సూపర్ ఓవర్ (2021 సినిమా)

ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు సినిమా

సూపర్ ఓవర్, 2021 జనవరి 22న విడుదలైన తెలుగు సినిమా. ఎస్ఏఎస్ పిక్చర్స్ బ్యానర్ లో సుధీర్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ వర్మ దర్శకత్వం వహించాడు.[1][2][3] ఈ సినిమాలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా,[4][5] ఎంఆర్ సన్నీ సంగీతం సమకూర్చాడు.[6] ఇది ఆహా ఓటిటి వేదికగా విడుదలయింది.[7]

సూపర్ ఓవర్
దర్శకత్వంప్రవీణ్ వర్మ
రచనప్రవీణ్ వర్మ
నిర్మాతసుధీర్ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణందివాకర్ మణి
కూర్పుఎస్.ఆర్. శేఖర్
సంగీతంఎంఆర్ సన్నీ
నిర్మాణ
సంస్థ
ఎస్ఏఎస్ పిక్చర్స్
పంపిణీదార్లుఆహా
విడుదల తేదీs
22 జనవరి, 2021
సినిమా నిడివి
83 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

కాశి (నవీన్ చంద్ర), మధు (చాందిని చౌదరి), వాసు (రాకేందు మౌళి) ముగ్గురు స్నేహితులు. కాశి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ, కన్సల్టెంట్ చేత మోసం చేయబడుతాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించడంకోసం డబ్బు సంపాదించడానికి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభిస్తాడు. ఆ బెట్టింగ్ లో 1.7 కోట్లు గెలుస్తాడు. కాశి తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన డబ్బును ఎలా సేకరిస్తాడు, ఆ సమయంలో వాళ్ళ ఎదురయ్యే పరిణామాల ఏంటి అనేది మిగతా కథ.

నటవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

2019 చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. 2020, అక్టోబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్ వర్మ మరణించాడు. ఆ తర్వాత సినిమా నిర్మాత సుధీర్ వర్మ పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించాడు.[11][12]

స్పందన

మార్చు

సూపర్ ఓవర్ మంచి థ్రిల్లర్ సినిమా" అని ది హిందూ పత్రికలో సంగీత దేవి రాసింది.[13] నటన, స్క్రీన్ ప్లేలో కొత్తదనం, దర్శకత్వ ప్రతిభ గురించి సాక్షి పత్రిక సినీ విమర్శకుడు రెంటాల జయదేవ ప్రశంసించాడు.[14] "సూపర్ ఓవర్ సినిమా క్రైమ్ థ్రిల్లర్, ఇందులో కథనం బాగుంది, చూడదగిన సినిమా" అని 123 తెలుగు సమీక్షకుడు వ్రాశాడు.[15]

మూలాలు

మార్చు
 1. Telugu, TV9 (2021-01-19). "Super Over Movie Update: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న 'సూపర్ ఓవర్'.. ట్రైలర్ విడుదల చేసిన అక్కినేని హీరో.. - nagachaitanya released Super over Trailer". TV9 Telugu. Archived from the original on 2021-01-28. Retrieved 2021-02-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Winters, Bryce J. (2021-01-21). "The journey with late Telugu director Praveen Varma for "Super Over" movie cannot be forgotten". TheNewsCrunch. Retrieved 2021-02-11.
 3. World, Republic. "'Super Over' movie review: Netizens calls it a 'gripping thriller' with 'crazy climax'". Republic World. Retrieved 2021-02-11.
 4. AdminWP 2021-01-21T11:13:40+05:30 (2021-01-21). "Super Over Trailer - Naveen Chandra, Chandini Chowdary, Sudheer Varma - An AHA Original". Chitramala. Retrieved 2021-02-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 5. "క్రికెట్‌ బెట్టింగ్‌ కష్టాలు". ntnews. 2021-01-22. Retrieved 2021-02-11.
 6. Telugu, TV9. "Aha Super Over". TV9 Telugu. Retrieved 2021-02-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 7. Vyas (2021-01-17). "Super Over to release on January 22". www.thehansindia.com. Retrieved 2021-02-11.
 8. "Actor Naveen Chandra as 'Kaasi' in 'Super Over' movie, aha release on Jan 22". ap7am.com. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
 9. "Promo: Chandini Chowdary as Madhu in Super Over, film to premiere on aha from Jan 22". ap7am.com. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
 10. K, Krishna. "Sneak Peek Into Naveen Chandra's 'Super Over'". TeluguStop.com. Retrieved 2021-02-11.
 11. Pecheti, Prakash. "The cast of 'Super Over' recalls memories with director Praveen Varma". Telangana Today. Retrieved 2021-02-11.
 12. Dundoo, Sangeetha Devi (2021-01-22). "'Super Over' movie review: It happened one night". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-11.
 13. Dundoo, Sangeetha Devi (2021-01-22). "'Super Over' movie review: It happened one night". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-11.
 14. "'సూపర్‌ ఓవర్' మూవీ రివ్యూ". Sakshi. 2021-01-23. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
 15. "OTT Review : Super Over – Decent crime thriller (Streaming on AHA)". 123telugu.com. 2021-01-21. Retrieved 2021-02-11.

బయటి లింకులు

మార్చు