సూరినామ్‌లో హిందూమతం
సురినామ్‌లో హిందూ మతం రెండవ అతిపెద్ద మతం. ARDA ప్రకారం, 2015 నాటికి సురినామ్‌లో 1,29,440 మంది హిందువులు ఉన్నారు. జనాభాలో ఇది 23.15%. [1] [2] పశ్చిమార్ధగోళంలో గయానా (24.8%) తర్వాత సురినామ్ లోనే ఎక్కువ మంది హిందువులు ఉన్నారు.
చరిత్ర
మార్చుసురినామ్లోని హిందువుల ప్రస్థానం గయానా, ట్రినిడాడ్ టొబాగోలతో స్థూలంగా సమాంతరంగా ఉంటుంది. డచ్చి, బ్రిటిషు వారు చేసుకున్న ప్రత్యేక ఏర్పాటు ద్వారా భారతీయ ఒప్పంద కార్మికులను వలస డచ్ గయానాకు పంపారు. [3] తేడా ఏమిటంటే, హిందూమతం పట్ల నెదర్లాండ్స్ వారు మరింత ఉదారవాద విధానాన్ని అవలంబించారు. తమ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవడానికి అనుమతించారు. పటిష్టమైన కుల వ్యవస్థ లేకపోవడం, గీత, రామాయణాలను దాదాపు అందరూ చదవడం దీనికి ఉదాహరణలు. [4] [5]
జనాభా వివరాలు
మార్చుARDA ప్రకారం, 2015 నాటికి సురినామ్‌లో 1,29,440 మంది హిందువులు ఉన్నారు. దేశ జనాభాలో ఇది 23.15% [6] [7]
సంవత్సరానికి జనాభా
మార్చుసంవత్సరం | హిందువుల శాతం | మార్పు |
---|---|---|
1900 | 16.4% | - |
1916 | 19.8% | +3.4% |
1936 | 21.8% | +2.0% |
1946 | 19.5% | -2.3% |
1964 | 27% | +7.5% |
1971 | 29.5% | +2.5% |
1980 | 27.4% | -2.1% |
2004 | 19.9% | -7.4% |
2012 | 22.3% | +2.4% |
2015 | 23.1% | +0.8% |
హిందువుల శాతం ప్రారంభంలో (1900 - 1930లు) పెరిగింది. 1930లు 1980ల మధ్య కొద్దిగా హెచ్చుతగ్గులకు లోనైంది. 20లలో (20%) స్థిరంగా ఉంది. 20వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో మతపరమైన జనాభాలో వచ్చిన మార్పులను వలసలు కారణం. 20వ శతాబ్దపు రెండవ భాగంలో, ప్రత్యేకించి 1970ల తర్వాత స్వాతంత్ర్యం (1975) వచ్చాక, 1980-1987లో సైనిక పాలన సమయంలోనూ నెదర్లాండ్స్‌కు పెద్ద ఎత్తున వలసలు రావడం వలన హిందువుల సంఖ్య క్షీణించింది. [8]
జిల్లాల వారీగా జనాభా
మార్చుజిల్లా | హిందువుల శాతం |
---|---|
సరమక్క | 44.6% |
నికెరీ | 43.2% |
వానికా | 39.9% |
కోమెవైనె జిల్లా | 24.5% |
పరమారిబో | 13.8% |
పారా | 4.9% |
కరోనీ | 2.2% |
మారోవిజ్నే | 0.9% |
బ్రోకోపోండో | 0.4% |
సిపాలివిని | 0.3% |
హిందూ తెగలు
మార్చు2012 జనాభా లెక్కల ప్రకారం, సురినామీస్‌లో 18% మంది సనాతనీ హిందువులు, 3.1% ఆర్య సమాజీకులు. 1.2% మంది ఇతర హిందూ మతాన్ని అనుసరిస్తారు.
సురినామ్‌లో ఇస్కాన్ ఉనికి ఉంది. సురినామ్‌ను సందర్శించిన మొదటి హరే కృష్ణ భక్తులు 1980ల ప్రారంభంలో గయానా నుండి వచ్చారు. మొదటి కేంద్రం దాదాపు రెండు దశాబ్దాల క్రితం స్థాపించారు. ఇప్పుడు దేశంలోని రెండవ పెద్ద నగరమైన న్యూ నికెరీలో పెద్ద బోధనా కేంద్రం ఉంది. [9]
జాతి
మార్చుసురినామ్లోని మెజారిటీ హిందువులు తూర్పు భారతీయులు. మిశ్రమ జాతి ప్రజలు (3210 మంది), జావానీస్ సురినామీస్ (915 మంది) లోను హిందువులు ఉన్నారు. చైనీస్ సురినామీస్ (157 మంది), క్రియోల్ (142 మంది), మెరూన్ (84 మంది), స్వదేశీ ప్రజలు (83 మంది), ఆఫ్రో-సురినామీస్ (59 మంది)లో కూడా హిందువులున్నారు. [11]
సాంప్రదాయిక సంఘం | హిందూ మతాన్ని ఆచరిస్తున్న జాతి సమూహంలో శాతం |
---|---|
ఇండో-సురినామీస్ | 78% |
మిశ్రమ | 2.4% |
చైనీస్ | 1% |
ఆఫ్రో-సురినామీస్ | 0.5% |
జావానీస్ | 1.2% |
స్థానిక ప్రజలు | 0.04% |
క్రియోల్ | 0.017% |
మెరూన్ | 0.007% |
సమకాలీన సమాజం
మార్చుభాష
మార్చుఆంగ్లం మాట్లాడే పొరుగు గయానా హిందువులకు విరుద్ధంగా, సురినామీ హిందువులు సర్నామీ హిందుస్తానీ ఎక్కువగా మాట్లాడుతారు. ఇది భోజ్ పూరిలో ఒక మాండలికం. ట్రినిడాడ్, గయానా వంటి బ్రిటీష్ కాలనీల మాదిరిగా కాకుండా, ఇండో-కరేబియన్ జనాభాను తమ మాతృభాషలను విడిచిపెట్టమని డచ్చివారు బలవంతం చేయకపోవడమే దీనికి కారణం. ట్రినిడాడ్, గయానాల్లో సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలను తుడిచిపెట్టే క్రమంలో ఇంగ్లీషును నిర్బంధం చేసారు. [12]
పండుగలు
మార్చుసురినామ్లో దీపావళి, హోలీ జాతీయ సెలవులు. [13]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Suriname, Religion And Social Profile". thearda.com. Archived from the original on 2021-06-17. Retrieved 2021-10-15.
- ↑ "Microsoft PowerPoint - DEFINITIEF-VOL-I.ppt" (PDF). Archived from the original (PDF) on 2015-09-24. Retrieved 2018-09-20.
- ↑ http://www.gopio.net/publications_articles/Immigration_lecture_Sandew_Hira.pdf
- ↑ "Hindus of South America". Guyanaundersiege.com. Retrieved 2018-09-20.
- ↑ Emmer, Pieter Cornelis; Ulijaszek, Stanley (2006). The Dutch Slave Trade, 1500-1850. ISBN 9781845450311.
- ↑ "Suriname, Religion And Social Profile". thearda.com. Archived from the original on 2021-06-17. Retrieved 2021-10-15.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2015-09-24. Retrieved 2018-09-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ https://www.researchgate.net/publication/310188560_Colonial_Christian_Dominance_and_Religious_Diversity_in_Suriname
- ↑ "ISKCON Suriname Holds First Ratha-yatra". 30 September 2016. Archived from the original on 30 నవంబర్ 2018. Retrieved 21 జనవరి 2022.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ https://unstats.un.org/unsd/demographic/sources/census/wphc/Suriname/SUR-Census2012-vol1.pdf
- ↑ https://unstats.un.org/unsd/demographic/sources/census/wphc/Suriname/SUR-Census2012-vol1.pdf
- ↑ "Surinamese Hinduism's Enduring Practice". 6 May 2015.
- ↑ "Suriname Public Holidays".