సైరస్ ది గ్రేట్
సైరస్ ది గ్రేట్ (ఆంగ్లం : Cyrus the Great) (ప్రాచీన పర్షియన్: 𐎤𐎢𐎽𐎢𐏁,[1] (ఉచ్ఛారణ : kʰuːrʰuʃ : ఖురుస్ )[2] పర్షియన్: کوروش بزرگ (ఖురోష్ బుజర్గ్) Kūrošé Bozorg), (క్రీ.పూ. 600 లేదా 576 - ఆగస్టు 530 లేదా 529 ), ఇంకనూ "సైరస్ II ఆఫ్ పర్షియా, సైరస్ ది ఎల్డర్ అని ప్రసిద్ధి.[3]
సైరస్ II ద గ్రేట్ | |
---|---|
పర్షియా, అన్‌షాన్, మిడియా, బాబిలోన్ రాజ్యాలకు రాజు. | |
పరిపాలన | క్రీ.పూ. 559 - 529 |
పట్టాభిషేకము | అన్‌షాన్, పెర్సిస్ |
జననం | క్రీ.పూ. 600 లేదా 576 |
జన్మస్థలం | అన్‌షాన్, పెర్సిస్ |
మరణం | క్రీ.పూ. ఆగస్టు ?, 530 లేదా 529 |
మరణస్థలం | సిర్ దర్యా |
సమాధి | పసర్‌గడే |
ఇంతకు ముందున్నవారు | కేంబెసెస్ I |
తరువాతి వారు | కేంబిసెస్ II |
Consort | కస్సడానె of పర్షియా |
సంతానము | కేంబిసెస్ II స్మెర్డిస్ ఆర్టిస్టోన్ అటోస్సా తెలియదు |
రాజకుటుంబము | అకేమినిడ్ |
తండ్రి | కేంబిసెస్ I (పర్షియా) |
తల్లి | మండానే (మిడియా)? |
Religious beliefs | జొరాస్ట్రియన్ మతము? |
ఇతను ఒక పర్షియన్ షాహన్‌షాహ్ (షాహ్=రాజు, షాహన్‌షాహ్=రాజులకు రాజు, "చక్రవర్తి"), అకేమెనిడ్ వంశపు పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు.
ఇతని పరిపాలనా కాలంలో ఇతని సామ్రాజ్య విస్తరణ దాదాపు నౌఋతి ఆసియా, మిక్కిలి మధ్య ఆసియా భాగాలు, ఈజిప్టు నుండి పశ్చిమాన హెల్లెన్స్‌పాంట్ వరకూ, తూర్పున సింధు నది వరకు, విశాలంగా వ్యాపించియుండేది. ప్రపంచంలో ఇంత పెద్ద విస్తీర్ణం గల రాజ్యము చరిత్రలో గాని నేటికినీ లేదు.[4]
ఇతని 29-30 సంవత్సరాల రాజ్యకాలంలో, ఎన్నో యుద్ధాలు చేసి సమకాలీన రాజ్యాలను జయించాడు, అలాంటి వాటిలో మిడియన్ సామ్రాజ్యం, లిడియన్ సామ్రాజ్యం, నియో బాబిలోనియన్ సామ్రాజ్యం మొదలైనవి. ఇవే కాకుండా మధ్యాసియా లోని అనేక దేశాలు ఇతని ఆధీనంలోకొచ్చాయి.[5] సైరస్ ప్రాచీన ఈజిప్టు వైపు వెళ్ళలేదు, ఇతడు సిథియన్లతో సిర్ దర్యా వెంట పోరాడుతూ క్రీ.పూ. 530 లేదా 529 లో, యుద్ధమైదానంలోనే మరణించాడు.[6] ఇతడి తరువాత ఇతని కుమారుడు కాంబిసెస్ II రాజయ్యాడు, కొద్దిపాటి రాజ్యకాలంలోనే, ఈజిప్టును జయించాడు. తన దేశంలోనే కాక యూద మతము లోనూ, మానవహక్కుల విషయాలలో, రాజకీయాలలో, మిలిటరీ విధానలలో, ఇటు తూర్పు దేశాలలోనూ అటు పాశ్చాత్య దేశాలలోనూ గుర్తింపబడినాడు.
నియో-బాబిలోనియన్ సామ్రాజ్యం
మార్చుక్రీ.పూ. 539 లో, సైరస్ ఇలం (సుసియానా), రాజధాని సుసా[ఆధారం చూపాలి]ను ఆక్రమించాడు. బాబిలోనియన్ సైన్యాలను టైగ్రిస్ నది వద్ద ఓడించి ఒపిస్ లను జయించాడు.
సమాధి
మార్చుసైరస్ సమాధి ఇరాన్ లోని పసర్‌గడే ప్రాంతంలో వున్నది (అని భావింపబడుచున్నది). స్ట్రాబో, అర్రియన్ లు, అరిస్టోబులస్ (కసాండ్రియా) రిపోర్టుల ఆధారంగా, ఇది సైరస్ సమాధేనని ధ్రువీకరిస్తున్నారు. అలెగ్జాండర్ ఈ సమాధ్ ప్రదేశాన్ని రెండుసార్లు సందర్శించాడని ఉవాచ.[7]
లెగసీ
మార్చుసైరస్ ఉదారవాదిగా తన జీవితాన్ని గడిపాడు, ప్రజలను సుఖశాంతులతో జీవించేందుకు తోడ్పడ్డాడు. సమానత్వం, సమైక్యత, సామాజిక న్యాయం, పరమత సహనం ఇతని ప్రధాన సూత్రాలుగా వుండేవి. ఇరానీయులు ఇతడిని తమ "పిత"గా భావిస్తారు. యూదులు దైవప్రసాదంగా భావిస్తారు.[8]
ఇతడి "శంఖులిపీ శాసనం" (సైరస్ సిలిండర్) నేటికినీ అంతర్జాతీయంగా కొనియాడబడింది. మానవహక్కుల సూత్రాలను తయారుచేయు సమయంలో ఐక్యరాజ్యసమితిచే ప్రముఖంగా ప్రస్తావింపబడిన సూత్రాలు, సైరస్ "సిలిండర్"లో ప్రకటించినవే.
మతము
మార్చుసైరస్ యొక్క మతపరమైన విధానాలు చాలా సరళంగానూ, సహనము, ఉదారత కలిగివుండేవి. ఈ విషయం ఇతని "సిలిండర్ శాసనం" ద్వారా తెలుస్తున్నది. దుల్‌కర్నైన్ అనే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిగురించే ఖురాన్ లో పొగడబడింది. ఖురాన్ లో వర్ణింపబడిన దుల్‌కర్నైన్, ఈ సైరస్ ఒకరేనని, వర్ణణల ఆధారంగా కొందరు భావిస్తున్నారు. ఇతడి మంచి తత్వాన్ని యూదులు కూడా పొగుడుతూవుంటారు. నెబూచద్‌నెజ్జార్-2 అనే రాజు జెరూసలేంను ధ్వంసంచేసి, యూదులకు వారి దేశం నుండి తరిమివేసి వారి ఆలయాన్నీ ధ్వంసం చేసినపుడు, సైరస్ యూదుల ప్రాంతాన్ని తిరిగీ వారికప్పగించి, వారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాడు, ఈ విషయం యూదుల బైబిల్ కెటువీం లోని రెండవ క్రానికల్ లో ప్రస్తావింపబడింది. ఈ విషయము ఎజ్రా గ్రంథం లోనూ లిఖించబడింది.
సైరస్ సిలిండర్
మార్చుసైరస్ కాలంనాటి వనరు, అదియూ శంఖాకారపు పత్రము (డాక్యుమెంట్) సైరస్ గురించి తెలియజెప్పే ఓ అరుదైన వనరు. ఇందుపై బాబిలోనియన్ భాషలో లిఖింపబడింది.
పాదపీఠికలు
మార్చు- ↑ Ghias Abadi, R. M. (2004). Achaemenid Inscriptions lrm; (in Persian) (2nd ed.). Tehran: Shiraz Navid Publications. p. 19. ISBN 964-358-015-6.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Kent, Ronald Grubb. Old Persian: Grammar, Text, Glossary (in Persian). translated into Persian by S. Oryan. p. 393. ISBN 964-421-045-X.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Xenophon, Anabasis I. IX; see also M.A. Dandamaev "Cyrus II", in Encyclopaedia Iranica.
- ↑ Kuhrt, Amélie. "13". The Ancient Near East: C. 3000-330 BC. Routledge. p. 647. ISBN 0-4151-6762-0.
- ↑ Cambridge Ancient History IV Chapter 3c. p. 170. The quote is from the Greek historian Herodotus
- ↑ Cyrus' date of death can be deduced from the last reference to his own reign (a tablet from Borsippa dated to 12 August 530 BC) and the first reference to the reign of his son Cambyses (a tablet from Babylon dated to 31 August); see R.A. Parker and W.H. Dubberstein, Babylonian Chronology 626 B.C. - A.D. 75, 1971.)
- ↑ Strabo, Geographica 15.3.7; Arrian, Anabasis Alexandri 6.29
- ↑ Larry Hedrick page xiii.
మూలాలు
మార్చుప్రాచీన వనరులు
- The Nabonidus Chronicle of the Babylonian Chronicles
- The Cyrus Cylinder
- Herodotus (The Histories)
- Ctesias (Persica)
- The biblical books of Isaiah, Daniel, Ezra and Nehemiah
- en:Flavius Josephus (en:Antiquities of the Jews)
- The Prayer of Nabonidus (one of the en:Dead Sea scrolls)
- Herodotus; Church, Alfred J., Stories of the East From Herodotus (1891). ISBN 0-7661-8928-7
- Xenophon (Cyropaedia)
- Justin, Epitome of the Philippic History of Pompeius Trogus
- Diodorus Siculus (Bibliotheca historica)
- Fragments of Nicolaus of Damascus
- Athenaeus (Deipnosophistae)
- Strabo (History)
నవీన వనరులు
- Schmitt, Rüdiger; Shahbazi, A. Shapur; Dandamayev, Muhammad A. Dandamayev; Zournatzi, Antigoni. "Cyrus". Encyclopaedia Iranica. Vol. 6. ISBN 0939214784. Archived from the original on 2009-07-31.
- Hedrisck, Larry (2007). Xenophon's Cyrus the Great: The Arts of Leadership and War. Macmillan, 2007. ISBN 0312364695.
- Freeman, Charles (1999). The Greek Achievement: The Foundation of the Western World. Allen Lane. ISBN 0713992247.
- The Cambridge History of Iran: Vol. 2 ; The Median and Achaemenian periods. Cambridge University Press. 1985. ISBN 0521200911.
బయటి లింకులు
మార్చు- Iran, The Forgotten Glory - Documentary Film About Ancient Persia (Achaemenids & Sassanids) Archived 2010-04-28 at the Wayback Machine
- A short sample of the documentary film In Search of Cyrus the Great, directed by Cyrus Kar, in production, hosted by International Committee to Save the Archaeological Sites of Pasargadae Archived 2010-03-04 at the Wayback Machine (9 min 58 sec).
- Xenophon, Cyropaedia: the education of Cyrus, translated by Henry Graham Dakyns and revised by F.M. Stawell, Project Gutenberg.
Iran Chamber Society
Other
- PersianDNA Cyrus The Great - Persian Empire & The Greatest King of the History
- Pictures of Tomb of Cyrus the Great