సెరైకెల ఖెర్సవన్ జిల్లా

ఝార్ఖండ్ లోని జిల్లా

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో సెరైకెల ఖెర్సవన్ జిల్లా ( హిందీ: सराइकेला खरसावाँ जिला) (ఒడిషా: ଷଢେଇଖଳା ଖରସୁଆଁ ଜିଲ୍ଲା) ఒకటి. ఇది ఒకప్పుడు సెరైకెల రాజాస్థానంగా ఉండేది. జిల్లా కేంద్రంగా సెరైకెలా పట్టణం ఉంది. జిల్లా సెరైకెలా చౌ ( 3 చౌ నృత్యాలలో ఇది ఒకటి) నృత్యానికి ప్రసిద్ధి చెందింది.

Seraikela-Kharsawan జిల్లా

सराइकेला खरसावाँ जिला
Jharkhand లో Seraikela-Kharsawan జిల్లా స్థానము
Jharkhand లో Seraikela-Kharsawan జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంJharkhand
పరిపాలన విభాగముKolhan division
ముఖ్య పట్టణంSeraikela
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలు1. Ranchi (shared with Ranchi district, 2. Singhbhum (shared with West Singhbhum district and 3. Khunti (shared with Khunti district)
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం2,724.55 కి.మీ2 (1,051.95 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం10,63,458
 • సాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
 • పట్టణ
16.30
జనగణాంకాలు
 • అక్షరాస్యత68.85 per cent
 • లింగ నిష్పత్తి958
సగటు వార్షిక వర్షపాతం1350 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

రాజరికంసవరించు

సెరైకెల మునుపటి రాజకుటుంబానికి చెందిన సింగ్ డియో కుటుంబం (చౌనృత్య సృష్టికర్తలు) వారి కాలంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉన్న సెరైకెల రాజభవనం వదిలి ఒడిషా, పశ్చిమ బెంగాల్, విదేశాలకు వెళ్ళారు. సెరైకెలా రాజాస్థానం చివరి రాజు హెచ్.హెచ్ ఆదిత్య ప్రతాప్ సింగ్ డియో (హెచ్ హెచ్ మహారాజా ఉదిత్ నారాయణన్ సింగ్ డియో కుమారుడు) కుమారులు ఈ ప్రాంతంలో ఖ్యాతిగడించారు. మహారాజా కుమారులు తికియత్ సాహెబ్ నృపేంద్ర నారాయణ సింగ్ దేవ్, హెచె హెచ్ మహారాజ సర్ రాజేంద్ర నారాయణ్ సిన్ దేవ్ పట్నా - బొలింగర్‌కు దత్తు (గత ఒడిషా ముఖ్య మంత్రులలో ఒకరు ) ఇచ్చారు. పతయెత్ సాహెబ్ మహారాజ కుమార్ భూపేంద్ర నారాయణ సింగ్ దేవ్ ( " ట్రైబల్ యాంటీ - మెర్జర్ మూవ్మెంట్ విత్ బీహార్" మద్దతుదారుడు ప్రముఖ రాజకీయ వేత్త ), రాజకుమార్ సురేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ (పరమ గురు ఆఫ్ చౌ) ఒక పద్మశ్రీ బహుమతి గహీత.

సింగ్ దేవ్ రాజకుటుంబం సంఘంలో (రాజకీయ, సాంస్కృతిక, మతపరంగా ) ప్రముఖులుగా ఉన్నారు. రాజభవనంలో ఉన్న " మా పౌడి ఆలయం " రాజకుటుంబ వారసులు ధర్మకర్తలుగా ఉన్నారు. రాజకుటుంబ సభ్యులు వార్షిక చౌ ఉత్సవాలకు నిర్వాహకులుగా ఉన్నారు. అలాగే వారు ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారు పూర్వపు రాజవైభవాన్ని కోల్పోయినా ఈ ప్రాంతపు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. రాజకుటుంబంలో ప్రముఖులలో రాజకుమార్ ప్రతాప్ ఆదిత్య సింగ్ డియో, రాజకుమార్ జుగ భాను సింగ్ డియో, దేవ్ సింగ్ మహారాజకుమార్ జైరాజ్ సింగ్ డియో, రాజకుమార్ రాజ్‌విక్రం ముఖులు.

సమీపకాల సంఘటనలుసవరించు

ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగంగా ఉంది.[1]

భౌగోళికంసవరించు

జిల్లా 22°29'26", 23°09'34" డిగ్రీలు ఉత్తర అక్షాంశం, 85°30'14", 86°15'24" తూర్పు రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సెరైకెల ఖెర్సవన్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలుసవరించు

జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి: సెరైకెల, ఖర్స్వాన్, గంహరియా, కుచై, ఇచ్గర్హ్, నిందిత్, చందిల్, రాజ్నగర్, కురు.

  • జిల్లాలో మూడు విధానసభ జినోజకవర్గాలు ఉన్నాయి : ఇచగర్, నిందిహ్, ఖరస్వాన్. ఇవన్నీ రాంచి, సింగ్‌భుం, కుంతీ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,063,458,[3]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోహడ్ ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 428వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 390 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.28%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 958:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.85%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలుసవరించు

  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులుసవరించు