సోమంచి యజ్ఞన్న శాస్త్రి

సోమంచి యజ్ఞన్న శాస్త్రి తెలుగు కథ, నవల, నాటక రచయిత. బొంబాయి ఆంధ్ర మహాసభ నిర్వహణలో ముఖ్యపాత్ర వహించాడు.[1]

సోమంచి యజ్ఞన్న శాస్త్రి
జననం1913, నవంబరు 3
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధితెలుగు కథ, నవల, నాటక రచయిత
తండ్రిసీతారామయ్య
తల్లివరలక్ష్మీ

జననం - ఉద్యోగం

మార్చు

యజ్ఞన్న శాస్త్రి 1913, నవంబరు 3న సీతారామయ్య, వరలక్ష్మీ దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరులో జన్మించాడు. ముంబాయి నగర మునిసిపల్ కార్పోరేషన్ డిప్యూటీ కమిషనరుగా పనిచేశాడు.

సాహిత్యరంగం

మార్చు

శాస్త్రి రచించిన కథలు, వ్యాసాలు ఇంగ్లీషులోకి అనువాదం చేయబడి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడ్డాయి.[2]

నాటకరంగంలో స్థితిగతుల గురించి, ప్రదర్శనలో జరిగే లోపాల గురించి, నటీనటుల వల్ల నాటక ప్రదర్శన సరిగా రాకపోవడం గురించి వివరించే నాటికలు ఎక్కువగా రాశాడు. భమిడిపాటి కామేశ్వరరావు రచన స్ఫూర్తితో యజ్ఞన్నశాస్త్రి కూడా హాస్య రచనలు చేశాడు. ఈ హస్య నాటికలు మాత్రమే ప్రదర్శన చేయబడ్డాయి.[3]

రచించినవి

మార్చు

నాటకాలు

  1. కళ్యాణి (1947)- మాటర్ లింక్ రాసిన మోననావా
  2. మహానుభావులు (1957) - గోగోల్ రాసిన ఇన్స్పెక్టర్ జనరల్ (1936)
  3. న్యాయం - గాల్స్ వర్డీ రాసిన జస్టీస్ (1910)
  4. విశ్వం పెళ్లి (1949) - బెర్నార్డ్ షా మాన్ అండ్ సూపర్ మాన్ (1930)
  5. పాపం సోకని పతనం (1970) - ప్లాటస్ రాసిన ఆంఫిట్రియోన్
  6. యమునా తీరే ఎవరికి వారే (1954)
  7. పెద్దమనుషులు (1954)
  8. మాయ నొప్పులు (1955)
  9. పేరయ్య రాజంట
  10. రంగ భూమి
  11. ఓ మనిషి నూతిలో పడితే
  12. ఈ సంసారం
  13. లోకులు కాకులు
  14. రిహార్సలు
  15. ప్రదర్శనము
  16. ఆంధ్రనాటకరంగానికి జై
  17. వస్తుందండి రాష్ట్రం రాకేం జేస్తుంది
  18. కట్నం కోరని కళ్యాణం
  19. కాలక్షేపానికి

కథలు

  1. లంచం పట్టిన ఆఫీసరు
  2. లాభం చేసిన గొల్లది
  3. సంఘం కోసం చందాలు[4]

పురస్కారాలు

మార్చు
  1. ఉత్తమ నాటక రచయితగా కీర్తి పురస్కారం - కీర్తి పురస్కారాలు (1992), తెలుగు విశ్వవిద్యాలయం, 1992.[5]

ఇతర వివరాలు

మార్చు
  1. ముంబైలో ఆంధ్రమహాసభ కార్యవర్గ సభ్యుడుగా, విద్యాసంఘ సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించాడు.
  2. లఖ్‌నవూలో జరిగిన అభ్యుదయ రచయితల సమావేశానికి అబ్బూరి రామకృష్ణారావుతో కలిసి పాల్గొన్నాడు.[6]

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఇతర రాష్ట్రాలు (28 February 2014). "త్రిముఖ పోటీ!". Sakshi. Archived from the original on 4 ఏప్రిల్ 2020. Retrieved 4 April 2020.
  2. సోమంచి యజ్ఞన్న శాస్త్రి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 471.
  3. శ్రీ సోమంచి యజ్ఞన్న శాస్త్రి, తెలుగు నాటక వెలుగులు, గండవరం సుబ్బరామిరెడ్డి, ధరణి ప్రింటర్స్ హైదరాబాదు, డిసెంబరు 2016, పుట. 215.
  4. విశాలాంధ్ర, సాహిత్యం (28 October 2012). "ధీరోదాత్తతకన్నా ధీరోద్ధత పాత్రలకే పాచుర్యం". Retrieved 4 April 2020.[permanent dead link]
  5. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "కీర్తి పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 4 April 2020.
  6. తెలుగు వెలుగు, వ్యాసాలు (2 December 2019). "అభ్యుదయ కామన... సాహితీ చేతన". www.teluguvelugu.in. ఆర్వీ రామారావ్‌. Archived from the original on 4 ఏప్రిల్ 2020. Retrieved 4 April 2020.

ఇతర లంకెలు

మార్చు