపరిశ్రమకి సేవకోసం

మూలాలుసవరించు