సొర చేప
సొర చేప (ఆంగ్లం: Shark) ప్రమాదకరమైన చేప జాతికి చెందిన జంతువు. ఇవి సెలకీమార్ఫా (Selachimorpha) సూపర్ క్రమానికి చెందిన పూర్తిగా మృదులాస్థి చేపలు. ఇవి ఐదు నుండి ఏడు మొప్ప రంధ్రాలతో శ్వాసిస్తాయి. సొర చేపలకు రక్షణ కోసం చర్మం మీద డెంటికల్స్ ఉంటాయి. వీటి దవడలకు చాలా వరుసలలో పదునైన దంతాలుంటాయి.[1] సొర చేపలు వివిధ పరిమాణాలలో ఉంటాయి. మరుగుజ్జు సొర (Dwarf lanternshark : Etmopterus perryi) లోతైన సముద్రాలలో నివసించే సొర జాతి చేపలు సుమారు 17 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటే; తిమింగళపు సొర (Whale shark) చేపలు 12 మీటర్లు పొడవుంటాయి.
సొర చేప Temporal range: Late డెవోనియన్ - Recent
| |
---|---|
![]() | |
Bull shark (Carcharhinus leucas) | |
Scientific classification | |
Kingdom
|
|
Phylum
|
|
Subphylum
|
|
Class
|
|
Subclass
|
|
Superorder
|
సెలకీమార్ఫా
|
Orders | |
Carcharhiniformes |
అందరికీ తెలిసిన బుల్ సొర (Carcharhinus leucas) చేపలలో చాలా జాతులుంటాయి. ఇవి సముద్రాలలోను, మంచి నీటిలోను, నదీ డెల్టా ప్రాంతాలలోను నివసిస్తాయి.[2]
ఉపయోగాలుసవరించు
- సొర చేప మాంసం గా మంచి బలమైన ఆహారం. అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదని ఆంక్షలు విధిస్తారు.
- సొర చేప చర్మాన్ని దానికున్న డెంటికల్స్ మూలంగా సాండ్ పేపర్ వలె ఉపయోగిస్తారు.