సూర్య సేన్

స్వాతంత్ర సమరయోధుడు

సూర్య సేన్ ( 1894 మార్చి 22 - 1934 జనవరి 12) - ఇతని పూర్తి పేరు సూర్య కుమార్ సేన్, బెంగాల్ విప్లవకారుడు. అతను బెంగాల్ లోనే కాక భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావంతమైన వ్యక్తి. 1930లో చిట్టగాంగ్ ఆయుధశాల దాడికి నాయకత్వం వహించాడు.

మాస్టర్ డా

సూర్య సేన్
బెంగాలీ: সূর্য সেন
1924లో సూర్య కుమార్ సేన్
జననం
సూర్య సేన్

(1894-03-22)1894 మార్చి 22
మరణం1934 జనవరి 12(1934-01-12) (వయసు 39)
చిట్టగాంగ్, బెంగాల్ ప్రెసిడెన్సీ
మరణ కారణంఉరి శిక్ష
జాతీయతబ్రిటిష్ ఇండియన్
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అనుశీలన్ సమితి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చిట్టగాంగ్ ఆయుధశాల దాడి
ఉద్యమంస్వాతంత్ర్య ఉద్యమం

సూర్య సేన్ వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయుడు. మాస్టర్‌ దా గా ప్రసిద్ధి చెందాడు ("దా" అనేది బెంగాలీ భాషలో గౌరవ ప్రత్యయం).[1] అతను బెర్హంపూర్ కళాశాలలో 1916 లో బి.ఎ విద్యార్థిగా ఉన్న కాలంలోనే జాతీయవాద ఆదర్శాలచే ప్రభావితమయ్యాడు. 1918లో అతను భారత జాతీయ కాంగ్రెస్ చిట్టగాంగ్ శాఖకు అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.[2][3]

చిట్టగాంగ్‌లో ఉన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అనంత సింగ్, గణేష్ ఘోష్, లోకేనాథ్ బాల్‌లతో సహా చిట్టగాంగ్ గ్రూప్ అని పిలవబడే ఉద్వేగభరితమైన విప్లవకారుల బృందాన్ని నియమించడంలో సూర్య సేన్ పేరు పొందాడు.[4] చిట్టగాంగ్ పరిసర వన ప్రదేశాల్లో ఉన్న యువకులను ప్రొత్సాహిస్తూ ఇండియన్ రెపుబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించాడు. చుట్టప్రక్కల గ్రామాలు ప్రతీరోజు తిరుగుతూ స్వాతంత్ర్య లక్ష్యం కోసం వారిని ఉత్తెజ పరుస్తూ ఉండేవాడు. తన సైనికులకు తానే శాస్త్ర శిక్షణ అందేంచేవాడు. ఈవిధంగా తిరుగుతూ శిక్షణ ఇస్తూ చిట్టగాంగ్ పై పరిపూర్ణ అవగాహన ఏర్పరచుకున్నాడు.

సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొని, విప్లవ కార్యకలాపాల కారణంగా 1926 నుండి 1928 వరకు రెండు సంవత్సరాల పాటు అరెస్టయ్యాడు. ఒక స్ఫూర్తిదాయకమైన ఆర్గనైజర్ మాత్రమే కాకుండా సూర్య సేన్ "మానవతావాదం విప్లవకారుల ప్రత్యేక ధర్మం" అని చాటి చెప్పాడు.[4]

1930లో చిట్టగాంగ్ దాడిలో 80 మంది బ్రిటిష్ సైనికులు, 12 మంది విప్లవకారులు మరణించిన భీకర యుద్ధం తర్వాత.. సూర్య సేన్, మిగిలిన విప్లవకారులు చిన్న సమూహాలుగా విడిపోయి పొరుగు గ్రామాలలో దాక్కున్నారు. ప్రభుత్వ సిబ్బంది, ఆస్తులపై దాడులు ప్రారంభించారు. సూర్య సేన్ 1933 ఫిబ్రవరి 16న తరిగి అరెస్టయ్యాడు, 1934 జనవరి 12న కోర్టు విచారణకు హాజరయ్యాడు. అతనికి ఉరిశిక్ష విధించారు. అతని తోటి విప్లవకారులలో చాలామంది కూడా పట్టుబడ్డారు. వారంతా సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారు.[4]

ఉరిశిక్ష అమలు చేసే ముందు పోలీసులు అతడిని విపరీతంగా హింసించారు. చివరకు 'వందేమాతరం' అని పలకలేని విధంగా అతని దంతాలు విరగకొట్టారు. అతని గోళ్ళను సైతం జైలర్ పీకేసి చిత్రహింసలకు గురిచేసారు.

1932లో సూర్య సేన్ ని పట్టించిన వారికి పది వేల రూపాయల నజరాన అని చిట్టగాంగ్ పోలీస్ డివిజన్ ఇన్‌స్పెక్టర్-జనరల్ ప్రకటన

విద్య, ఉద్యోగం, ఉద్యమం మార్చు

సూర్య సేన్ 1894 మార్చి 22న[5] చిట్టగాంగ్‌లోని రౌజన్ ఉపజిల్లాలో నోపరాలో బైద్య కుటుంబంలో[6] జన్మించాడు. అతని తండ్రి రామనిరంజన్ సేన్ ఉపాధ్యాయుడు. 1916లో బి.ఎ. ముర్షిదాబాద్‌లోని బెర్హంపూర్ కళాశాలలో (ప్రస్తుతం కృష్ణాత్ కళాశాల) విద్యార్థి దశలోనే సూర్య సేన్ తన ఉపాధ్యాయుల నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకున్నాడు. అతను విప్లవాత్మక ఆదర్శాల వైపు ఆకర్షితుడయ్యాడు. విప్లవ సంస్థ అనుశీలన్ సమితిలో చేరాడు. తన చదువు పూర్తయిన తర్వాత 1918లో చిట్టగాంగ్‌కు తిరిగి వచ్చి నందన్‌కనన్‌లోని నేషనల్ స్కూల్‌లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ సమయంలో, భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ అత్యంత ప్రముఖ రాజకీయ పార్టీ. అందులో అక్కడి శాఖకు అధ్యక్షుడిగా చేసాడు.

మూలాలు మార్చు

  1. "Indian Independence చుక్కలు చూపిన లెక్కల మాస్టారు". EENADU. Retrieved 2022-01-13.
  2. Islam, Asiatic Society of Bangladesh. Chief ed. Sirajul (2003). "Mastarda" Surya Sen (1. publ. ed.). Dhaka: Asiatic Society of Bangladesh. ISBN 9843205766. Retrieved 28 June 2015.[permanent dead link]
  3. Chakrabarti, Bidyut (1990). Subhas Chandra Bose and Middle Class Radicalism: A Study in Indian Nationalism, 1928-1940. I. B. Tauris & Co. Ltd. p. 108. ISBN 1850431493.
  4. 4.0 4.1 4.2 Chandra, Bipan (1988). India's struggle for independence 1857-1947. Penguin. ISBN 9788184751833. OCLC 983835276.
  5. Kumar, Vijay (2008). हर दिन पावन. लोकहित प्रकाशन. ISBN 9788189606350.
  6. "Surya Sen". abhipedia.com. Retrieved 16 June 2021.