సొగసు చూడతరమా

1995 సినిమా
(సొగసు చూడ తరమా నుండి దారిమార్పు చెందింది)

సొగసు చూడతరమా గుణశేఖర్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రం. ఇందులో నరేష్, ఇంద్రజ ముఖ్యమైన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య జరిగే సరదాలు, అలకలు ఈ సినిమాలో ప్రధాన కథ. ఇది దర్శకుడు గుణశేఖర్ కు రెండవ సినిమా కాగా మొదటి చిత్రం లాఠీ. ఈ చిత్రాన్ని కె. రాంగోపాల్ స్నేహనిధి ఫిలింస్ పతాకంపై నిర్మించగా కర్రి రమణారావు సమర్పకుడిగా వ్యవరించాడు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, చిత్రానువాదం, మాటలు, కాస్ట్యూమ్స్ విభాగాల్లో నాలుగు నంది పురస్కారాలు వచ్చాయి. భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. టైటిల్ సాంగ్ ప్రజాదరణ పొందింది.[1]

సొగసు చూడతరమా
దర్శకత్వంగుణశేఖర్
నిర్మాతకె. రాంగోపాల్, కర్రి రమణారావు
తారాగణంనరేష్,
ఇంద్రజ
సంగీతంభరద్వాజ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 జూలై 14 (1995-07-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. టైటిల్ సాంగ్ ప్రజాదరణ పొందింది.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఓరయ్యో ఏందమ్మో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ 4:38
2. "ఆకాశంలో నీలిమబ్బుల"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత, రోహిణి 4:37
3. "సీతాకోక చిలుకాలమ్మా"  అనురాధ శ్రీరామ్ 5:09
4. "సొగసు చూడతరమా"  కె. జె. ఏసుదాసు 3:33
5. "రన్ను కట్టి పెట్టు పెళ్ళమ్మా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ 4:43
6. "ఓరి బాబోయ్ చూడచక్కని"  సురేష్ పీటర్స్, ఖుషి మురళి 4:59
27:39

మూలాలు మార్చు

  1. "నాలుగు నందుల 'సొగసు చూడ తరమా' @ 25". www.eenadu.net. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.
  2. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.