సురభి లక్ష్మి
సురభి లక్ష్మి భారతీయ చలనచిత్రం, టెలివిజన్, రంగస్థల నటి. ఆమె మలయాళ చలనచిత్రాలు, టెలివిజన్ షోలలో నటిస్తుంది.[2] ఆమె మలయాళ చిత్రం మిన్నమినుంగు (Minnaminungu) లో తల్లి పాత్రను పోషించినందుకు 2016లో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[3]
సురభి లక్ష్మి | |
---|---|
జననం | సురభి సి.ఎం. 1986 నవంబరు 16 నరిక్కుని, కోజికోడ్, కేరళ, భారతదేశం |
విద్య | థియేటర్ ఆర్ట్స్ లో మాస్టర్స్ |
విద్యాసంస్థ | మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కేరళ శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2005 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విపిన్ సుధాకర్
(m. 2014; div. 2017) |
పురస్కారాలు | ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు (2016) |
వెబ్‌సైటు | https://www.surabhilakshmi.com/ |
మీడియా వన్ టీవీలో ప్రారంభించిన మలయాళ హాస్య టెలివిజన్ సిరీస్ M80 మూసా ద్వారా ఆమె పాతు పాత్రకు ప్రసిద్ధి చెందింది.[4]
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుసురభి లక్ష్మి కేరళలోని కోజికోడ్ సమీపాన ఉన్న నరిక్కుని ఆండీ, రాధలకు 1986 నవంబరు 16న జన్మించింది.[5][6][7] ఆమె కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో మొదటి ర్యాంక్‌తో బి.ఎ. డిగ్రీని పొందింది.[2] ఆమె శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుండి థియేటర్ ఆర్ట్స్‌లో ఎం.ఎ డిగ్రీని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుండి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఎం.ఫిల్ పట్టా పుచ్చుకుంది.[6] 2017 నాటికి, ఆమె శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయంలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో పి.హెచ్.డి విద్యార్థిని.[8]
కెరీర్
మార్చుఅమృత టీవీలో రియాల్టీ షో బెస్ట్ యాక్టర్లో లక్ష్మి గెలుపొందింది.[9]
మిన్నమినుంగు చిత్రంలో ఆమె నటనకు విశేష స్పందనతోపాటు పలు పురస్కారాలు వరించాయి. ఆమె 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.[10][11] కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2016లో ప్రత్యేక జ్యూరీ, రెండవ ఉత్తమ నటిగా మలయాళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు 2016 ఆమె సాధించింది.
ఆమె ఇరవైకి పైగా మలయాళ చిత్రాలలో, రెండు టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[12]
మూలాలు
మార్చు- ↑ "Surabhi Lakshmi divorced: National award winning actress' ex-husband posts their 'last selfie'". International Business Times. 2017-07-12.
- ↑ 2.0 2.1 "Six things you did not know about national award winning Surabhi Lakshmi". The New Indian Express. Archived from the original on 2019-08-22. Retrieved 2019-09-03.
- ↑ "National Film Awards 2017: Surabhi Lakshmi bags Best Actress award, five facts you must know". The Indian Express (in Indian English). 2017-04-07. Retrieved 2019-09-03.
- ↑ "നാലാം ക്ലാസ്സില് നാലു വട്ടം തോറ്റ പാത്തു: സുരഭിയുടെ പ്രസംഗത്തിന് കൈയടിച്ച് സദസ്". Mathrubhumi (in ఇంగ్లీష్). Archived from the original on 2019-09-03. Retrieved 2019-09-03.
- ↑ "The Scent Of Acting - Trivandrum News - Yentha.com". Archived from the original on 27 June 2018. Retrieved 17 October 2014.
- ↑ 6.0 6.1 "About Surabhi Lakshmi, Indian National Award winner for best actress 2016". Retrieved 2019-09-03.
- ↑ "Surabhi is taking a big leap". Archived from the original on 3 September 2014. Retrieved 17 October 2014.
- ↑ "I Don't Want To Be A Star, I Want To Be A Good Artist, Says Surabhi Who Won The National Award For Best Actress". Outlook (India). Retrieved 2019-09-03.
- ↑ "Surabhi Lekshmi wins Amrita TV's Best Actor". visit www.TheSuccessor.com. 2008-01-29. Retrieved 2017-04-13.
- ↑ "National Film Awards 2017: Malayalam wins big, Surabhi Best Actress Times of India". The Times of India. Retrieved 2017-04-10.
- ↑ "National Film Awards 2016: Best Actress Surabhi for Minnaminungu". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-04-07. Retrieved 2017-04-10.
- ↑ "Surabhi Lakshmi Malayalam Actress Encyclopedia,Profile,Biography,Bio Data,Portfolio,Personal Details". Filmiparadise. Archived from the original on 22 అక్టోబరు 2014. Retrieved 17 October 2014.