లాఠీ (సినిమా)
లాఠీ 1992లో గుణశేఖర్ దర్శకత్వంలో ప్రశాంత్, సంయుక్త సింగ్, రఘువరన్ ప్రధాన పాత్రధారులుగా వెలువడిన తెలుగు సినిమా[1] . ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఓటమి చవిచూసినా ఈ సినిమాద్వారా దర్శకుడికి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది పురస్కారం లభించింది.
లాఠీ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గుణశేఖర్ |
---|---|
తారాగణం | ప్రశాంత్, సంయుక్త సింగ్, రఘువరన్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | మురళీకృష్ణ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ప్రశాంత్ - శ్రీనివాస్
- సంయుక్త సింగ్ - సంగీత
- రఘువరన్ - అవినాష్
- అలీ
- బ్రహ్మాజీ -బ్రహ్మాజీ
- బ్రహ్మానందం
- కిట్టీ - సర్కిల్ ఇన్స్పెక్టర్
- చిన్నా -బాబ్జీ
- జె.డి.చక్రవర్తి - రమణ
- నర్రా వెంకటేశ్వరరావు - హెడ్ కానిస్టేబిల్
- సాయి కుమార్ - పృథ్వీ
- వినోద్ బాల - భాస్కర్
- అంబిక - ఆశ
సాంకేతికవర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: గుణశేఖర్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి
- ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
- కళ: చంటి
- నృత్యాలు: సుందరం, సుచిత్ర, దిలీప్
- కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
- నిర్మాత: మేడికొండ రామచంద్రరావు
సంక్షిప్తకథ
మార్చుశ్రీను(శ్రీనివాస్)కు చిన్నతనం నుండే పోలీస్ కావాలని ఆశ. ఎట్టకేలకు అతడు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో చేరతాడు. ట్రైనింగ్ తర్వాత కానిస్టేబుల్‌గా డాన్ దావూద్ ఉన్న ప్రాంతానికి పోస్ట్ చేయబడతాడు. డాన్ దావూద్‌పై ఎలా విజయం సాధించింది మిగిలిన చిత్రకథ. ఈ లోగా అతడు సంగీతతో ప్రేమలో పడతాడు.
పాటలు
మార్చుక్ర.సం. | పాట | గాయనీగాయకులు |
---|---|---|
1 | "గొప్ప కథే" | ఎం.ఎం.కీరవాణి |
2 | "ఇక్కడున్నావా" | చిత్ర |
3 | "మధుర పరాగం" | ఎం.ఎం.కీరవాణి |
5 | "పరుగులు పెట్టే" | ఎం.ఎం.కీరవాణి |
6 | "పరుగులు పెట్టే" | చిత్ర |
7 | "ఉలికిపడ్డ గుండెలోన" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
మూలాలు
మార్చు- ↑ "Watch Lathi (1992) Free Online". ovguide. Archived from the original on 2015-11-22. Retrieved 2015-11-21.