అంహెట్టిగే సురేష్ అసంక పెరెరా, శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం ఆల్ రౌండర్ గా రాణించాడు. శ్రీలంక జాతీయ జట్టు కోసం మూడు టెస్టులు, 20 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. 1998 జూన్ నుండి 2001 డిసెంబరు వరకు అంతర్జాతీయ కెరీర్ లో ఆడాడు.

సురేష్ పెరెరా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అంహెట్టిగే సురేష్ అసంక పెరెరా
పుట్టిన తేదీ (1978-02-16) 1978 ఫిబ్రవరి 16 (వయసు 46)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 73)1998 ఆగస్టు 27 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2001 ఆగస్టు 22 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 95)1998 జూన్ 19 - ఇండియా తో
చివరి వన్‌డే2001 డిసెంబరు 11 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995–2003Sinhalese Sports Club
2003–2004Colombo Cricket Club
2005–2006Badureliya Sports Club
2006–2009Moors Sports Club
2008Wayamba
2009Kandurata
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 20 88 105
చేసిన పరుగులు 77 195 2,431 1,622
బ్యాటింగు సగటు 25.66 17.72 24.06 23.85
100లు/50లు 0/0 0/1 0/7 0/7
అత్యుత్తమ స్కోరు 43* 56* 78 90
వేసిన బంతులు 408 579 6,914 1,805
వికెట్లు 1 13 147 60
బౌలింగు సగటు 180.00 40.15 24.90 28.56
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/104 2/25 7/73 4/20
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 4/– 44/– 26/-
మూలం: Cricinfo, 2014 మే 13

జననం, విద్య

మార్చు

అంహెట్టిగే సురేష్ అసంక పెరెరా 1978, ఫిబ్రవరి 16న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. ఇసిపఠానా కళాశాలలో విద్యనభ్యసించాడు.

దేశీయ క్రికెట్

మార్చు

దేశీయ క్రికెట్ లో 1995 డిసెంబరు నుండి 2009 అక్టోబరు వరకు ఏడు వేర్వేరు జట్లకు ఆడాడు. ఇందులో కొలంబో ఆధారిత సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ కోసం ఎక్కువ మ్యాచ్‌లు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన తరువాత, ఇతను ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు.

శరవణముత్తు ట్రోఫీలో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన పెరెరా 17 సంవత్సరాల వయస్సులో 1995 డిసెంబరులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[1] 1997-98 సీజన్‌లో, ఇతను తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు,[2] 19.03 సగటుతో 29 వికెట్లు తీసుకున్నాడు,[3] శ్రీలంక ఎ తరపున కూడా అరంగేట్రం చేశాడు.[1] 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో కొలంబో క్రికెట్ క్లబ్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[4]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

1998 సింగర్-అకాయ్ నిదాహాస్ ట్రోఫీలో తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. భారత్‌తో రెండు మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్ ఆడాడు.[5] శ్రీలంక 1998 ఇంగ్లాండ్ పర్యటనలో తన టెస్ట్ అరంగేట్రం చేసాడు, శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి అలెక్ స్టీవర్ట్ వికెట్‌తో 43 నాటౌట్‌ను సాధించాడు.[6][7] ఆ సంవత్సరం తరువాత, పెరెరా 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు, ఆ జట్టు న్యూజిలాండ్‌తో కాంస్య పతకం కోసం ప్లే-ఆఫ్‌ను కోల్పోయింది.[8]

పదవీ విరమణ తర్వాత

మార్చు

కొంతకాలం శ్రీలంకలో బ్యాంక్ టెల్లర్‌గా పనిచేశాడు. 2000ల చివరలో తన భార్యతో కలిసి పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్ళాడు. ఆస్ట్రేలియాలో వెయిటర్, ఫోర్క్‌లిఫ్ట్ డ్రైవర్‌గా పనిచేశాడు.[7] 2013-14 సీజన్ నాటికి, అతను స్థానిక పెర్త్ పోటీలో ఆడుతూ బస్సెండియన్ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.[9]

మూలాలు

మార్చు
  1. ఇక్కడికి దుముకు: 1.0 1.1 First-class matches played by Suresh Perera (88) – CricketArchive. Retrieved 13 May 2014.
  2. First-class batting and fielding in each season by Suresh Perera – CricketArchive. Retrieved 13 May 2014.
  3. First-class bowling in each season by Suresh Perera – CricketArchive. Retrieved 13 May 2014.
  4. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 22 April 2021.
  5. ODI matches played by Suresh Perera (20) – CricketArchive. Retrieved 13 May 2014.
  6. Test matches played by Suresh Perera (3) – CricketArchive. Retrieved 13 May 2014.
  7. ఇక్కడికి దుముకు: 7.0 7.1 Tristan Lavalette (12 May 2014). "Bassendean's Sri Lankan star who wasn't" – ESPNcricinfo. Retrieved 13 May 2014.
  8. List A matches played by Suresh Perera (105) – CricketArchive. Retrieved 13 May 2014.
  9. Tristin Lavalette (6 March 2014). "What happened to Sri Lanka’s Suresh Perera?" – The Roar. Retrieved 13 May 2014.