సోగ్గాడు (2005 సినిమా)
సోగ్గాడు (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిబాబు |
---|---|
చిత్రానువాదం | పరుచూరి సోదరులు |
తారాగణం | తరుణ్, ఆర్తీ అగర్వాల్, సుబ్బరాజు, ఆలీ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు,సంజనా గల్రానీ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 31 మార్చి 2005 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చురాజు (తరుణ్) ఆవారాగా తిరిగే ఓ సగటు కుర్రాడు. స్వాతి (ఆర్తి అగర్వాల్) అనే అమ్మాయిని తను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. స్వాతిని ఆమె అన్నయ్య కట్టుదిట్టంగా పెంచడమే కాకుండా, ఆమెకు ఇష్టం లేని పెళ్ళి చేయాలని భావిస్తాడు. అదే సమయంలో తనను ఏదో ఒక రకంగా కలవడానికి ప్రయత్నిస్తున్న రాజును స్వాతి చూస్తుంది. అతనితో సైగల ద్వారా పరిచయం పెంచుకొని, తనను ఆ ఇంటి నుంచి బయటకు ఎలాగైనా సరే తీసుకురమ్మని, తన అన్న చెర నుండి విడిపించమని కోరుతుంది. ఎన్నో కష్టాలను కోర్చి రాజు ఆమెను ఆ ఇంటి నుండి బయటకు తీసుకొస్తాడు. అప్పుడే రాజు స్వాతి తనను కాకుండా చందు (జుగల్ హన్సరాజ్) అనే మరో వ్యక్తిని ప్రేమిస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అయినప్పటికీ ఆ ప్రేమికులను కలపాలనే తాపత్రయపడతాడు.
అయితే రాజు తన ప్రేమను త్యాగం చేస్తూ, తన ప్రేయసిని మరో వ్యక్తితో పంపించడం అతని స్నేహితులకు నచ్చదు. ఎందుకంటే రాజు పడిన శ్రమలో వారి పాత్ర కూడా ఉంది కాబట్టి. అయినప్పటికీ రాజు, స్వాతిని ఆమె ప్రేమించినవ్యక్తితో పంపించడానికే సిద్దమవుతాడు. కానీ, స్వాతి ఆఖరికి రాజు ప్రేమనే అర్థం చేసుకుంటుంది.
అల్లరి సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన రవిబాబుకి 'సోగ్గాడు' మూడవ చిత్రం. తొలుత ఈ చిత్రంలో చందు (జుగల్ హన్సరాజ్) పాత్రకి నటుడు ఉదయ్ కిరణ్‌ను ఎంపిక చేశామని అయితే పలు కారణాల వలన, ఆ పాత్ర హిందీ నటుడితో చేయాల్సించి వచ్చిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పాటల జాబితా
మార్చుచిత్రంలోనీ అన్ని పాటలు రచయిత : భాస్కర భట్ల రవికుమార్.
కరెంట్ షాక్ , గానం; చక్రి, రవివర్మ
ఎప్పటి కప్పుడు, గానం: చక్రి, సుధ
ప్రేమించా నిన్నే , గానం: వేణు, కౌసల్య
మధుమాసం , గానం.చక్రి
ఎక్కడ ఉన్నా, గానం: కార్తీక్ , కౌసల్య
కలికి చిలక , గానం: కార్తీక్
స్నేహం , గానం.చక్రి
కొక్కొరొక్కో, గానం: టిప్పు , కవితా కృష్ణమూర్తి.