ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన సుధా సింగ్‌ (జననం 25 జూన్ 1986) 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో భారత ఒలింపిక్ క్రీడాకారిణి. 2005 సంవత్సరం  నుండి అంతర్జాతీయ ఈవెంట్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.గణతంత్ర దినోత్సవం సందర్బంగా  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పౌర పురస్కారాల్లో 2021 వ సంవత్సరానికి గాను పద్మశ్రీ’ అవార్డు లభించింది.[1]

సుధా సింగ్
Singh in 2016
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుసుధా సింగ్
జాతీయతఇండియన్
జననం (1986-06-25) 1986 జూన్ 25 (వయసు 38)
Amethi, Uttar Pradesh, India
ఎత్తు1.58 మీ. (5 అ. 2 అం.)
బరువు45 కి.గ్రా. (99 పౌ.)
క్రీడ
దేశంIndia
క్రీడTrack and field
పోటీ(లు)3000 metres steeplechase
క్లబ్బుRailways
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు)9:26:55 (Shanghai 2016)
Updated on 9 July 2017.

ఉద్యోగం కోసం చెక్‌ నిరాకరణ

మార్చు

ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధింఛి స్టీపుల్‌ఛేజ్‌లో తొమ్మిది సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచినా అథ్లెట్ సుధా సింగ్ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా రూ.30లక్షల చెక్‌ తీసుకునేందుకు నిరాకరించింది.ఆసియా గేమ్స్ పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలతో సత్కరిస్తున్నారు.ఇందులో భాగంగా క్రీడాకారులకు చెక్కుల పంపిణీ చేస్తున్న సమయంలో సుధా సింగ్ తొలుత చెక్‌ తీసుకునేందుకు నిరాకరించారు.అంతేకాదు తనకి రూ.30 లక్షలు వద్దని ప్రభుత్వ ఉద్యోగం కావాలని సీఎం యోగిని కోరారు.ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆ తర్వాత ఆమె చెక్‌‌ను అతను చేతుల మీదుగా అందుకున్నారు.[2]

డిప్యూటీ డైరెక్టర్‌ ఉద్యోగం

మార్చు

సుధా సింగ్ కి యూపీ స్పోర్ట్స్‌ , డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ పదవి ఇవ్వడానికి నిరాకరించింది.దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెక్‌ తీసుకోవడానికి నిరాకరించి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.దాంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వడాని యోగి ఆదిత్యనాథ్‌ ఒప్పుకోవడంతో మళ్ళీ సభాస్థలికి వచ్చారు.డిప్యూటీ డైరెక్టర్‌‌ పోస్టు ఇస్తే ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహించవచ్చునని ఆమె భావిస్తున్నారు.

సాధించిన పథకాలు

మార్చు
  • 2010 ఆసియా క్రీడల్లో బంగారు పతకం
  • 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో, 2017 ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది.
  • 2018 ఆసియా క్రీడల్లో 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజత పతకం సాధించారు.
  • 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ బరిలోకి దిగింది.[3]

మూలాలు

మార్చు
  1. "ఏడుగురికి 'పద్మశ్రీ'..." Sakshi. 2021-01-26. Retrieved 2021-11-16.
  2. ""సీఎం యోగీ" కి షాక్ ఇచ్చిన...."స్వర్ణ విజేత" సుధా సింగ్". indiaherald.com. Retrieved 2021-11-16.
  3. "sudha singh".{{cite web}}: CS1 maint: url-status (link)