సేమియా అనగానే అందరికి గుర్తుకు వచ్చెది నోరూరించే పాయసము. పండుగలకు, పబ్బలకు, శుభకార్యములకు తప్పనిసరిగా వెయ్యు వంటకం "సేమియా పాయసము". సేమియా పాయసమును కొన్ని ప్రాంతాలవారు "ఖీర్‌' అని కూడా అంటారు. సేమియాతో కేవలము పాయసము మాత్రమే కాకుండగా సేమియా ఉప్మా, సేమియా ఇడ్లీ, సెమియా రవ్వదోశ వంటివి కూడా తయారు చెయ్యుదురు.

సేమియా

వినియోగం

మార్చు

14వ శతాబ్బినాటికే సేమియా ఇటలీ దేశములో వాడుకలో వున్నట్లుగా అప్పటి పాకశాస్త్ర పుస్తకాల వలన తెలుస్తున్నది. ఇటలి తదితర దేశాలలో సేమియాని వెర్మిచెల్లి అని అంటారు. వెర్మిచెల్లి అనగా సన్నని పొడవైన పురుగు అని అర్ధము. సంప్రదాయ సేమియ తయారి ఇరాన్‌లోని సీరజ్‌లో మొదలైనట్లు తెలుస్తున్నది. దక్షిణ ఆసియా దేశాలలో సేమియాను పలు రకాలైన వంటకాలు చెయ్యుటకు వాడ్వ్దరు. ఇటలిలో సేమియాను 'సెమొలిన అనే పిండి పదార్థము నుండి చెయ్యగా, దక్షిణ ఆసియా దేశాలలో దురుం రకమునకు చెందిన గోధుమ పిండితో తయారు చెయ్యుదురు. సెమొలిన అనగా లాటిన్‌లో పిండి (ఫ్లోర్) అని అర్ధము. ఇటలి .ఐరోపా‌ తదితర దేశాలలో సేమియాను సెమొలిన అని కూడా అంటారు. చిన్న, చిన్న ముక్కలుగా కాకుండ పొడవుగా వుండే సేమియాను నూడిల్స్‌ అని అంటారు. గోధుమ పిండితో బియ్యపు పిండిని కలిపి నూడుల్స్‌ తయారు చెయ్యుదురు. ఛైనాలో కేవలం బియ్యపు పిండితో 'రైస్‌ నూడిల్స్‌ చెయ్యుదురు. డురుము గోధుమపిండితో చేసిన సేమియా కొంచెము బ్రౌన్‌రంగులో వుండును. కొందరు గోధుమపిండి, బియ్యపుపిండి, సెమొలిన పిండిని కలిపి తయారు చెయ్యుదురు. సేమియాను కేవలము ఇటలీ, ఆసియా లలోనే కాకుండగా ఐరోపా‌, అమెరికా దేశాలలో వాడకంలో ఉంది.

పోషక విలువలు

మార్చు

సేమియా పోషక విలువ ఎక్కువయే.

100 g సేమియ పోషక విలువ = 1500 kJ

పిండి పదార్థములు = 72–83 g

ఫ్యాట్స్ = 1.05 g

ప్రోటీన్స్ = 12.68 g

ఫైబరు = 3–9 g

వాటరు = 12–17 g ఇవియే కాకుండగా కాల్సియము, మెగ్నిసియము, పొటాసియం వంటి ఖనిజాలు విటమినులు కూడా సేమియా కలిగి ఉంది.

సేమియాను తయారు చెయ్యడం

మార్చు

సంప్రదాయ పద్దతిలో ఇంటిలో సెమియాను తయారు చెయ్యు పద్దతి

మార్చు

మంచి నాణ్యమైన గోధుమలను తీసుకుని దంచి పైపొట్టును తొలగించెదరు. పొట్టు తొలగించిన గోధుమలను పిండిమరలో అడించి మెత్తటి పిండిగా చెయ్యుదురు. తరువాత సమపాళ్లలో (1:1) నీటిని కలిపిముద్దగా సాగేగుణం వచ్చెవరకు బాగా కలియ బెట్టెదరు. దీర్ఘచతురస్రాకారముగా వుండి అడ్డుగా సన్నని గాడులు (గ్రూవ్స్) వున్న చెక్కపలకని తీసుకుని, దానిని కొంచెము ఏటవాలుగా వుంచి, ముద్దగా కలిపిన గోధుమ పిండి నుండి చిన్న ముద్దలు తీసుకుని, చెక్కపలకమీద గాడులపై బలముగా చేతులతో పైకి, క్రిందికి రుద్దినప్పుడు, గాడులనుండి గోధుమపిండి సన్నని దారపు పోగులవలె ఏర్పడును. యిలా వచ్చిన సేమియాలను నీడలో ఎండ పెట్టెదరు.

వ్యాపరరీత్యా సేమియాను చెయ్యడం

మార్చు

మంచినాణ్యమైన గోధుమలను తీసుకుని, మొదట జల్లెడలో (స్క్రీనర్) జల్లించి మట్టిపెడ్దలు, చిన్నరాళ్ళు, పుల్లల వంటి వాటిని వేరుచెయ్యుదురు.యిలా శుభ్రము చేసిన గోధుమలను రోలరుమిల్‌లో ఆడించెదరు.రోలరుమిల్‌లో సన్నని గాడులున్నరెండురోలరులు వుండును.రెండురోలరుల మధ్యఖాళిని, గోధుమల సైజుకన్న తక్కువ వుండేలా బిగించెదరు.రోలరుమిల్ లోగోధుమలు మూడురకములుగా విడగొట్తబడును.పైపొట్టు ఒకభాగంగా, బీజాంకురమ్రెండోభాగంగా, పిండి పదార్థము మూడోభాగంగా విడగొట్టబడును. రోలరు మిల్‌నుండి వచ్చిన ముతక గోధుమ పిండిని వైబ్రెటింగ్ ‌స్క్రీనరులోజల్లించి, మూడు భాగాలను వేరు చేస్తారు. పిండిపదార్ధాలను పల్వరైజరులో ఆడించి మెత్తటి పదార్ధముగా చెయ్యుదురు. మెత్తటి పిండి భాగానికి సమపాళ్ళలో నీటిని చేర్చి, నీడింగ్‌ మెషిన్‌లో ముద్దగా అయ్యేంతవరకు కలియ తిప్పుతారు. మెత్తటి ముద్దగా తయారైన పిండిని సేమియా మెషిన్ కు పంపెదరు. సేమియా మెషిన్‌ పొడవుగా వుండి, లోపలిభాగములో ఒక స్క్రూకన్వేయరు అమర్చబడివుండును. మెషిన్‌ ఒకచివర సన్నని రంధ్రములున్న డై బిగించబడివుండును. స్క్రూకన్వేయరు గోధుమ పిండిని డై వైపునకు నెట్టును. డై నుండి సేమియాలు బయటకు వచ్చును. యిలా వచ్చిన సేమియాలను డ్రైయరులో డ్రై చేసి అధికముగా వున్న నీటిని తొగించి సేమియను గట్టి పరచును. యిప్పుడు సేమియాను కావలసిన సైజును కత్తరించి, ప్యాకెట్‌లలో ప్యాక్ ‌చెయ్యుదురు.

"https://te.wikipedia.org/w/index.php?title=సేమియా&oldid=4194596" నుండి వెలికితీశారు