సుత్తి (ఆంగ్లం: Hammer) ఒక రకమైన పరికరం. దీనిని ఒక వస్తువుపై ఒత్తిడిని కలిగించడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా గోడకు మేకులు కొట్టడానికి, కొన్ని వస్తువులను బిగించడానికి లేదా కొన్నింటిని విరగగొట్టడానికి ఉపయోగిస్తారు. చేసే పనినిబట్టి ఇవి వివిధ ఆకారాలలో, పరిమాణాలలో లభిస్తాయి. ఎక్కువ వాటిలో బరువైన లోహాలతో చేసిన తల కర్రతో చేసిన పిడికి బిగించి ఉంటుంది. వీటిని ఎక్కువగా చేతి పని కోసం వాడతారు. కొన్ని భారీ పరికరాలను యంత్రాలలో ఉపయోగిస్తారు.

ఆధునిక సుత్తి

సుత్తి అనేది చాలా రకాల వృత్తి పనులకు ఉపయోగిస్తారు. కానీ కొన్ని సమయాలలో ఆయుధంగా కూడా ఉపయోగిస్తారు. సుత్తిని కొన్ని రకాల తుపాకులలో గుండుకి శక్తిని ప్రయోగించడానికి వాడతారు.

చరిత్ర మార్చు

ఆదిమ మానవులు కొన్ని రకాల రాతితో చేసిన సాధనాలు క్రీ.పూ. 2,400,000 కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అయితే రాళ్ళను కర్రకు బిగించి సుత్తి మాదిరిగా వాడడం ఇంచుమించు క్రీ.పూ. 30,000 నుండి మొదలైనది. ఈ రకంగా మనిషి ఉపయోగించిన అతి పురాతనమైన పరికరం సుత్తి అని చెప్పవచ్చును.

గ్యాలరీ మార్చు


ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సుత్తి&oldid=3559382" నుండి వెలికితీశారు