షైతాన్

(సైతాను నుండి దారిమార్పు చెందింది)

సైతాను (ఆంగ్లం :Satan), (అరబ్బీ భాష, ఉర్దూ భాష : "షైతాన్") అనే పదం వివిధ అబ్రహాం మతాలలో (Abrahamic faiths) వివిధ భావాలలోవాడుతారు. ఆయా మతాలలో భగవంతుని వ్యతిరేకించే శక్తి, పెడమార్గం పట్టిన ఒక దైవదూత అన్న అర్థాలలో అధికంగా ప్రస్తావిస్తారు. సైతాను, ప్రపంచములో చెడుకు ప్రతీకగా భావిస్తారు. అరబ్బీ భాషలో షైతాన్ అనే పదానికి అర్థం "చెడు".

గుస్టావ్ డీరె ఈ చిత్రంలో జాన్ మిల్టన్ పారడైజ్ లాస్ట్ కావ్యంలో సైతానును చిత్రీకరించాడు.

క్రైస్తవం దృష్తిలో సైతాను

మార్చు

ఇతన్నే "లూసీఫర్" అని క్రైస్తవులు అంటారు. క్రైస్తవ గ్రంథాలలో సైతాను, దేవునిచే స్వర్గమునుండి బహిష్కరించబడిన దైవదూత అని ఇవ్వబడింది. సైతాను దేవునికి శత్రువు, వ్యతిరేకి. దేవుని నమ్ముకున్న వారిని దేవునికి విరోధముగా మార్చుటకు ఎంతగానో ప్రయత్నిస్తాడని బైబిల్ ద్వారా మనకు తెలుస్తుంది.

బైబిలు కథనం

మార్చు

సైతానే అపవాది. దేవదూతలు (దైవకుమారులు) యెహోవా సన్నిధిని నిలిచేరోజున "అపవాది" (అపవాదం మోపబడినవాడు) కూడా వచ్చాడు. ఎక్కడనుంది వచ్చావు అని యెహోవా అడిగితే భూమి మీద అటూఇటూ తిరుగులాడుచూ అందులో సంచరిస్తూ వచ్చాను అంటాడు. (యోబు 1:6)

ఇస్లామీయ దృష్టిలో షైతాన్

మార్చు

'షైతాన్', 'ఇబ్లీస్' ఒక్కరే. వీడినే "అజాజీల్" అని కూడా అంటారు. ఇతడు ఒక జిన్. జిన్‌లను అల్లాహ్ అగ్నినుండి సృష్టించాడు. ప్రారంభ దశలో ఇతడు అల్లాహ్ ను కొలవడంలో అందరికంటే ముందు వుండేవాడు. ఈ విషయం నచ్చిన అల్లాహ్, ఇతడిని మలాయిక (దైవదూతలు) లతో వుండేందుకు అనుమతినిచ్చాడు. కానీ ఆదమ్ ను సృష్టించిన తరువాత దైవతిరస్కారుడై శపించబడుతాడు. దైవ (అల్లాహ్) ధిక్కారం కారణంగా స్వర్గం (జన్నత్) నుండి తొలగింపబడిన దైవదోషి. జన్నత్ లో ఆదమ్, హవ్వా లు, అల్లాహ్ ధిక్కారానికి (తినవద్దన్న ఫలాన్ని తిని) ప్రేరేపించి, వారు స్వర్గం (జన్నత్) నుండి గెంటబడేలా చేసిన వాడు. ఇతనిని "ఇబ్లీస్ అలైహిల్ లాన(త్)" (ఇబ్లీస్, అల్లాహ్ చే శపించబడిన వాడు) అనీ అంటారు. మనిషిని మంచి నుండి దూరం చేసేవాడు. సత్యదూరం చేసేవాడు, సత్యద్వేషి, తాను ఎలాగూ దుర్మార్గం పొందాడు, ఆదమ్ సంతతి (మానవ సంతతి) ని దుర్మార్గం పాలుజేసేవాడు. మానవులను ఎల్లవేళలా 'చెడు' వైపున ఆకర్షింపజేసేవాడు.

జిన్ ఒక సృష్టి. అల్లాహ్ సృష్టించిన సృష్టిలో అగ్ని చే సృష్టింప బడ్డ సృష్టి. అరబ్బీ భాషలో 'జిన్' అనగా 'కానరాని'. ఈ పద మూలంగానే స్వర్గానికి జన్నహ్ (జన్నత్) అని, నరకానికి జహన్నమ్ (దోజఖ్) అని పేర్లు. జిన్ లు మనకంటికి కానరాని జీవులు (సూక్ష్మజీవులని అర్థం కాదు).

ఖురాన్ కథనం

మార్చు

అల్లాహ్ మొట్టమొదటి మనిషి (ఆదమ్) ను తన ప్రతిరూపములో సృష్టించి, సకల మలాయిక (దైవదూత) లను పిలిచి, ఆదమ్కు అందరూ మొక్కవలెనని ఆజ్ఞాపిస్తాడు. అందరు దూతలూ ఆజ్ఞను శిరసావహించి ఆదమ్ కు మొక్కుతారు, కానీ షైతాన్ మాత్రం మట్టినుండి పుట్టిన మానవునికి అగ్నినుండి పుట్టిన దేవదూతనైన నేను మ్రొక్కడమేమిటని దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తాడు. దీంతో అల్లాహ్ ఆగ్రహించి "అజాజీల్" (ఇబ్లీస్ లేదా షైతాన్) ను జన్నత్ నుండి గెంటివేస్తాడు. ఐతే మృతుల్ని తిరిగిలేపేరోజు వరకు ఇబ్లీస్ గడువు కోరితే అల్లాహ్ అనుమతిస్తాడు. మానవుల్ని అన్నివైపులా మోసంచేసి దైవధిక్కారుల్ని చేస్తానని షైతాన్ ప్రతిజ్ఞ చేస్తాడు. (ఖురాన్ 7:11-17)

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=షైతాన్&oldid=3919051" నుండి వెలికితీశారు