ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం)


ఇన్‌స్పెక్టర్ జనరల్ రెంటాల గోపాలకృష్ణ తెలుగులోకి అనువదించిన సాంఘీక నాటకం. రష్యన్ నాటక రచయిత నికోలాయ్ గోగోల్ రాసిన ఇన్‌స్పెక్టర్ జనరల్ నాటకం ఈ రచనకు మాలం.[1]

ఇన్‌స్పెక్టర్ జనరల్
కృతికర్త: రెంటాల గోపాలకృష్ణ (అనువాదం), నికోలాయ్ గోగోల్ (రష్యన్ భాష)
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ
విడుదల: ఏప్రిల్, 1956
పేజీలు: 100

కథానేపథ్యం

మార్చు

ప్రజాస్వామ్యంలో పాలకుల అవినీతి, అలసత్వం, లంచాలు వంటి అంశాలు ప్రతిబింబించేలా ఈ నాటకం రాయబడింది.

పాత్రలు

మార్చు
 1. చైనులు: తాలుకా ప్రధానోద్యోగి
 2. వసంతకుమార్: ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న చిన్న గుమాస్తా
 3. పాకకాలునాయుడు: సబ్ మాజిస్ట్రేటు
 4. కైలాసరావు: డాక్టరు
 5. హయగ్రీవఅయ్యవార్లు: హైస్కూలు హెడ్మాస్టరు
 6. కాంతయ్య: పోస్టుమాస్టరు
 7. పరాంకుశం: సబ్ ఇన్‌స్పెక్టరు
 8. మిరియాలు: షావుకారు
 9. ధనియాలు: షావుకారు
 10. భూమయ్య: వర్తక వ్యాపారుడు
 11. శేషయ్య: వర్తక వ్యాపారుడు
 12. చక్రపాణి: వసంతకుమార్ స్నేహితుడు, సేవకుడు
 13. సుబ్బన్న: చైనులు ఇంట్లో నౌకరు
 14. బిళ్ళబంట్రోతు: ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చిన సేవకుడు
 15. కోయిలమ్మ: చైనులు భార్య
 16. తిలకమ్మ: చైనులు కూతురు

ఇతర వివరాలు

మార్చు
 1. ఏబీకె ప్రసాద్ సూచనతో అంతా పెద్దలే అని పేరు పెట్టడం జరిగింది.
 2. రంగస్థల, సినిమా నటుడు వల్లం నరసింహారావు ప్రధాన పాత్ర పోషించాడు.
 3. సినీ నిర్మాతలు ఏడిద నాగేశ్వరరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, నటుడు హరనాథ్ తదితరులు ఈ నాటక ప్రదర్శనలు చేశారు.

మూలాలు

మార్చు
 1. ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14

ఇతర లంకెలు

మార్చు