సుభద్రా శ్రీనివాసన్

సుభద్రా శ్రీనివాసన్ ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు.[1]

సుభద్రా శ్రీనివాసన్
Subhadra Srinivasan.png
జననంసుభద్ర
(1925-08-18)1925 ఆగస్టు 18
బళ్లారి, కర్నాటక, భారతదేశం
మరణంనవంబర్ 5, 1972
తిరుపతి
వృత్తిఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులు
ఉద్యోగంఎ.పి.బివరేజస్ కార్పొరేషన్
మతంహిందూ
భార్య / భర్తపార్థసారథి శ్రీనివాసన్
పిల్లలురంగరాజన్, విజయశ్రీ
తండ్రిపరాంకుశం నరసింహస్వామి
తల్లిఆండాళమ్మ

జననం - విద్యాభ్యాసంసవరించు

సుభద్రా శ్రీనివాసన్ 1925, ఆగస్టు 18న పరాంకుశం నరసింహస్వామి, ఆండాళమ్మ దంపతులకు కర్నాటక లోని బళ్లారి జిల్లాలో జన్మించింది. నరసింహస్వామి స్వగ్రామం ఒరిస్సా లోని బరంపురం. బళ్లారిలో పోలీస్ ఇనస్నెక్టర్ గా పనిచేశారు. విశాఖపట్టణం లోని ఎ.వి.ఎన్. కళాశాలలో, విజయనగరం యం.ఆర్. కళాశాలల్లో చదువును పూర్తిచేసింది. రసాయన శాస్తం లో పట్టభద్రులయింది.

ఆకాశవాణిలోసవరించు

1948లో మద్రాసు ఆకాశవాణిలో ప్రోగ్రాం సెక్రటరీగా చేరింది. తమిళనాడు శ్రీరంగా నికి చెందిన పార్థసారథి శ్రీనివాసన్ కూడా మద్రాసు ఆకాశవాణిలో ప్రోగ్రాం సెక్రటరీగా పనిచేసేవారు. వారి పరిచయం వివాహబంధంగా మారింది. 1948 డిసెంబరు 1న ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభంకాగానే మద్రాసు నుండి విజయవాడకు వచ్చారు.

కార్యక్రమాల్లో భాగంగా అనేక ఊర్లు తిరుగుతూ ప్రభుత్వాధికారులు, వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులతో చర్చించేది. అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉద్యోగ నిమిత్తం నాగాలాండ్ లోని కొహిమాకు వెళ్లింది.

మరణంసవరించు

1972, నవంబరు 5న తిరుపతి మరణించారు.

మూలాలుసవరించు

  1. సుభద్రా శ్రీనివాసన్, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 286. ISBN 978-81-8351-2824. {{cite book}}: |access-date= requires |url= (help)