కె. రాఘవేంద్రరావు

ప్రముఖ దర్శకుడు

కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత. ఈయన 50 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. ఈయన తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశరావు కూడా తెలుగు సినీ దర్శకుడే. రాఘవేంద్రరావు మొత్తం ఎనిమిది నంది పురస్కారాలు, ఒక IIFA పురస్కారం, ఒక సైమా అవార్డు, ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, రెండు సార్లు సినీ మా (Cinemaa) అవార్డులు అందుకున్నాడు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి తారలు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే కథానాయకులుగా ప్రస్థానం మొదలుపెట్టారు.[2]

కె. రాఘవేంద్రరావు
కె. రాఘవేంద్రరావు
జననం
కోవెలమూడి రాఘవేంద్రరావు

(1942-05-23) 1942 మే 23 (వయసు 82)[1]
ఇతర పేర్లుదర్శకేంద్రుడు
విద్యబి. ఎ
వృత్తిదర్శకుడు, నిర్మాత, రచయిత
జీవిత భాగస్వామిసరళ
పిల్లలు2 (కోవెలమూడి ప్రకాష్ తో సహా)
తల్లిదండ్రులు
బంధువులుకె.బాపయ్య (సోదరుడు), శోభు యార్లగడ్డ (అల్లుడు)

జననం, విద్య

మార్చు

రాఘవేంద్ర రావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో సుర్యప్రకాశ రావు దంపతులకు జన్మించాడు. రాఘవేంద్రరావు తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశరావు దర్శకుడే. రాఘవేంద్రరావు కొడుకు పేరు కూడా కోవెలమూడి సూర్య ప్రకాష్. ఇతను కూడా సినీ రంగంలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దర్శకుడు కె.బాపయ్య వీరి పెదనాన్న కుమారుడు.

సినీ రంగం

మార్చు

తండ్రి కోవెలమూడి ప్రకాశరావు దర్శకుడయినా మరో దర్శకుడి కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళు సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు రూపొందించాడు.

శ్రీదేవితో రాఘవేంద్రరావు 24 సినిమాలు చేశాడు.[3]


అవార్డులు.

1984: ఉత్తమ దర్శకుడు, నంది అవార్డు, బొబ్బిలి బ్రహ్మన్న.

టి. వి. రంగం

మార్చు

కేవలం వెండితెరమీదే కాక బుల్లితెర మీద కూడా రాఘవేంద్రరావు తన ముద్ర వేశాడు. ఈటీవీలో ప్రసారమైన శాంతి నివాసం అనే ధారావాహికకు రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించాడు. ఈటీవీలో సౌందర్యలహరి అనే పేరుతో ఆయన సినీ జీవిత విశేషాలతో ఒక కార్యక్రమం ప్రసారమైంది.[4]

కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా

మార్చు
స.రం చిత్రం పేరు నటీ నటులు
1975 బాబు శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి
1976 రాజా శోభన్ బాబు, జయసుధ
1976 జ్యోతి జయసుధ٫మురళీమోహన్
1977 అమరదీపం కృష్ణంరాజు, జయసుధ
1977 కల్పన మురళీమోహన్, జయచిత్ర
1977 ఆమెకథ మురళీమోహన్, ప్రభ
1977 అడవి రాముడు నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ
1978 సింహబలుడు నందమూరి తారక రామారావు, వాణిశ్రీ
1978 పదహారేళ్ళ వయసు శ్రీదేవి, చంద్ర మోహన్
1979 డ్రైవర్ రాముడు నందమూరి తారక రామారావు, జయసుధ
1979 వేటగాడు నందమూరి తారక రామారావు, శ్రీదేవి
1980 గజదొంగ నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయసుధ
1980 మోసగాడు శోభన్ బాబు, శ్రీదేవి
1980 భలే కృష్ణుడు కృష్ణ, జయప్రద
1980 ఘరానా దొంగ కృష్ణ, శ్రీదేవి
1981 కొండవీటి సింహం నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి
1981 తిరుగులేని మనిషి నందమూరి తారక రామారావు
1981 ఊరికి మొనగాడు కృష్ణ, జయప్రద
1981 రగిలే జ్వాల కృష్ణంరాజు, సుజాత, జయప్రద
1982 మధుర స్వప్నం కృష్ణంరాజు, జయసుధ, జయప్రద
1982 త్రిశూలం కృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక, జయసుధ
1982 దేవత శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి
1982 జస్టిస్ చౌదరి నందమూరి తారక రామారావు, శ్రీదేవి
1983 అడవి సింహాలు కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద
1983 శక్తి కృష్ణ, జయసుధ
1984 ఇద్దరు దొంగలు శోభన్ బాబు, రాధ
1984 బొబ్బిలి బ్రహ్మన్న కృష్ణంరాజు, లక్ష్మి, రాధ
1985 అడవి దొంగ చిరంజీవి, రాధ
1985 అగ్నిపర్వతం కృష్ణ, రాధ, విజయ శాంతి
1985 వజ్రాయుధం కృష్ణ, శ్రీదేవి
1985 పట్టాభిషేకం బాలకృష్ణ, విజయ శాంతి, శారద
1986 రావణబ్రహ్మ కృష్ణంరాజు, శారద, జయసుధ
1986 కలియుగ పాండవులు వెంకటేష్, కుష్బు
1986 చాణక్య శపథం చిరంజీవి, విజయ శాంతి
1986 కొండవీటి దొంగ చిరంజీవి, రాధ, విజయ శాంతి
1987 భారతంలో అర్జునుడు వెంకటేష్, కుష్బు, అరుణ
1988 జానకిరాముడు అక్కినేని నాగార్జున, విజయ శాంతి
1988 ఆఖరి పోరాటం అక్కినేని నాగార్జున, శ్రీదేవి , సుహాసిని
1989 ఒంటరి పోరాటం వెంకటేష్
1989 రుద్రనేత్ర చిరంజీవి
1990 మంచి దొంగ చిరంజీవి, విజయ శాంతి
1990 జగదేకవీరుడు- అతిలోక సుందరి చిరంజీవి, శ్రీదేవి
1990 అల్లుడుగారు మోహన్ బాబు, రమ్యకృష్ణ
1991 కూలీ నెం.1 వెంకటేష్, టబు
1992 సుందరకాండ వెంకటేష్, మీనా, అపర్ణ
1992 ఘరానా మొగుడు చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాథ్
1992 రౌడీ అల్లుడు చిరంజీవి, శోభన, దివ్య భారతి
1992 అల్లరి మొగుడు మోహన్ బాబు, మీనా
1992 అశ్వమేధం శోభన్ బాబు, బాలకృష్ణ , మీనా
1993 మేజర్ చంద్రకాంత్ నందమూరి తారక రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా
1994 అల్లరి ప్రియుడు రాజ శేఖర్, రమ్యకృష్ణ, మధు బాల
1994 ముద్దుల ప్రియుడు వెంకటేష్, రమ్యకృష్ణ, రంభ
1994 ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ
1994 అల్లరి ప్రేమికుడు జగపతి బాబు, రమ్యకృష్ణ, సౌందర్య, రంభ
1995 ఘరానా బుల్లోడు అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ
1995 రాజసింహం రాజ శేఖర్, రమ్యకృష్ణ, సౌందర్య
1996 బొంబాయి ప్రియుడు జె.డి.చక్రవర్తి, రంభ
1996 పెళ్ళి సందడి శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి
1996 సాహసవీరుడు - సాగరకన్య వెంకటేష్, శిల్పా షెట్టి, మాలాశ్రీ
1997 అన్నమయ్య అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి
1998 పరదేశి మాధవ్ , మోనా , ధనుజ, విశ్వ
1998 లవ్ స్టోరీ 1999 ప్రభుదేవా, నవీన్ వడ్డే , రమ్య, రంభ
1999 రాజకుమారుడు మహేష్‌ బాబు, ప్రీతి జింటా
1999 ఇద్దరు మిత్రులు చిరంజీవి, సాక్షీ శివానంద్, రమ్యకృష్ణ
2001 మంజునాధ చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా
2003 గంగోత్రి అల్లు అర్జున్ , అదితి అగర్వాల్
2005 సుభాష్ చంద్రబోస్ వెంకటేష్, శ్రియా, జెనీలియా
2005 అల్లరి బుల్లోడు నితిన్, త్రిష
2006 శ్రీరామదాసు అక్కినేని నాగార్జున , స్నేహ
2008 పాండురంగడు బాలకృష్ణ, స్నేహ
2010 ఝుమ్మందినాదం మంచు మనోజ్ కుమార్,తాప్సీ
2012 శిరిడి సాయి అక్కినేని నాగార్జున
2017 ఓం నమో వెంకటేశాయ అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరభ్ రాజ్ జైన్, ప్రగ్యా జైస్వాల్

మూలాలు

మార్చు
  1. "దర్శకేంద్రుడు@45 ఇయర్స్ ఇండస్ట్రీ.. డైరెక్టర్‌గా కే రాఘవేంద్రరావు స్పెషాలిటీ అదే." News18 Telugu. 2020-05-02. Retrieved 2020-08-12.
  2. "అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా! - reason behind why raghavedrarao wasnt introduce prabhas". www.eenadu.net. Retrieved 2021-08-12.
  3. "శ్రీదేవితో సిల్వ‌ర్ జూబ్లీ మూవీ చేయాల‌నుంది - కె.రాఘ‌వేంద్ర‌రావు". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-08-12.
  4. "సృజనాత్మక దర్శకుడు...కోవెలమూడి". Telugu News International - TNILIVE (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-23. Retrieved 2020-08-12.