సూళ్లూరుపేట పురపాలక సంఘం
సూళ్లూరుపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం లోని, సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం సూళ్లూరుపేట పట్టణంలో ఉంది.[1]
సూళ్లూరుపేట | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
Professional title | పురపాలక సంఘం |
ప్రధాన కార్యాలయాలు | సూళ్లూరుపేట |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
చరిత్ర
మార్చుఈ పురపాలక సంఘం 2012 లో గ్రేడ్-III గా ఏర్పాటు చేశారు.25 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[2]
భౌగోళికం
మార్చుసూళ్లూరుపేట పురపాలక సంఘం 13°42′00″N 80°01′05″E / 13.700°N 80.018°E అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి 374 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది సమీప పట్టణమైన నెల్లూరు నుండి 100 కి.మీ దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం సూళ్లూరుపేట జనాభా 27,504, అందులో పురుషులు 12,955 మందికాగా, స్త్రీలు 14,549 మంది ఉన్నారు.సూళ్లూరుపేట పట్టణం పరిధిలో మొత్తం 6,870 కుటుంబాలు నివసిస్తున్నాయి.[3]
పౌర పరిపాలన
మార్చుఈ పురపాలక సంఘంలో కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Sulluru (Sullurpeta) Population, Caste Data Sri Potti Sriramulu Nellore Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-11-27. Retrieved 2022-11-27.
- ↑ "Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.