సోనీ మోలోనీ

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు

డెనిస్ ఆండ్రూ రాబర్ట్ " సోనీ " మోలోనీ (1910, ఆగస్టు 11 - 1942, జూలై 15) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 1937లో ఇంగ్లాండ్ పర్యటనలో మూడు టెస్టులు ఆడాడు.

సోనీ మోలోనీ
1937లో ఇంగ్లండ్‌లో మోలోనీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డెనిస్ ఆండ్రూ రాబర్ట్ "సోనీ" మోలోనీ
పుట్టిన తేదీ(1910-08-11)1910 ఆగస్టు 11
డునెడిన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ1942 జూలై 15(1942-07-15) (వయసు 31)
ఎల్ అలమీన్, బ్రిటీష్-ఆక్రమిత ఈజిప్ట్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 30)1937 26 June - England తో
చివరి టెస్టు1937 14 August - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1929–30 to 1934–35, 1938–39 to 1939–40Otago
1935–36 to 1937–38Wellington
1940–41Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 3 64
చేసిన పరుగులు 156 3219
బ్యాటింగు సగటు 26.00 28.74
100లు/50లు 0/1 2/16
అత్యధిక స్కోరు 64 190
వేసిన బంతులు 12 5176
వికెట్లు 0 95
బౌలింగు సగటు 33.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/23
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 35/–
మూలం: Cricinfo, 2017 1 April

జననం, విద్య మార్చు

మోలోనీ 1910, ఆగస్టు 11న డునెడిన్‌లో జన్మించాడు. ఒటాగో బాయ్స్ హైస్కూల్‌లో చదువుకున్నాడు. అక్కడ క్రికెట్, రగ్బీ, అథ్లెటిక్స్‌లో పాఠశాలకు ప్రాతినిధ్యం వహించాడు.[1]

క్రికెట్ రంగం మార్చు

మిడిల్ ఆర్డర్ లేదా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, లెగ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. సోనీ మోలోనీ 1929 నుండి 1941 వరకు న్యూజీలాండ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు 190. 1937 ఫిబ్రవరిలో ఆక్లాండ్‌పై వెల్లింగ్‌టన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.[2] మూడు నెలల తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీపై 23 పరుగులకు 5 వికెట్లు తీసి, తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించాడు.[3]

మొలోనీ 1937లో న్యూజీలాండ్ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు, మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. ఆల్బీ రాబర్ట్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించాడు.[4] పర్యటనలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళలో ఒకడు, 26 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 34.83 సగటుతో 1463 పరుగులు చేసి, 26.68 సగటుతో 57 వికెట్లు తీసుకున్నాడు.[5] 1938-39లో సర్ జూలియన్ కాన్స్ XI తో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[6]

ఉద్యోగం మార్చు

మోలోనీ డునెడిన్‌లో భీమా గుమస్తాగా పని చేస్తున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో సేవ చేయడానికి చేరాడు.[7]

మరణం మార్చు

1942, జూలై 15న రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటి ఎల్ అలమీన్ యుద్ధంలో మరణించాడు.[8] మరణించే సమయంలో 20 పదాతిదళ బెటాలియన్‌లో లెఫ్టినెంట్‌గా ఉన్నాడు. ఎల్ అలమెయిన్ వార్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.[8][7]

మూలాలు మార్చు

  1. . "Personalities in Sport: No. XXVI: D. A. R. Moloney".
  2. "Auckland v Wellington 1936-37". Cricinfo. Retrieved 12 October 2021.
  3. "Cambridge University v New Zealanders 1937". Cricinfo. Retrieved 12 October 2021.
  4. "1st Test, Lord's, Jun 26 - 29 1937, New Zealand tour of England". Cricinfo. Retrieved 12 October 2021.
  5. Don Neely & Richard Payne, Men in White: The History of New Zealand International Cricket, 1894–1985, Moa, Auckland, 1986, p. 166.
  6. "New Zealand v Sir J Cahn's XI 1938–39". CricketArchive. Retrieved 6 September 2017.
  7. 7.0 7.1 "Denis Andrew Robert Moloney". Online Cenotaph. Retrieved 11 October 2021.
  8. 8.0 8.1 "Lieutenant MOLONEY, DENIS ANDREW ROBERT". Commonwealth War Graves Commission. Retrieved 21 May 2019.

బాహ్య లింకులు మార్చు