ఆటాడుకుందాం రా

జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ఆటాడుకుందాం రా 2016, ఆగస్టు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

ఆటాడుకుందాం రా
ఆటాడుకుందాం రా సినిమా పోస్టర్
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
స్క్రీన్ ప్లేశ్రీధర్ సీపన
నిర్మాతనాగ సుశీల
చింతలపూడి శ్రీనివాసరావు
తారాగణంఅనుమోలు సుశాంత్
సోనమ్ బజ్వా
ఛాయాగ్రహణందాశరథి సీవేంద్ర
కూర్పుగౌతంరాజు
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
శ్రీనాగ్ ప్రొడక్షన్
విడుదల తేదీ
19 ఆగస్టు 2016 (2016-08-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) ఎంతో స్నేహంగా ఉంటారు. ఆనంద్ సలహాల వల్ల విజయరామ్ కు వ్యాపారాల్లో లాభం వచ్చి కోట్లు సంపాదిస్తాడు. అదిచూసి సహించక విజయరామ్‌ శత్రువు శాంతారామ్ మోసం చేస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ మోసం ఆనంద్‌పై పడుతుంది. దీంతో విజయరామ్, ఆనంద్ ఇద్దరూ విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కష్టాల్లో ఉన్న విజయరామ్ కుటుంబాన్ని శాంతారామ్ ఏదోరకంగా హింసిస్తూనే ఉంటాడు.

ఈ సమయంలోనే విజయరామ్‌కి అల్లుడైన కార్తీక్ (సుశాంత్) అమెరికా నుంచి ఓ పనిమీద ఇండియా వస్తాడు. విజయరామ్‌కి అతడి చెల్లెలన్నా, ఆ కుటుంబం అన్నా నచ్చదు. అలాంటి మనిషికి కార్తీక్ ఎలా దగ్గరయ్యాడు? కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడూ? అతడు నిజంగానే విజయరామ్‌కి మేనల్లుడా? కేవలం మేనల్లుడిగా నటించడానికి వచ్చాడా? ఆనంద్ ప్రసాద్ ఏమైపోయాడూ? ఈ కథలో సుశాంత్ ప్రియురాలు శృతి (సోనమ్ భజ్వా) ఎవరూ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

నటవర్గం

మార్చు
అతిథి పాత్రలు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
  • నిర్మాత: నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు
  • చిత్రానువాదం: శ్రీధర్ సీపన
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • ఛాయాగ్రహణం: దాశరథి సీవేంద్ర
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీనాగ్ ప్రొడక్షన్

పాటలు

మార్చు

దేవదాసు సినిమాలోని "పల్లెకు పోదాం" అనేపాట ఈ చిత్రంకోసం మళ్ళీ వాడుకున్నారు.[2]

  1. రౌండ్ అండ్ రౌడ్ - రచన: కృష్ణ చైతన్య; గానం: అనురాగ్ కులకర్ణి - 04:18
  2. జూమెగా - రచన: శ్రీజో; గానం: నరేష్ అయ్యర్, అనంది జోషి - 04:11
  3. ఆటాడుకుందాం రా - రచన: భాస్కరభట్ల రవికుమార్; గానం: సాహితి చాగంటి, అనురాగ్ కులకర్ణి - 03:54
  4. థీమ్ (టైం మిషన్) - 01:22

విడుదల

మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక "సెలబ్రిటీల పేర్లను వాణిజ్యం పరంగా ఉపయోగించుకువడానికి ఈ చిత్రం మంచి ఉదాహరణ" అని పేర్కొంది.[3] "ఈ టైం మిషన్ లోకి అడుగుపెట్టడానికి బదులుగా అక్కినేని నాగేశ్వరరావు లేదా నాగార్జున నటించిన పాత సినిమాలను చూడండి" అని ది హిందూ పత్రికలో రాశారు.[2]

మూలాలు

మార్చు
  1. Kavirayani, Suresh (August 19, 2016). "I got emotional while shooting: Sushant". Deccan Chronicle.
  2. 2.0 2.1 Dundoo, Sangeetha Devi (August 19, 2016). "Aatadukundam Raa: The joke is on the audience" – via www.thehindu.com.
  3. "Aatadukundam Raa Movie Review {2/5}: Critic Review of Aatadukundam Raa by Times of India" – via timesofindia.indiatimes.com.

ఇతర లంకెలు

మార్చు