సూర్యాబాగ్ (విశాఖపట్టణం)

విశాఖపట్నంలోని పాత శివారు ప్రాంతం

సూర్యాబాగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని పాత శివారు ప్రాంతం.[1] జగదాంబ సెంటర్ కు సమీపంలో ఉన్న ఈ సూర్యాబాగ్ ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ దుకాణాల కేంద్రంగా ఉంది.[2] ఇక్కడ విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ కార్యాలయం, విశాఖి జల ఉధ్యానవనం ఉన్నాయి. ఆ ప్రాంతం పాత పట్టణం, కొత్త నగరాల మధ్య వారధిగా ఉంది.

సూర్యాబాగ్
సమీపప్రాంతం
సూర్యాబాగ్ లోని విశ్వేశ్వర స్వామి దేవాలయ గోపురం
సూర్యాబాగ్ లోని విశ్వేశ్వర స్వామి దేవాలయ గోపురం
సూర్యాబాగ్ is located in Visakhapatnam
సూర్యాబాగ్
సూర్యాబాగ్
విశాఖపట్టణంలోని సూర్యాబాగ్ ఉనికి
Coordinates: 17°42′44″N 83°17′58″E / 17.712202°N 83.299386°E / 17.712202; 83.299386
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530020
Vehicle registrationఏపి

భౌగోళికం

మార్చు

ఇది 17°42′44″N 83°17′58″E / 17.712202°N 83.299386°E / 17.712202; 83.299386 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సూర్యాబాగ్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, పూర్ణ మార్కెట్, యారాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను, మర్రిపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

వాణిజ్య ప్రాంతం

మార్చు
 
సూర్యాబాగ్ రోడ్

ఇక్కడ అనేక దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్‌ వస్తువులకు కేంద్రంగా ఉంది. సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నం సెంట్రల్ షాపింగ్ మాల్ ఉంది.

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. కాశీ విశ్వేశ్వర దేవాలయం
  2. రామాలయం
  3. దుర్గా భవానీ దేవాలయం
  4. రామలింగేశ్వర స్వామి దేవాలయం
  5. అల్లిపురం మసీదు
  6. మసీదు-ఇ-ఫిర్డస్
  7. కేరళ మసీదు

మూలాలు

మార్చు
  1. "Suryabagh, Jagadamba Junction Locality". www.onefivenine.com. Retrieved 6 May 2021.
  2. "Oganic saris on sale at Co-optex outlet". The Hindu. Special Correspondent. 2017-07-29. ISSN 0971-751X. Retrieved 6 May 2021.{{cite news}}: CS1 maint: others (link)
  3. "Suryabagh, Daba Gardens, Allipuram Locality". www.onefivenine.com. Retrieved 6 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 6 May 2021.