నైనితాల్
భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే నైనితాల్, హిమాలయ శ్రేణులలో ఉంది. అది కుమావొన్ హిల్స్ మధ్య భాగంలో ఉంది. అందమైన సరస్సులకు ఇది నెలవు. నైనితాల్ పేరులోని "నైనీ" అంటే నయనం, "తాల్" అంటే సరసు. నైనితాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాక పుణ్యా క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. ఇది సముద్రమట్టానికి 2084 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తున ఉంది. నైనితాల్ కంటి ఆకారం కలిగిన ఉన్న పర్వతశిఖరాల మద్య ఉన్న ప్రదేశంలో ఉంది. నగరంలో ఉన్న శిఖరాలలో నగరానికి ఉత్తరాన ఉన్న సముద్రమట్టానికి 2615 మీటర్ల (8,579 అడుగుల) ఎత్తులో ఉన్న నైనాశిఖరం, నగరానికి పడమరన సముద్రమట్టానికి 2438 మీటర్ల (7,999 అడుగుల) ఎత్తులో ఉన్నడియోపద శిఖరం, నగరానికి దక్షిణంలో సముద్రమట్టానికి 2278 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తులో ఉన్న ఆయర్పద శిఖరం నగరం చుట్టూ ఉన్న ఎత్తైన శిఖరాలలో ముఖ్యమైనవి.[1]
నైనితాల్ ఉత్తరాఖండ్ | |
---|---|
పట్టణం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
జిల్లా | నైనితాల్ |
సముద్రమట్టం నుండి ఎత్తు | 2,084 మీ (6,837 అ.) |
జనాభా వివరాలు (2001) | |
• మొత్తం | 48,900 |
భాషలు | |
• అధికార భాష | హిందీ |
• ఇతర భాషలు | గార్వాలీ,కుమౌని |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 263001/263002 |
టెలీఫోన్ కోడ్ | +91 - 5941 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | UK 04 |
జాలస్థలి | nainital |
పేరువెనుక చరిత్రసవరించు
నైనితాల్ ను స్కంద పురాణం లోని మానస ఖండ్ లో ముగ్గురు ఋషుల సరస్సు లేదా ముగ్గురు ఋషుల సరోవరం అని కూడా అంటారు. ఈ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, పులాహ. వీరు వారి దాహం తీర్చుకునేతందుకు గాను నైనితాల్ వద్ద ఆగారు. వారికి ఆ ప్రాంతంలో నీరు దొరక లేదు.వెంటనే వారు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిలోకి మానస సరోవరం నీటిని నింపి దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనితాల్ సరస్సు సృష్టించబడింది. మరో కథనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి యొక్క ఎడమ కన్ను పడి ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.
చరిత్రసవరించు
నైనితాల్ దాని అందాలకు ప్రశాంత వాతావరణానికి గాను టూరిస్టులకు స్వర్గం ధామంగా వుంటుంది. బ్రిటిష్ వ్యాపారి ఫై.బర్రోన్ అనే వ్యక్తి ఆ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839వ సంవత్సరంలో ఇక్కడ ఒక బ్రిటిష్ కాలనీ స్థాపించి దానిని ప్రసిద్ధి చేసాడు. నైనితాల్ సందర్శనకు ప్రణాళిక చేసే వారు ఇక్కడే కల హనుమాన్ ఘర్ కూడా తప్పక చూడాలి. దీనితో పాటు ఇండియా లోని 51 శక్తి పీటాలలో ఒకటి అయిన నైనా దేవి టెంపుల్ కూడా తప్పక చూడాలి. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తరువాత కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. అయినప్పటికీ 1841 తరువాతనే నైనితాల్ అభివృద్ధిచేయబడింది. షాజాన్‌పూరుకు చెందిన చక్కెర వ్యాపారి పి.బారన్ యురేపియన్ హౌస్ (భక్తుల వసతి గృహం) నిర్మాణంతో ఇక్కడ మొదటి నిర్మాణం ఆరంభం అయింది. ఆయన మాటలలో " 1,500 మైళ్ళు (2,400 కిలోమీటర్లు) హిమాలయాల పర్వతారోహణ తరువాత నేనీ సుందరమైన ప్రదేశానికి చేరుకున్నాను " అని వర్ణించబడింది.[2] 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ ఆర్టిల్లరీ నైనితాల్‌ను దర్శించాడు. ఆయన మాటలలో " దాదాపు సముద్రమట్టానికి 7,500 అడుగులు (2,300 మీటర్లు) ఎత్తువరకు నివాసగృహాలు వ్యాపించి ఉన్నాయి " అని వర్ణించాడు. "[3] తరువాత కాలంలో అటవీప్రాంతంలో సెయింట్ జాన్ చర్చ్ నిర్మాణం జరిగింది. తరువాత యునైటెడ్ ప్రోవింస్ గవర్నరుకు అది వేసవి విడిదిగా మారింది.ప్రస్తుతం ఈ ప్రాంతనికి లామాల్హెట్ ( పితోర్‌ఘడ్) రాజా మహేంద్రచంద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన రీనాకు చెందిన రాణి గీతాను వివాహం చేసుకున్నాడు. ఆయనకు రాజకుమారి ఆకాంక్షా చంద్, రాజకుమారి మల్లికా చంద్, రాజకుమార్ ఆర్యన్ చంద్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు.
1880లో నైనితాల్ భూ ఉచకోత ప్రమాదాలుసవరించు
1880 సెప్టెంబర్ నెలలో నైనితాల్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. నగరానికి ఉత్తరదిశలో జరిగిన ఈ ప్రమాదంలో 151 మంది ప్రజల ప్రాణాలు భూస్తాపితం అయ్యాయి. మొదట నమోదైన విపత్తు 1866లో సంభవించింది. రెండవ విపత్తు 1879లో ఆల్మా హిల్‌లో అదే ప్రదేశంలో సంభవించింది. తరువాత సంవత్సరం 1880 సెప్టెంబర్ 18న జరిగిన విపత్తు గొప్ప విపత్తు ( గ్రేట్ స్లిప్) గా పేర్కొనబడింది. "[3] " రెండురోజులపాటు కొండచరియలు విరిగిపడిన తరువాత 40 గంటల సమయం భారీగా వర్షం కురిసింది. 20 అంగుళాలు (510 mమీ.) నుండి 35 అం. (890 mమీ.) కొండచరియలు విరిగిపడిన తరువాత కూడా వర్షం కొనసాగింది. కొండచరియల నుండి భారీగా కిందకు ప్రవహించిన జలాలు విక్టోరియా హోటల్ వంటి భవనాలను ఆపదలో పడవేసాయి. ప్రవాహాలను తిప్పడం ద్వారా బెల్స్ షాప్, దివాలంటీర్ ఆర్డర్లీ రూం, నైనాదేవి ఆలయాలను సురక్షితంగా కాపాడలేకపోయారు. రెండు ప్రమాదాలలో నగరంలోని నాలుగవ వంతు భవనాలు ధ్వంసం అయ్యాయి. మొత్తం 108 మంది భారతీయులు, 48 బ్రిటిష్ పౌరులు తప్పిపోవడం, చనిపోయిన జాబితాలో చేరారు. అసెంబ్లీ రూములు నైనాదేవి ఆలయాలు ధ్వంసం అయ్యాయి. అదే ప్రదేశంలో సరికొత్త నిర్మాణాలు నైనాదేవి ఆలయం తిరిగి నిర్మించబడ్డాయి.
పాఠశాలలుసవరించు
19 వశతాబ్ధం చివరిలో బాలలు, బాలికల కొరకు యురోపియన్ పాటశాలలు స్థాపించబడ్డాయి. విక్టోరియన్ శకంలో ఎడ్వర్డ్ కాలంలో ఇక్కడి విద్యార్ధులలో అధికంగా బ్రిటిష్ కాలనీ అధికారులు, స్థానికుల పిల్లలై ఉండేవారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్ట్‌కు సమీపంలో 1869లో స్థాపినచబడిన అప్పటి " డియోస్కాన్ గరల్స్ ఉన్నత పాఠశాల " ప్రస్తుతం " ఆల్ సెయింట్స్ కాలేజ్ " గా మార్చబడింది. 1906 నాటికి అలాంటి పాఠశాలలు 6 పైగా స్థాపించబడ్డాయి.[3] అవి వరుసగా " డియోసీజన్ బాయ్స్ స్కూల్ " ది (తరువాత అది షర్‌వుడ్ కాలేజ్‌గా పిలువబడింది), " ది ఫిలాండర్ స్మిత్స్ కాలేజ్ " ( తరువాత అది " హాల్టర్ వార్ స్కూల్ గా మార్చబడి ప్రస్తుతం " బిర్లావిద్యా మందిర్‌గా ) మారింది. ఐరిష్ సహోదరలచే స్థాపింపబడిన డే, బోర్డింగ్ స్కూల్ " సెయింట్ జోసెఫ్స్ కాలేజ్; నైనితాల్.[ఆధారం చూపాలి] i1888లో ఇది 2013లో 125వ వార్షికోత్సవం జరుపుకున్నది. సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఎస్.ఇ.ఎంగా పిలువబడుతుంది. ఇతర 1878లో స్థాపించబడిన పాఠశాలలో ప్రధానమైనవి. ప్రధానంగా రామ్నీ అని పిలువబడే " సెయింట్ మేరీ కాలేజ్" ప్రధానమైంది.
కుమాన్ యూనివర్శిటీసవరించు
కుమాన్ యూనివర్శిటీ ప్రధాన కార్యాలయం నైనితాల్‌లో ఉంది.[4] (మరొకటి అల్మోరా ఎస్.ఎస్.జే కాంపస్‌లో ఉంది '). ఈ యూనివర్శిటీని 1973లో అవతరించింది. ముందు అది 1951లో డాన్ సింగ్ బిస్త్ తన తండ్రి ఠాఖూర్ డాన్ బిస్త్ సింగ్ జ్నాపకార్థం " (బడి.ఎస్.బి) గవర్నమెంట్ కాలేజ్‌గా స్థాపినబడింది.మాథమెటీషియన్ డాక్టర్ ఎ.ఎన్. సింఘ్ మొదటి ప్రినిసిపాల్గా పని చేసాడు.
ఎ.ఆర్.ఐ.ఇ.ఎస్ (స్టేట్ అబ్జర్వేటరీ )సవరించు
నైనితాల్‌లో ఉన్న 50 సంవత్సరాల ఓల్డ్ స్టేట్ అబ్జ్ర్వేటరీ 2004లో ఎ.ఆర్.ఐ.ఇ.ఎస్, డిపార్ట్ ఆఫ్ సైంస్ అండ్ టెక్నాలజీలో అంతర్భాగంగా [[ది ఆర్యభట్టా రీసెర్చ్ ఇంస్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైంసెస్ " పని చేస్తున్నది. 1954లో అబ్జర్వేటరీ వారణాశిలో పనిచేయడం మొదలైంది. తరువాత సంవత్సరం ఈ అబ్జర్వేటరీ నైనితాల్ లోని ప్రశాంతమైన ప్రదేశాలకు మార్చబడింది. 1961లో అది తిరిగి ప్రస్తుత ప్రాంతమైన మనోరా పీక్‌కు తరలించబడింది. (1,951 మీ. (6,401 అ.)) నైనితాల్ దక్షిణంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రానమీ పరిశోధనలకు అవసరమైన సౌకర్యాలను " ఎ.ఆర్.ఐ.ఇ.ఇ.ఎస్ అందిస్తున్నది. .
మార్పులుసవరించు
నైనితాల్ స్థాపించబడిన 42 సంవత్సరాల తరువాత 1880 నాటికి నైనితాల్ పూర్తిగా ఆంగ్లేయుల నివాసంగా మారింది. నగరంలో కూలీ, సేవారంగ పనులలో మాత్రమే భారతీయులు ఉండేవారు. విక్టీరియన్ శకం ముగిసే వరకు ఈ పరిస్థితి కొనసాగింది. 20వ శతాబ్ధంలో మొదటిసారిగా సరికొత్త మార్పులు సంభవించాయి. ఇండియన్ యునైటెడ్ ప్రొవింస్ అధికారులు, సంపన్నులు వేసవి కాల పర్యటనకు నైనితాల్‌ను ఎంచుకున్నారు. 1901 నైనితాల్ జనసంఖ్య 7,609 కి చేరింది. తరువాత 1925లో బ్రిటిష్ సివిల్ సర్వెంట్లు తమశలవు దినాలు గడపడానికి బ్రిటన్‌ను ఎంచుకోవడం మొదలు పెట్టారు.[5] తరువాత ఆంగ్లేయులలో పలువురు వేసవి విడిదిగా హిల్‌స్టేషన్లకు పోవడం ఆగిపోయింది. తరువాత 1947 నుండి కాలంలో నగరంలో ఆంగ్లేయుల సంఖ్య తగ్గుతూ ఆ స్థానంలో భారతీయ నివాసాలు అభివృద్ధి అయ్యాయి.
పురాణకథనంసవరించు
అష్టాదశపూఅరాణాలలో ఒకటైన స్కందపురాణంలో నైనితాల్ " త్రిఋషి సరోవరం " అని పిలువబడుతుంది. అందుకు ఒక కథనం ఆధారంగా కనబడుతుంది. అత్రి, పులస్య అరియు పౌల అనే ముగ్గురు ౠషులు ఈ ప్రాంతంలో నీరు లభించనందున ప్రస్తుతం సరసు ఉన్న ప్రదేశంలో ఒక చెరువును నిర్మించి దానిని ప్రస్తుతం టిబెట్‌లో ఉన్న మానస సరోవరం నీటితో నింపారు. అందువలన నైనితాల్ సరసులో స్నానమాచరిస్తే మానససరోవరంలో స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
నైనితాల్ సరసు 64 శక్తిపీఠాలలో ఒకటని విశ్వసించబడుతుంది. దక్షాయినీ దక్షయజ్నలో పవిత్రాగ్నిని సృష్టించుకుని తనకుతాను భస్మం అయిన తరువాత ఆ శరీరాన్ని మోసుకుంటూ శివుడు తిరుగుతున్న సమయంలో శివుని వైరాగ్యాన్ని పోగొట్టడానికి బ్రహ్మదేవుని ప్రార్థన అనుసరించి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా ఖండించగా అందులో సతీదేవి నేత్రం పడిన ప్రదేశామే నైనితాల్ అయిందని మరొక కథనం ప్రచారంలో ఉంది. అందువలన ఈ సరసు నేత్రం ఆకారంలో ఉందని. నేత్రం ఆకారంలో సరసు ఉన్న ప్రదేశం నైనితాల్‌గా పులివబడుతుందని భావించబడుతుంది.
జనసంఖ్యసవరించు
2001 గణాంకాలను అనుసరించి, [8] నైనితాల్ జనసంఖ్య 38,559. ఇందులో పురుషులు 54% ఉండగా జసంఖ్యలో 46% ఉన్నారు. నైనితాల్ సరాసరి అక్షరాస్యత 91%, ఇది జాతీయ సరాసరి 59.5% కంటే అధికం: ఇందులో పురుషుల అక్షరాస్యత 98%, స్త్రీల అక్షరాద్యత 86%. నైనితాల్‌జనసంఖ్యలో 1% ప్రజలు 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. కుమౌనీ ప్రజలు (కుమౌనీలి) నైనితాల్ ప్రజలలో ప్రథమ స్థానంలో ఉన్నారు.
ప్రముఖులుసవరించు
- సుకృతి కండ్పాల్ : భారతీయ సినిమా నటి.
పర్యాటక ఆకర్షణలుసవరించు
లాండ్స్ ఎండ్ ప్రదేశం ఖుర్పతాల్ లేక్ యొక్క అందమైన దృశ్యాలు చూపి ముగ్దులును చేస్తుంది. ఇది పచ్చటి వాలీ, నైనితాల్ చుట్టూ వున్నా కొండల అందాలు కూడా చూడచ్చు.. టూరిస్టులు ఒక రోప్ వే ద్వారా ఈప్రదేశ కొండప్రాంతాలను చేరవచ్చు.
రాజభవన్సవరించు
రాజ్ భవన్ వలసకాలనాటి భవనం. దీనిని గవర్నర్ హౌస్ అని కూడా అంటారు.ఈ భవనం ఉత్తరాఖండ్ గవర్నర్ కు నివాసం. దీనిలో చక్కగా అలకరించ బడిన 113 గదులు ఉన్నాయి. ఒక అందమైన గార్డెన్, ఒక స్విమ్మింగ్పూల్, గొల్ఫ్లింకులు ఉన్నాయి. దీనిని బకింగ్ హాం పాలస్ తోపోలుస్తారు. ఈ భవన ప్రవేశానికి ముందస్తు అనుమతులు కావాలి.
కిల్ బరీసవరించు
నైనితాల్ నుండి 10 కి.మీ. ల దూరంలో కల అందమైన పిక్నిక్ ప్రదేశం కిల్ బరీ కూడా చూడదగినది. పచ్చటి ఓక్, పైన్, రోడోడెండ్రాన్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశంగా చేసాయి. ఈ అడవులలో సుమారు 580 జాతులకు పైగా వివిధ రకాల వృక్ష జాతులు, రంగు రంగుల పక్షులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2481 అడుగుల ఎత్తున కల లరిఅకంత పర్యాటకులకు ఎన్నో అందమైన హిమాలయ దృశ్యాలు చూపుతుంది. ఇది నైనితాల్ లో రెండవ అత్యధిక ఎత్తు కలది.
నైనా దేవి ఆలయంసవరించు
నైనా దేవి ఆలయం ఒక శక్తి పీఠం. నైని లేక్ కు ఉత్తర దిశగా ఉంది. ఈ టెంపుల్ లో హిందువుల దేవత నైనా దేవి వుంటుంది. ఈమె విగ్రహంతో పాటు గణేశ, కాలి విగ్రాహాలు కూడా ఇదే టెంపుల్ లో వుంటాయి. ఈ ఆలయ ప్రవేశంలో పెద్దరావి చెట్టు వుంటుంది.
చైనాశిఖరంసవరించు
నైనా శిఖరాని చైనా శిఖరం అని కూడా అంటారు. ఇది నైనితాల్ లో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున ఉంది. దీనిని చేరాలంటే, గుర్రం పై వెళ్ళాలి.టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం ఇక్కడ టూరిస్టులు ఎంతో వినోదంతో సమయం గడపవచ్చు. ఈప్రదేశం " డొరొతి కేల్లేట్" అనే ఒక ఇంగ్లీష్ ఆర్టిస్ట్ భార్య పేరుతో అభివృద్ధి చేయబడింది. ఈమె ఒక ప్లేన్ ఆక్సిడెంట్ లో మరణించగా ఆమె పేరుతో ప్రదేశం అభివృద్ధి చేయబడింది. ఇక్కడే ఒక ఎకో కేవ్ గార్డెన్ ఉంది. ఇది మరొక పేరొందిన ప్రధాన ఆకర్షణ. ఈప్రదేశం సందర్శకులకు పర్యావరణ స్నేహ పూరిత జీవన విధానాలు నేర్పిస్తుంది.
రోప్సవరించు
నైనితాల్ రోప్ వే మరోకి ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. ఇది కుమావొన్ మండల వికాస్ నిగం చే నిర్వహించబడుతోంది. ఇది ఇండియాలో స్థాపించ బడిన మొదటి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీ.ల ఎత్తున కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 825 కే.జి.ల బరువు అంటే 12 వ్యక్తులను మోయ ఉంది.ఈరోపే వే స్నో వ్యూను నైనితాల్ టవున్ కు కలుపుతుంది. రోప్ వే సెకండుకు 6 మీ.ల దూరం కదులుతుంది. ఈ ప్రయాణంలో టూరిస్టులు అద్భుత దృశ్యాలను చూడడానికి అవకాశం ఉంది.
నైనీ సరసుసవరించు
నైనితాల్ లో నైని సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలు ఉన్నాయి. ఇతిహాసాల మేరకు కన్ను ఆకారంలో వుండే ఈ సరస్సు హిందూ దేవత సతి యొక్క మృత్ శరీరపు కన్ను పడిన ప్రదేశంగా చెపుతారు. ఈసరస్సును 'ముగ్గురు ఋషుల సరస్సు' అనికూదాంటారు. ఈ పేరు స్కాందపురాణ లోని మానస్ ఖండ్ అధ్యాయంలో కలదు . ఈ సరస్సు చాలా పొడవైనది. ఉత్తరపు కోనను మల్లితాల్ అని దక్షిణపు కొనను తల్లితాల్ అని అంటారు. ఈ సరస్సు పై ఒక వంతెన, దానిపై ఒక పోస్ట్ ఆఫీస్ వుంటాయి. సమీపంలో ఒక బస్సు స్టేషను, టాక్సీ స్టాండ్, రైల్వే రిజర్వేషన్ల కౌంటర్, షాపింగ్ సెంటర్ లు ఉన్నాయి.
ఖృపాతాల్ సరసుసవరించు
నైనితాల్‌కు 10కిలోమీటర్లదూరంలో (6.2 మైళ్ళు) దూరంలో రోడ్డుమార్గంలో లేక 5కిలోమీటర్ల దూరంలో (3.1మైళ్ళ ) ఎత్తులో ఖృపాతాల్ సరసు (సాధారణంగా దీనిని ట్రావెల్ లేక్ అంటారు) ఉంది. ఇది సముద్రపు మట్టానికి 1,635 మీటర్లు (5,364 అడుగులు) ఎత్తులో ఉంది. ఎత్తైన పొలాలు లేక తోటలు, మద్య ఉపస్థితమై ఉంది.
నౌకుచియా సరసుసవరించు
నౌకుచియా సరసు (నైనీ కార్నర్డ్ సరసు) నైనితాల్ నుండి 4కిలోమీటర్లు దూరంలో అలాగే భీమ్‌తాల్ సమీపంలో 1,200 మీటర్లు (4,000 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ సరసు పొడవు దాదాపు 1 కిలోమీటర్ (0.62 మైళ్ళు) పొడవు, 0.5 కిలీమీటరు (0.31 మైల్), దాదాపు 40మీటర్లు (130 అడుగులు) లోతు ఉంటుంది. నైనితాల్ ప్రాంతంలో ఇది అత్యంత లోతైన సరసుగా భావించబడుతుంది.
హనుమాన్ ఘరీసవరించు
హనుమాన్ ఘరీ (దీనిని సాధారణంగా హనుమాన్ ఘర్ అంటారు) 1,951 మీటర్లు (6,401 అడుగులు) ఎత్తున ఉంది. ఈ ఆలయసమూహం టాలీతల్‌కు బస్‌స్టాండుకు 3.5 కిలోమీటర్లు (2.2 మీటర్లు) ఉంది. ఈ ఆలయంలో ప్రధానదైవం హనుమనుడు. హనుమంతుడు ఇక్కడ కన్నుల నిండా నీరు నింపుకుంటూ హృదయంలో సితారాములతో దర్శనం ఇస్తూ ఉంటాడు. కంచిలో ఆశ్రమం నిర్మించి నివసిస్తున్న నీం కరోలీ బాబా ఈ ఆలయం నిర్మించినట్లు ప్రతీతి.
ఘోరకల్సవరించు
నైనితాల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ప్రదేశాలో ఘోరకల్ ఒకటి. ఘోరకల్ అంటే గుర్రాల కొరకు నీటిమడుగు అని అర్ధం. ఇది 2000 మీటర్ల ఎత్తులో ఉన్న సుందరప్రదేశం.అక్కడ గిరిజనులు ఆరాధించే గొలుదేవత ఉపస్థితమై ఉన్న ప్రదేశంకూడా ఇదే. భౌవాలీ సమీపంలో ఉన్న ఈ ప్రదేశంలో సైనిక పాఠశాల (ఆర్మీ స్కూలు) ఉంది. దీనిని ఘోరకల్ సైనిక్ స్కూల్ అంటారు. ఇది రాంపుర్ నవాబు చాఏత్ 1966 ఘోరకల్ వద్ద నిర్మించబడింది. ఇక్కడి నుండి గొలుదేవత ఆలయదృశ్యం కనిపిస్తుంది.
అరబిందో ఆశ్రమంసవరించు
పచ్చనికొండలు కల కుమావొన్ వాలీలో అరబిందో ఆశ్రమం ఉంది. మార్కెట్ ప్రదేశము నుండి 1 కి.మీ.దూరంవుంటుంది. ఇది టూరిస్టులకు ముందస్తు అభ్యర్ధనతో వసతి సదుపాయంకల్పిస్తుంది. వసతిపొందే వారు ఇక్కడ యోగ, ధ్యానం వంటివి నేర్చుకోవచ్చు.
పాన్గోట్సవరించు
నైనితాల్ లోని పాన్గోట్ గ్రామంలో కల అందమైన పర్వత శ్రేణులను గౌనో హిల్స్ అంటారు. కాలి నడక మార్గాలు, ఈకొండలలో విజిటర్లను దట్టమైన అడవులలోకి తీసుకు వెళతాయి. ఇక్కడ కనుమరుగు అవుతున్న అనేక వృక్ష, పక్షి జాతులను మీరు చూడవచ్చు. ప్రకృతి ప్రియులకు, ఫోటో గ్రాఫి అభిలషించే వారికి ఈప్రదేశం ఎంతో బాగుంటుంది.
బారా బజార్సవరించు
బారా బజార్ మల్లితాల్ లో ఒక ప్రసిద్ధ మార్కెట్. ఈ మార్కెట్ లో కేండల్స్, కెన్ స్టిక్స్, ఇంకా ఇతర చిన్న వస్తువులు వుంటాయి. ఈ వస్తువుల కొనుగోలుకు టూరిస్టులు మాత్రమే కాక స్థానికులు సైతం అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తారు. ఇక్కడ అనేక రెస్టారెంట్ లు ఉన్నాయి. అవి మీకురుచికరమైన వంటకాలు అందిస్తాయి.
స్నోవ్యూసవరించు
స్నో దృశ్యం లేదా వ్యూ అనేది సముద్ర మట్టానికి 2270 మీటర్ల ఎత్తున కల ఒక అందమైన ప్రదేశం. ఇది నైనితాల్ టవున్ కు 2.5 కి.మీ.ల దూరంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు చేరాలంటే రోప్ వే లేదా వెహికల్ పై చేరవచ్చు. ఇది షేర్ -క- దండ అనే ఎత్తైన చిన్న కొండ పై వుంది అద్భుత హిమాలయ పర్వత శ్రేణులను చూపి పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.
గుహలతోటసవరించు
గుహల తోటను ఈకో గుహ గార్డెన్ అనికూడా అంటారు. ఈ గార్డెన్ పర్యావరణఆరధన జీవన విధానమాచరించే వారికి ఆసక్తిగావుంటుంది. దీనిలో ఆరు అండర్ గ్రౌండ్ గుహలు పెట్రోమాక్స్ దీపాలతో, ఒకమ్యూజికల్ ఫౌంటెన్ తో వుంటాయి. ఈ గుహలను టైగర్ కేవ్, పాంథర్ కేవ్, బాట్ కేవ్, స్క్విరాల్ కేవ్, ఫ్లై ఇంగ ఫాక్స్ కేవ్, ఏప్ కేవ్ అనిపిలుస్తారు. ఈగుహాలను కలిపే దోవ చాలా ఇరుకుగా వుంటుంది. కొన్ని చోట్ల సందర్శకులు పాక వలసి వస్తుంది. ఇవి ఇక్కడి స్థానిక పాలనా సంస్థ చే నిర్వహించ బడుతున్న సహజ గుహలు.
హార్స్‌రైడింగ్సవరించు
నైనితాల్ లో హార్స్ రైడింగ్ గొప్ప ఆకర్షణ. టవున్లో వివిధ ప్రదేశాలను చూసేందుకు గుర్రాలను రవాణాగా ఉపయోగిస్తారు. టవున్ లో హార్స్ రైడింగ్ నిషేధించినప్పటికి, పర్యాటకులు బారాపత్తర్ వద్ద దీనిని ఆనందించవచ్చు. గుర్రాల పేడ అక్కడి సరస్సును ప్రదేశాన్ని కలుషితం చేస్తోందని కోర్ట్ గుర్రాల వినియోగాన్ని నగరంలో నిషేధించింది. పర్యాటకులు అద్దె గుర్రాల పై రాం నగర్ నుండి అందమైన పిక్ నిక్ స్పాట్ టిఫిన్ టాప్ చేరేందుకు గుర్రాలను ఉపయోగించవచ్చు.
పాంగోట్సవరించు
పాన్గోట్ అనేది నైనితాల్ టవున్ కు 15 కి.మీ.లదూరంలోని ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం చేరేటపుడు పర్యాటకులు నైనా శిఖరం, స్నో వ్యూ, కిల్ బారిలు చూడవచ్చు. ఈ ప్రదేశం పక్షుల వీక్షణ (బర్డ్‌వాచింగ్) ఒక స్వర్గం. ఇక్కడ సుమారు 150 రకాల పక్షులు నివసిస్తాయి. సాధారణంగా గ్రిఫ్ఫోన్, బ్లూ వింగ్ మిన్లాస్, వంటివి కనపడతాయి.
గుర్నీ హౌస్సవరించు
గుర్నీ హౌస్ అనేది ఒక బ్రిటిష్ హంటర్, పర్యావరణ సంరక్షుడు అయిన జిమ్ కార్బెట్ నివాసం. అందమైన ఈ నివాసాన్ని ఆయన శారద ప్రసాద్ వర్మకు విక్రయించారు. ప్రస్తుతం ఇది నిరంజన్ దాల్మియా మనుమరాలు అధీనంలో ఉంది. ఈ హెరిటేజ్ (వారసత్వ) భవనం చూసేందుకు యజమానులు పర్యాటకులను ముందస్తు అనుమతులతో ఆహ్వానిస్తారు. కార్బెట్ కు సంబంధించిన ఎన్నో వస్తువులను ఇక్కడ చూడవచ్చు.
సరియతాల్సవరించు
సరియతాల్ నైనితాల్ టవున్ కు 5 కి.మీ.ల దూరంలో కల సరియా తాల్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈప్రదేశంలో ఒక చిన్న అందమైన సరస్సు, ఒక ఫౌంటెన్ ఉన్నాయి.
టండి సడక్సవరించు
టండి సడక్ అనేది ఒక ప్రశాంత మైన రోడ్. ఇది సరస్సు పక్క ఉంది. టూరిస్టులు ఇక్కడ పచ్చటి పైన్, దేవదర్, ఓక్ వృక్షాల నీడలో నడచి ఆనందించవచ్చు. చెట్ల నుండి వచ్చే చల్లటి తాజా గాలి, పక్షుల కూతలు టూరిస్టులకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి.
పారా గ్లైడింగ్సవరించు
నైనితాల్ లో పర్యాటకులకు పారా గ్లైడింగ్ క్రీడ ప్రసిద్ధి. బాగా ఆనందిస్తారు. నౌకు చియాతల్ ప్రదేశంలో పర్యాటకులు పైలట్‌లు, నిపుణుల సహాయంతో పారాగ్లైడింగ్ ఆచరించవచ్చు. ఆకాశం నిర్మలంగా వుండే సమయం మార్చి నుండి జూన్ వరకు, అక్టోబరు నుండి డిసెంబరు వరకు ఈ సాహస క్రీడకు అనుకూలంగా ఉంటుంది.
బోటు హౌస్సవరించు
బోటు హౌస్ క్లబ్ ఇండియాలో రెండవ పురాతన క్లబ్. దీనిని నైని లేక్ కు ఉత్తర దిశగా 1890లో స్థాపించారు. ఈ క్లబ్ లో సభ్యత్వం సొసైటీ లోని ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం. ఈ క్లబ్ సరస్సు లోని యాచింగ్ ప్రధానంగా నిర్వహిస్తుంది. పర్యాటకులు ఇక్కడ కల బార్ లో తాత్కాలిక రుసుము చెల్లించి విశ్రాంతి పొందవచ్చు. బిలియర్డ్స్ ఆడవచ్చు. జూన్ నెలలో యాచింగ్ పండుగ నిర్వహిస్తారు. ఇదే సమయంలో ఈ పండుగ ఇంగ్లాండ్ లోకూడా జరగటం ఒక విశేషం.
టిఫిన్ టాప్సవరించు
టిఫిన్ టాప్ అనేది ఒక అందమైన ప్రదేశం దీనిని దోరోతీ సీట్ అనికూడా అంటారు. ఈ ప్రదేశం ఆయర్ పట్టా శిఖరం పై సముద్ర మట్టానికి 7520 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ నుండి పర్యాటకులు అద్భుత హిమాలయ శ్రేణులను చూడవచ్చు. ఈప్రదేశం డొరొతి కేల్లేట్ అనే ఒక ఇంగ్లీష్ ఆర్టిస్ట్ భర్త చే ఆమె ఒక ప్లేన్ దుర్ఘటనలో మరణించిన చిహ్నంగా ఏర్పరచ బడింది. టిఫిన్ టాప్ లో ఫోటోగ్రఫీ ప్రసిద్ధి. ఈప్రదేశం నైనితాల్ టవున్ కు 4 కి.మీ.ల దూరంలో ఉంది.దీనిని హైకింగ్ లో చేరవచ్చు.
జంతుప్రదర్శన శాలసవరించు
నైనితాల్ లో సముద్ర మట్టానికి 2100 మీటర్ల ఎత్తున ఉన్న జంతుప్రదర్శనశాల (జూ) ఒక గొప్ప ఆకర్షణ. ఇది నైనితాల్ బస్సు స్టాప్ కు ఒక కి.మీ.దూరంలో వుంటుంది. ఈ జూలో హిమాలయ బ్లాకు బేర్, మంకీ లు, సైబీరియన్ టైగర్, చిరుత, తోడేలు, పం సివెట్ వంటి జంతువులు ఎన్నో ఉన్నాయి. ఈ జూ సోమవారాలు, అన్ని జాతీయ సెలవు దినాలు మూసి వేసి వుంటుంది.
ట్రెక్కింగ్సవరించు
నైనితాల్ లో ట్రెక్కింగ్ ప్రసిద్ధి. టూరిస్టులు ఇక్కడ కల టిఫిన్ టాప్, నైనా శిఖరం వంటి గొప్ప ప్రదేశాలు పచ్చటి ప్రాంతాలలో నడచి ట్రెక్కింగ్ ద్వారా చూడవచ్చు. హోటల్స్, టూర్ నిర్వాహకులు ట్రెక్కింగ్, క్యాంపు పాకేజ్ లు సందర్శకులకు నిర్వహిస్తారు.
ఇతర ఆకర్షణలుసవరించు
నైనితాల్ లో రాజ్ భవన్, జూ, ది ఫ్లట్ట్స్, ది మాల్, సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చి, పాన్గోట్ లు ఇతర ప్రధాన ఆకర్షణలు. టండి సడక్, గుర్నీ హౌస్, ఖుర్పతాల్, గునో హిల్స్, అరబిందో ఆశ్రమం వంటి ప్రదేశాలు కూడా తప్పక చూడదగినవే. ఇంతేకాక, టూరిస్టులు ఇక్కడ హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్, బోటింగ్ వంటి వినోదాలలో కూడా ఆనందించవచ్చు. నైనితాల్ ను రోడ్, రైల్, ఎయిర్ మార్గాలలో దేశం లోని వివిధ ప్రాంతాల నుండి చేరవచ్చు. అందమైన ఈ ప్రదేశాన్ని అందరూ వేసవులలో సందర్శించేందుకు ఇష్టపడతారు.
సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చిసవరించు
సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చి ఒక ప్రశాంత ప్రదేశం. నైనితాల్ సరస్సు చివరలో ఉత్తరంగా మల్లితాల్ వద్ద ఉని. ఈ చర్చిని 1844లో నిర్మించారు. రికార్డుల మేరకు కలకత్తా బిషప్ అయిన దాని "అల్ విల్సన్" ఇక్కడకు విచ్చేశారు. ఆయన సందర్శనలో ఇక్కడ వ్యాదుగ్రస్థుడాయ్యాడు.. యా సమయంలో ఆయన ఒక అసంపూర్ణ నిర్మాణ నివాసంలో అడవిలో ఉండవలసి వచ్చింది. కనుక ఈ చర్చిని " సెయింట్ జాన్విల్దర్ నెస్ " అని పేరు వచ్చింది. 1880లో జరిగిన ల్యాండ్ స్లైడ్ దుర్ఘటన బాధితులకు ఈ చర్చి ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడ ఒక ఫలకంపై బాధితుల పేర్లు వ్రాసారు.
గోవింద వల్లభ మార్గసవరించు
ది మాల్ అనేది నైనితాల్ లో ఒక ప్రసిద్ధ రోడ్. దీనిని ఇటీవలే గోవింద వల్లభ మార్గ అనిపేరు మార్చారు. షాపులు, మార్కెట్ల తోపాటు, అనేక బ్యాంకు లు, ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈరోడ్డు మల్లితాల్ నుండి తల్లితాల్ వరకూ కలుపుతుంది. మరోక టూరిస్ట్ ఆకర్షణ అయిన తండి సడక్ నైని సరస్సుకు మరో వైపున ఉంది.
ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్సవరించు
" ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ " నైనితాల్ లో ఒక ప్రధాన ఆకర్షణ. ఈ సంస్థ మనోర శిఖరంపై నైనితాల్ కు 9 కి.మీ.ల దూరంలో ఉంది. ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఈ సంస్థ ఆసక్తి కల వారికి ముందస్తు అనుమతులతో వారి టెలీస్కోప్ లలో గ్రహాలను, నక్షత్రాలను పరిశీలించే అవకాశం ఇస్తుంది. ఈ సంస్థను 1955లో స్థాపించారు. 1961లో ఈ ప్రదేశానికి బదిలీ చేసారు. వివిధ ఖగోళ అంశాలపై ఈసంస్థ పరిశోధనలు చేస్తోంది. కృత్రిమ ఉపగ్రహాలను నియంత్రించే పని చేస్తోంది.
కాలుష్యంసవరించు
సమీపకాలంగా నైనితాల్ ప్రజలు సరికొత్త నిర్మాణాల కారణంగా నైనీసరదులో పెరుగుతున్న కాలుష్యం గురించి కలత చెందుతున్నారు. ఫలితంగా సరసు, పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పర్యావరణ కాలుష్య పరిమాణం గురించి పరిశీలించడానికి చర్యలు ఆరంభం అయ్యాయి. సరసును పారిశుధ్యం చేసి సరోవర ప్రాంతంలో అరణ్యం అభివృద్ధిచేయడానికి ప్రయత్నాలు మొదలైనప్పటికీ పర్యావరణం మీద వత్తిడి తగ్గించడానికి అది సరిపోవడం లేదు. నగరంలో అత్యధికమైన పర్యాటకులు, అత్యధిక సంఖ్యలో వాహనాలు ప్రవేశిస్తున్నాయి. అవి నగరంలో వాతావరణాన్ని కాలుష్యానికి గురి చేస్తున్నాయి. ఉదాహరణగా ప్రైశీతాకాలంలో ననీతాల్ సరసులో వందలకొద్దీ మత్స్యాలు మృతిచెందుతున్నాయి. 2006లో కూడా ఇలాంటి సంభవం జరిగింది. నైనితాల్ సరసు 26 మీటర్ల లోతు ఉంటుంది. నిపుణుల అంచనాల ప్రకారం సరసులో మత్స్యాలు జీవించడానికి అవసరమైన ప్రాణవాయువు ప్రమాణం తగ్గుతూ ఉంది. ఇది చట్టవ్యతిరేకంగా చెత్తను సరసులో చేర్చుతున్న కారణంగా జరుగుతుందని ఊహిస్తున్నరు. ఈ కాలుష్య ప్రభావం శీతాకాలంలో మరింత ఎక్కువై సరసులో ప్రాణవాయు ప్రభావాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. సరసులో కృత్రిమంగా ప్రాణవాయువును అభివృద్ధిచేయడం ద్వారా ఈ సమద్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారు. సమీపకాలంలో ప్రజలలో అప్రమత్తత అధికమై నగరంలోని కాలుష్యం తగ్గించి సౌందర్యవంతంగా మార్చడానికి ముందుకు వస్తున్నారు. 2007 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18 తాతీఖున " క్లీనప్ నైనితాల్ బేషనల్ డే "గా ఆచరిస్తున్నారు. 1880లో 151 మందిని బలిగొన్న భూ ఊచకోతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేకత దినాన్ని ఆచరిస్తున్నారు. ఈ ప్రత్యేక చారిత్రాత్మక దినంలో విద్యార్థులు ఇతర పౌరులు చేతులు కలిపి నగరాన్ని శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం మహిళల ప్రత్యేక బృందమైన మైత్రి సేవా సంస్థ ప్రతి 18వ తారీఖున పారిశుద్ధ కార్యక్రమం ఆచరిస్తున్నారు. ఇది ప్రేరణగా తీసుకుని జిల్లా మింసిపాలిటీ, జిల్లా నిర్వహళాధికారులు " మిషన్ బటర్ ఫ్లై " పేరిట పారిశుద్ధ కార్యక్రమాలను ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్తనిర్వహణ, లేక్ వార్డెన్ పనులకు సిబ్వందిని నియమిస్తున్నారు. సమీకాలంలో ప్రభుత్వం, ప్రాంతీయ పర్యావరణ సంఘాల సాయంతో సరసులో ప్రాణవాయువు పరిమాణం పెంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సరోవర జలాలలో ప్రణాళిక ప్రధాన ఉద్దేశం బయోలజికల్ ఆక్సిజన్ డిమాండును తగ్గించడమే. ఈ సమస్యను అధిగమించడానికి సరసు అంతటా హైప్రెషర్ జెట్స్ ఏర్పాటు చెయ్యబడ్డాయి. గొలుదేవతా ఆలయసమీపంలో ఉన్న కంప్రెషర్ల సాయంతో ఈ ప్రెషర్ జెట్లు అధిక వత్తిడితో వాయువులను ప్రసరించడం ద్వారా సరోవర జలాలను శుభ్రపరుస్తున్నాయి. ప్రస్తుతం సరోవర జలాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. ఈ కాత్యక్రమాన్ని విజయవంతం చేయడానికి " గోవింద్ వల్లభ్‌పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలనీ " శాస్త్రవేత్త పత్నాగర్ సహకారం ఎంతో ఉంది. ప్లాంక్టన్, అలిగేలను ఆహారంగా తీసుకునే పలు చేపజాతులు సరసులో ప్రవేశపెట్టబడ్డాయి. ఇది పారిశుద్ధ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసాయి. ప్రస్తుతం సరసు ఉపరితలంలో మృతమత్స్యాలకు బదులుగా వర్ణరంజితమైన చేపలు దర్శనం ఇస్తున్నాయి.
వాతావరణంసవరించు
పర్యటనకు ఉత్తమ సమయం నైనితాల్ కు సంవత్సరంలో ఎపుడైనా అనుకూలమే. అయితే వేసవి కాలంలో వాతావరణం ఆహ్లాదకరం కనుక సందర్శన అనుకూలంగా వుండి సైట్ సీయింగ్ మరింత అనుకూలిస్తుంది.
వేసవిసవరించు
సంవత్సరమంతా అనుకూలమైన వాతావరణం కలిగిన నైనితాల్ పట్టణం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఔఇనప్పటికీ పర్యటన చేయడానికి వేసవి కాలం అనుకూలంగా ఉంటుంది. వేసవి నైనితాల్ లో వేసవి మార్చిలో మొదలై మే వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠం 27 డిగ్రీలు కనిష్ఠం 10 డిగ్రీలుగా వుంటుంది. మొత్తంగా వాతావరణం ఎంతో ఆహ్లాదంగా వుంది పర్యాటకులను ఆనందింప చేస్తుంది.
వర్షాకాలంసవరించు
వర్షాకాలం నైనితాల్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబరు వరకూ వుంటుంది. వర్షాలు ఈ ప్రాంతంలో ఒక మోస్తరుగా వుంటాయి.
చలికాలంసవరించు
శీతాకాలం నైనితాల్ లో శీతాకాలం నవంబరు లోమోదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠం 15 డిగ్రీలు కనిష్ఠం జీరో డిగ్రీలు గాను వుంటుంది .
ప్రయాణసౌకర్యాలుసవరించు
రోడ్డు ప్రయాణంసవరించు
నైనితాల్ చేరేందుకు టూరిస్టులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఉపయోగించవచ్చు. ప్రైవేటు వోల్వో బస్సులు కూడా ఢిల్లీ నుండి వుంటాయి. అల్మోర, రానిఖేట్, బద్రినాథ్ ల నుండి నైనితాల్ కు సెమి డీలక్స్, డీలక్స్ బస్సులు కూడా ఉన్నాయి.
ట్రైన్ ప్రయాణంసవరించు
నైనితాల్ కు సుమారు 23 కి. మీ.ల దూరం లోని కాత్గోడం రైల్వే స్టేషను సమీప రైలు స్టేషను. ఈ రైలు స్టేషను నుండి లక్నో, ఆగ్రా, బారేలీ లకు ట్రైన్ లు ఉన్నాయి. రైలు స్టేషను నుండి నైనితాల్ కు టాక్సీ లలో చేరవచ్చు.
విమాన ప్రయాణంసవరించు
పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ నైనితాల్ కు సమీప ఎయిర్ పోర్ట్. ఇది నైనితాల్ కు 55 కి. మీ. కల దూరంలో ఉంది. ఈ ఎయిర్ పోర్ట్ నుండి న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు విమానాలు ఉన్నాయి. ఇక్కడ నుండి ఇండియా లోని ఏ ప్రదేశానికి అయినా వెళ్ళవచ్చు. టూరిస్టులు 251 కి. మీ.ల దూరంలోని డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి కూడా నైనితాల్ చేరవచ్చు. 299 కి. మీ.ల దూరం లోని ఆగ్రా లోని ఖేరియా ఎయిర్ పోర్ట్ ద్వారా కూడా నైనితాల్ చేరవచ్చు.
చిత్రమాలికసవరించు
వెలుపలి లింకులుసవరించు
- "అద్భుత ఉద్యానవనం (జివ్గు కార్బెట్ నేషనల్ పార్క్)". సూర్య. 2013-08-20. Retrieved 2014-01-30.[permanent dead link]
మూలాలుసవరించు
- ↑ Nainital District [The Imperial Gazetteer of India] volume 18, pp. 322–323. 1908
- ↑ (Pilgrim 1844)
- ↑ 3.0 3.1 3.2 (Murphy 1906)
- ↑ "Kumaun University". Archived from the original on 2010-02-05. Retrieved 2020-01-08.
- ↑ (Kennedy 1996)
- ↑ File:View of Mallital, without the present Naina Devi Temple, Nainital, 1865.jpg British Library .
- ↑ File:View of Nainital, from the South East (Tallital side), 1865.jpg British Library.
- ↑ Census of India. Censusindia.gov.in (14 May 2012).