సూరారం కవిరంగదాసు

20వ శతాబ్దికి చెందిన వాగ్గేయకారుడు సూరారం కవిరంగదాసు.[1] మహబూబ్ నగర్ జిల్లా సూరారం (కోయిలకొండ) గ్రామానికి చెందిన వాడు. ఎన్నో సంకీర్తనలు రచించారు. అంతే కాకుండా తాళపత్ర గ్రంథాలు రచించారు. ఇందులో జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, జలార్గ శాస్త్రము, మంత్ర శాస్త్రమునకు సంబంధించిన వివరణ ఉందని వీరి కుటుంబీకులైన శ్రీవైష్ణవ వేణుగోపాల్ తెలిపారు.[2] ఇతని కీర్తనలు మహబూబ్ నగర్ జిల్లా అంతటా వ్యాప్తి చెందాయి. తన పేరుమీదనే కవిరంగ దాసునికి అంకితం ఇస్తున్నట్లు కీర్తనలు రచించారు. సూరారం గ్రామంలో వీరి పొలం దగ్గర పులిగట్టు గుహలో తపస్సు చేసి భగవంతుని సాక్షత్కారము పొందిన గొప్ప పండితుడు వాగ్గేయకారుడని సూరారం గ్రామ పెద్దలు చెప్పుకుంటారు.[3] వీరి కుటుంబానికి చెందిన యువకవి శ్రీవైష్ణవ వేణుగోపాల్ శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలపై మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేశారు. ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కాశీలో తెలుగు సాహిత్యంలో సరస్వతి అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేస్తున్నారు..

Suraram Kavirangadasu
సూరారం కవిరంగదాసు
ఇతర పేర్లుసూరారం కవిరంగదాసు
జననంసూరారం (కోయిలకొండ) మహబూబ్ నగర్ జిల్లా
మరణంసూరారం (కోయిలకొండ) మహబూబ్ నగర్ జిల్లా
వృత్తివాగ్గేయకారుడు

సూరారం కవిరంగదాసు ప్రసిద్ధ కీర్తనలు మార్చు

  • వందనములు జేతామా సద్గురునాకు
  • రామయ్యరారా రఘుకుల శేఖర
  • వాసుదేవా నీ దాసుడను కృప జూపవ
  • రారా శంకర కృప సాగర నన్ను
  • పాహిమాం శ్రీ శారదా పాలించు
  • రారా కరుణ కలిగి బ్రోవర రాములు
  • రామ రావేమి ఇంతటి రాజా సుమ

మూలాలు మార్చు

  1. తెలంగాణ వైభవం పరిచయ కరదీపిక, ప్రచురణ : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ, తెలంగాణ, హైద్రాబాద్. 2017, పేజీ 140.
  2. సూరారం కవిరంగదాసు తాళపత్ర గ్రంథాలు, రచన : సూరారం కవిరంగదాసు
  3. సూరారం కవిరంగదాసు కీర్తనలు అముద్రితము, రచన : సూరారం కవిరంగదాసు