సెర్ఛిప్
సెర్ఛిప్, మిజోరాం రాష్ట్రంలోని సెర్ఛిప్ జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. మిజోరాం మధ్యభాగంలో ఉన్న ఈ పట్టణం రాష్ట్ర రాజధాని ఐజాల్ నగరానికి 112 కి.మీ.ల దూరంలో ఉంది. దేశం మొత్తంమీద ఈ జిల్లాలో అత్యధిక అక్షరాస్యత ఉంది. సెర్ఛిప్ గ్రామంలోని మొదటి కొండపైన కనిపించే సిట్రస్ చెట్ల నుండి సెర్ఛిప్ అనే పేరు వచ్చింది.
సెర్ఛిప్ | |
---|---|
పట్టణం | |
దస్త్రం:Serchhip.jpg | |
ముద్దుపేరు(ర్లు): సెర్కావ్‌పుయి | |
నిర్దేశాంకాలు: 23°18′32″N 92°51′24″E / 23.308996°N 92.856701°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | సెర్ఛిప్ |
సముద్రమట్టం నుండి ఎత్తు | 888 మీ (2,913 అ.) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 64,875 |
• సాంద్రత | 46/km2 (120/sq mi) |
భాషలు | |
• అధికారిక | మిజో |
కాలమానం | UTC+౦5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 796181 |
టెలిఫోన్ కోడ్ | +913838 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | ఎంజెడ్-06 |
సమీప పట్టణం | ఐజాల్ |
స్త్రీ పురుష నిష్పత్తి | 976 ♂/♀ |
అక్షరాస్యత | 98.76% |
లోకసభ నియోజకవర్గం | మిజోరాం లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సెర్ఛిప్ |
సివిక్ ఏజెన్సీ | గ్రామ కౌన్సిల్ |
భౌగోళికం సవరించు
సెర్ఛిప్ పట్టణం 23°18′N 92°50′E / 23.3°N 92.83°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 888 మీటర్లు (2,913 అడుగులు) ఎత్తులో ఉంది. మాట్ నది, టుయికుమ్ నదుల మధ్య ఉన్న సెర్ఛిప్ పట్టణానికి టుయికుమ్ నది నుండి త్రాగునీరు, మాట్ నది నుండి సాగునీరు అందుతోంది. పట్టణ వార్షిక ఉష్ణోగ్రతలు 34-10 డిగ్రీల వరకు ఉంటుంది
జనాభా సవరించు
2011 భాతర జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 64,875 మంది జనాభా ఉన్నారు. ఇందులో 32,824 మంది పురుషులు, 32,051 మంది స్త్రీలు ఉన్నారు. 2001నాటి జనాభాతో పోలిస్తే జనాభా పెరుగుదలలో 20.45 శాతం మార్పు ఉంది.
ఆర్థిక వ్యవస్థ సవరించు
ఈ పట్టణంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఈ పట్టణానికి సమీపంలో మాట్ నది లోయ ఉన్నందువల్ల క్యాబేజీ, ఆవపిండిలకు పంటలకు పేరొందింది.
రవాణా సవరించు
ఇక్కడ పవన్ హన్స్ (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[2] ఈ పట్టణం 54వ జాతీయ రహదారి ద్వారా సిల్చార్ కు, 40వ జాతీయ రహదారి ద్వారా అగర్తలాకు, 150వ జాతీయ రహదారి ద్వారా ఇంఫాల్ కు కలుపబడుతోంది. ఇక్కడ బస్సు, టాక్సీ, ఆటోరిక్షాలతో రవాణా సౌకర్యం ఉంది.
ప్రజారోగ్యం సవరించు
ఇక్కడ మలేరియా, కాన్సర్ వంటి ప్రజారోగ్య సమస్యలు ఉన్నాయి. అంగన్వాడి కేంద్రాల నుండి శిశువులు, పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య, పోషక పదార్ధాలను అందిస్తున్నారు.
పారాగ్లైడింగ్ సవరించు
ఇది ఇక్కడి ప్రజలకు కొత్త ఆట. 2020లో ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సెర్ఛిప్ పట్టణంలో ఇంటర్నేషనల్ పారాగ్లైడింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది.
మూలాలు సవరించు
- ↑ Falling Rain Genomics, Inc - Serchhip
- ↑ "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 28 December 2020.
ఇతర లంకెలు సవరించు
- సెర్ఛిప్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ Archived 2018-11-26 at the Wayback Machine
- ప్రభుత్వం సెర్ఛిప్ కళాశాల
- తాజా సెర్ఛిప్ వార్తలు Archived 2016-03-08 at the Wayback Machine
- జోత్లిఫిమ్ డైలీ వార్తాపత్రిక సెర్షిప్