సోనమ్‌ ప్రీత్ బజ్వా (జననం 1989 ఆగస్టు 16), పంజాబీ చిత్రాలలో ప్రధానంగా నటించే భారతీయ నటి. ఆమె 2012 ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నది. ఆ తర్వాత, పంజాబీ చిత్రం బెస్ట్ ఆఫ్ లక్ (2013) తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. కప్పల్‌ చిత్రంతో తమిళ సినిమారంగ ప్రవేశం చేసింది. ఆమె పీటీసి పంజాబీ ఫిల్మ్ అవార్డు గ్రహీత.[1][2]

సోనమ్ బజ్వా
2023లో సోనమ్ బజ్వా
జననం
సోనమ్‌ప్రీత్ బజ్వా

(1989-08-16) 1989 ఆగస్టు 16 (వయసు 35)
విద్యాసంస్థఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తి
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
ఎత్తు5 అ. 7 అం. (170 cమీ.)

పంజాబ్ 1984 (2014), సర్దార్ జీ 2 (2016), నిక్కా జైల్దార్ (2016), మంజే బిస్ట్రే (2017), నిక్కా జైల్దార్ 2 (2017), క్యారీ ఆన్ జట్టా 2 (2018), గుడ్డియాన్ పటోల్ (2019), అర్దాబ్ ముతియారన్ (2019), హోన్స్లా రఖ్ (2021) వంటి విజయవంతమైన చిత్రాలతో నటించిన ఆమె పంజాబీ చిత్రాలలో ప్రముఖ నటిగా స్థిరపడింది. అయితే ఆమె ఆటాడుకుందాం రా (2016) తో తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది.[3]

అర్దాబ్ ముతియారన్‌లో ఆమె నటనకు ఉత్తమ నటిగా పీటీసి పంజాబీ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. మంజే బిస్ట్రే, నిక్కా జైల్దార్ 2 చిత్రాలకు ఆమె రెండు ఫిలింఫేర్ అవార్డులు పంజాబీ - ఉత్తమ నటి నామినేషన్‌ను కూడా అందుకుంది.[4]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె1989 ఆగస్టు 16న నైనిటాల్‌లో పంజాబీ కుటుంబంలో జన్మించింది.[5][6] ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[7] ఆమె 2012లో ముంబైకి వెళ్లి ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది.[8] ఆమె ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగంలో చేరింది, కానీ నటనలో వృత్తిని కొనసాగించాలనే తపనతో దానిని విడిచిపెట్టింది.[3][9]

మూలాలు

మార్చు
  1. Vashist, Neha (13 August 2021). "Sonam Bajwa: 5 characters that prove she is the most versatile actress in Pollywood". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2 March 2022. Retrieved 11 January 2022.
  2. "Sonam Bajwa's all black look gets the netizens hooked". The Times of India. 12 November 2021. Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  3. 3.0 3.1 Rinku Gupta (26 November 2014). "Punjabi model turns Tamil bride". The New Indian Express. Archived from the original on 11 May 2016. Retrieved 22 December 2018.
  4. "PTC Punjabi Film Awards 2020: Here's What The Winners Have To Say". PTC Punjabi. 4 July 2020. Archived from the original on 23 January 2021. Retrieved 19 February 2021.
  5. "Sonam Bajwa thanks everyone for the birthday wishes, says she is blessed beyond measure". The Times of India (in ఇంగ్లీష్). 17 August 2020. Archived from the original on 27 December 2020. Retrieved 7 October 2020.
  6. Rinku Gupta (26 November 2014). "Sonam's dreams come true". The New Indian Express. Archived from the original on 7 May 2016. Retrieved 22 December 2018.
  7. "About Us". Du.ac.in. 26 February 2011. Archived from the original on 16 May 2012. Retrieved 18 May 2012.
  8. "Femina Miss India 2012 Contestants". E Times - Beauty Pageants. Archived from the original on 2015-10-27. Retrieved 22 August 2018.
  9. "Sonampreet Bajwa Profile". Times Internet. Archived from the original on 27 October 2015. Retrieved 22 December 2018.