సున్నుండ

(సున్ని ఉండలు నుండి దారిమార్పు చెందింది)

సున్ని ఉండలు పోషక పదార్ధాలు అధికంగా కల మినుముల, గోధుమల యొక్క మిశ్రమ మిఠాయిలు. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ, ఎక్కువకాలం నిలువఉండేందుకుగానూ మంచి మిఠాయిలుగా సున్ని ఉండలను పేర్కొంటారు. సున్నుండ ఒక తెలుగు పిండివంట. దీనిని ఎక్కువగా కోస్తా ప్రాంతంలో తయారు చేస్తారు.

దస్త్రం:Sunni undalu.jpg
నోరూరించే సున్నిఉండలు
సున్నుండలు

తయారీ విధానం

మార్చు

మినుములను, గోధుమలను వేయించి, మెత్తగా పిండి ఆడించుకొని ఆ మిశ్రమానికి పొడిగా చేసిన బెల్లమును కలిపి ఉంచుతారు. ఆ పొడిని బాణలిలో వేసి తగినంత నెయ్యి పోస్తూ వేడిచేస్తూ కలియబెడతారు. బాగా వేడి అయిన తరువాత దానిని గుండ్రటి ఉండలుగా చేతి పట్టుతో బిగిస్తూ పోతారు. ఆవిధంగా సున్ని ఉండలు సిద్దం.

వివిద ప్రాంతాలలో సున్ని ఉండలు

మార్చు

సున్ని ఉండలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతరప్రాంతాలలో సైతం వాడుతారు. ఆంధ్రప్రాంతంలో అధికంగా వీటిని పెద్దపండుగగా వ్యవహరించే సంక్రాంతికి ప్రతి ఇంట్లో చేస్తుంటారు.సున్నుండలు యొక్క మూలాలను ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప పాక వారసత్వం నుండి గుర్తించవచ్చు, ఇది శక్తివంతమైన రుచులు, విభిన్న వంటకాల కోసం జరుపుకునే రాష్ట్రం. ఈ సాంప్రదాయ స్వీట్ తెలుగు సంస్కృతిలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది.[1]

బయటి లింకులు

మార్చు
  1. "sugar sunnundalu". Nihuusravee.
"https://te.wikipedia.org/w/index.php?title=సున్నుండ&oldid=4193897" నుండి వెలికితీశారు