సూర్యోదయాస్తమయాలు

భూమి రోజూ వారీ భ్రమణం వలన: సూర్యోదయం: సూర్యుని ఎగువనున్న భాగము హోరిజోన్ కి పైకి దర్శనమిచ్చే సమయాన్ని సూర్యోదయం అని అంటారు.[1]

సూర్యోదయం దృశ్యచిత్రం

సూర్యాస్తమయం: సూర్యుని ఎగువనున్న భాగము హోరిజోన్ కి దిగువునకు మాయమయ్యే సమయాన్ని సూర్యాస్తమయం అని అంటారు.[2]

వ్యత్యాసాలు:

సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య వ్యత్యాసం ఏమియును లేదు. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు, పడమర వైపు అస్తమిస్తాడు. ఇదే ముఖ్యమైన వ్యత్యాసం. సూర్యోదయ సమయం లో సూర్యుడికి దగ్గరగా ఉన్న ఆకాశం నీలం రంగు లో ఉంటుంది. సూర్యాస్తమయ సమయం లో సూర్యుడికి దగ్గరగా ఉన్న ఆకాశం ఎరుపురంగు లో ఉంటుంది.

కారణం:

సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడానికి పడమర దిక్కున అస్తమించడానికి గల కారణం గ్రహాల భ్రమణం.[3]

ఉపయోగాలు:

శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజూ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని వీక్షించడం అద్భుతమైన మార్గము.

రోజూ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయణాన్ని వీక్షించడం వలన రోజు అంతా మంచి మానసిక స్ధితి కలిగి ఉంటారు. ఒత్తిడి నుండి విముక్తి కూడా లభిస్తుంది.[4]

రంగులు:

వాతావరణం లోకి వెలుతురు ఏవిధంగా వచ్చి, ప్రయాణిస్తుందో దాని బట్టి సూర్యోదయ, సూర్యమస్తమయం లో రంగులు ఆధారపడి ఉంటాయి.

గాలిలో వుండే దుమ్ము, కాలుష్యం వలన సూర్యుడి నుండి భూమి మీద పడే వెలుతురి తీవ్రత తగ్గుతుంది. దీనివలన సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో వచ్చే రంగుల తీవ్రతను కూడా తగ్గింస్తుంది.[5]

వాతావరణంలో మబ్బులు ఉంటే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో రంగులలో తీవ్రత తక్కువ ఉంటుంది.

గాలి లో ఏ దుమ్ము ధూళి లేకుండా స్వచ్చముగా ఉంటే రంగులు కూడా స్పష్టంగా ఉండి మానవులను ఉత్సాహపరుస్తాయి.

వివిధ దేశాలు:

ప్రపంచంలో న్యూజిలాండ్ దేశం లో మొట్టమొదట సూర్యోదయం అవుతుంది. అమెరికన్ సమోవా అనే దేశములో అందరికన్నా చివరిగా సూర్యోదయం అవుతుంది.

యూరప్ దేశంలో నార్వే అనే ప్రాంతంలో 76 రోజులు సూర్యాస్తమయం అవ్వదు. నార్వే ని “ల్యాండ్ ఆఫ్ ధి మిడ్ నైట్ సన్” అని అంటారు.

భారతదేశంలో  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొదట సూర్యోదయం అవుతుంది. గుజరాత్ లో చివరగా అవుతుంది.[6][7]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-24. Retrieved 2020-02-21.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-24. Retrieved 2020-02-21.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-21. Retrieved 2020-02-21.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-16. Retrieved 2020-03-07.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-04-21. Retrieved 2020-03-07.
  6. https://www.quora.com/Where-does-the-sun-rise-first-and-set-last-in-the-world
  7. https://www.quora.com/Where-did-the-Sun-rise-first-in-India

వెలుపలి లంకెలు మార్చు