సుభాష్ షిండే
సుభాష్ షిండే మహారాష్ట్ర లో చంద్రపూర్ కు చెందిన నగల వర్తకుడు. ఆయన సమాజంలో పదిమందికీ ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు వచ్చిన లాభాలను, ఆస్తిపాస్తులను కూడబెట్టు కోవడానికి కాకుండా పేదవాళ్లకు, ఆపదలో ఉన్నవాళ్లకు వెచ్చిస్తూ ఎందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.[1]
జీవిత విశేషాలు
మార్చుఆయన మహారాష్ట్ర లోని చంద్రపూర్ లో పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి బంగారు,వెండి పనిలో కార్మికునిగా పనిచేసేవాడు. బాల్యంలో ఆయన తండ్రికీ సహకారం అందిస్తుండేవాడు. ఒకసారి ఆయన తన పాఠశాలలోని రిక్షా కార్మికుని కుమారుడైన స్నేహితునికి బట్టలను యిచ్చి తన దాతృత్వంతో పాఠశాలలో గుర్తింపు పొందాడు. బాల్యంగా చదువుపై శ్రద్ద చూపక ఆటలపై శ్రద్ధ కనబరచేవాడు. చదువుపై శ్రద్ధ చూపకపోవడంపై ఆయన తల్లిదండ్రులు ఆయన భవిష్యత్తు గూర్చి బాధపడేవారు. అయితే ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక రాత్రి నిద్రలో... ‘నేను మంచివాడిగా మార తాను’ అని కలవరించసాగాడు సుభాష్. ‘ఏమైందిరా’ అని సుభాష్‌ను లేపి అడి గింది తల్లి. ‘నువ్వు మారతావు కదూ అని ఎవరో అడిగితే మారతాను అని చెప్పాను’ అన్నాడు సుభాష్. ఇక అప్పటి నుంచి అతడిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎంత మార్పంటే... ‘వీడు మా అబ్బాయేనా?’ అని తల్లి దండ్రులు కూడా ఆశ్చర్యపడేంత.[2]
సమాజ సేవ
మార్చుచదువు అబ్బకపోవడంతో తండ్రితో పాటు ఒక నగల దుకాణంలో పని చేయడం మొదలు పెట్టాడు. మెల్లగా నగల వ్యాపారంలో మెళకువలు తెలుసుకున్నాడు. దాంతో సొంతగా నగల వ్యాపారం చేయాలనే కోరిక పెరిగింది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి నగల దుకాణం తెరిచాడు. వ్యాపార మెళకువలు కొట్టిన పిండి కావడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది సుభాష్‌కి. దూసుకుపోయాడు. కానీ గర్వం తలకెక్క లేదు, ధన వ్యామోహం పెరగలేదు. తాను బాగున్నాడు కాబట్టి మరికొందరు బాగుండేలా చేయాలి అనుకున్నాడు. ఇస్త్రీ చేసి బతికే పన్నాలాల్ కూతురికి గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ ఖర్చును భరించడం పన్నాలాల్ వల్ల కాదు. అది తెలిసి సుభాషే ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించాడు. అలా ఇప్పటి వరకు నాలుగొందల మంది హార్ట్ పేషెంట్లకు సహాయపడ్డాడు. ఎంతోమంది పేదలకు కంటి ఆపరేషన్లు చేయించాడు. అనాథలకు అండగా నిలుస్తున్నాడు. పేద వృద్ధులకు కొడుకులా సాయపడుతున్నాడు.[2]
పుస్తకం
మార్చుఎవరికే కష్టం వచ్చినా ‘నేనున్నాను’ అని ముందుకు వచ్చే సుభాష్ షిండేపై అతడి మిత్రుడు శ్రీరామ్ ‘అసామాన్య సామాన్య మానుష్’ పేరుతో ఒక పుస్తకం రాశాడు.
మూలాలు
మార్చు- ↑ "This Small Town Jeweller Is Showing Us All What It Is Like to Have a Heart of Gold". Manabi Katoch. thebetterindia. December 20, 2015. Retrieved 15 January 2016.
- ↑ 2.0 2.1 "400 గుండెల సుభాష్!". సాక్షి. సాక్షి. January 16, 2016. Retrieved 15 January 2016.