సౌత్ జోన్ మహిళల క్రికెట్ జట్టు

సౌత్ జోన్ (దక్షిణ మండల) మహిళల క్రికెట్ జట్టు మహిళల సీనియర్ అంతర మండల ఒకరోజు పోటీలు, T20 లు ఆడటానికి ఉద్దేశించబడ్డ జట్టు. ఇది దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల క్రికెట్ జట్టు. దక్షిణ భారతదేశంలోని ఆరు జట్లకు చెందిన క్రీడాకారులతో కూడిన మిశ్రమ జట్టు: ఆంధ్రా, గోవా, హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఈ జట్టును రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆడటానికి 1974-75లో ఏర్పాటు చేసారు. పోటీలు ముగిసే వరకు 2002-03 వరకు ఈ జట్టు ఆడింది. తర్వాత ఒక రోజు పోటీలలో పాల్గొన్నారు, ఆ తరువాత మూడు రోజుల పోటీలో 2017 –18లో చివర రోజు పోటీలో రన్నరప్‌గా నిలిచింది.[1]

దక్షిణ మండల మహిళా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్స్నేహ దీప్తి
జట్టు సమాచారం
చరిత్ర
IZODC విజయాలు0
IZ3D విజయాలు0
IZT20]] విజయాలు0
IZOD]] విజయాలు0

చరిత్ర

మార్చు

దక్షిణ మండల మహిళల క్రికెట్ జట్టు మొదట రాణి ఝాన్సీ ట్రోఫీని 1974–75 లిస్ట్ A పోటీలో ఆడింది. 2002-03 సీజన్ తర్వాత రద్దు అయ్యే వరకు ఆ జట్టు టోర్నమెంట్‌లో ఆడింది. అయితే ట్రోఫీకి సంబంధించిన పూర్తి ఫలితాలు నమోదు కాలేదు.[2]

2007లో, సౌత్ జోన్ ఇంటర్ జోన్ మహిళల వన్డే పోటీలో ఆడటం ప్రారంభించింది, వారు 2006-07 నుండి 2013-14 సీజన్ తర్వాత ముగిసే వరకు పోటీ పడ్డారు.[2] ఈ పోటీలలో వారికి అత్యుత్తమ ఫలితాలు 2006-07, 2012-13లో వచ్చాయి, వారు రన్నరప్‌గా నిలిచారు.[3][4]

2014–15 సీజన్‌లో రెండు రోజుల పోటీలో 5 జట్లతో పాల్గొని మొదటి సీజన్‌లో దక్షిణ మండలం 6 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది.[5] తరువాత 2015–16 టోర్నమెంట్ మూడు రోజుల పోటీగా మారింది దక్షిణ మండల జట్టు 8 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది.[6] అయితే 2016–17లో, ఆ జట్టు తమ నాలుగు మ్యాచ్‌లలో మూడింటిని ఓడి, లీగ్‌లో దిగువ స్థానంలోకి దిగింది.[7] తరువాతి సీజన్‌లో వారు తిరిగి నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచి రెండవ స్థానం సంపాదించింది.[8]

2022–23లో, భారతదేశంలో మహిళల సీనియర్ అంతర మండల T20 క్రికెట్ పోటీలు తిరిగి మొదలయ్యాయి.[9] టోర్నమెంట్ లో ఆడే ఆరు జట్లలో మొదటి ఎడిషన్‌లో దక్షిణ మండలం జట్టు మూడవ స్థానంలో నిలిచింది.[10] 2023 ఫిబ్రవరిలో, 2022–23 ఒక రోజు టోర్నమెంట్ లో ఈ జట్టు గ్రూప్ దశలో నాల్గవ స్థానంలో నిలిచింది.[11]

ఆటగాళ్ళ బృందం

మార్చు

2022–23 సీజన్ కోసం ప్రకటించిన జట్టు ఆధారంగా. బోల్డ్‌లో ఉన్న ఆటగాళ్లకు అంతర్జాతీయ టోపీ (క్యాప్‌) లు ఉంటాయి.[9][12]

పేరు జాతీయత దేశీయ జట్టు గమనికలు
స్నేహ దీప్తి   భారతదేశం ఆంధ్ర కెప్టెన్
సదానందన్ అక్షయ   భారతదేశం కేరళ
బారెడ్డి అనూష   భారతదేశం ఆంధ్ర
సుందరేశన్ అనూష   భారతదేశం తమిళనాడు
అర్షి చౌదరి   భారతదేశం తమిళనాడు
జయకుమార్ దీప్తి   భారతదేశం కేరళ
గణేష్ దివ్య   భారతదేశం కేరళ
శరణ్య గద్వాల్   భారతదేశం ఆంధ్ర
యువశ్రీ కార్తికేయ   భారతదేశం పాండిచ్చేరి
సత్యమూర్తి కీర్తన   భారతదేశం తమిళనాడు
మడివాళ మమత   భారతదేశం హైదరాబాద్
మిన్ను మణి   భారతదేశం కేరళ
అపర్ణ మోండల్   భారతదేశం తమిళనాడు వికెట్ కీపర్
నిరంజన నాగరాజన్   భారతదేశం తమిళనాడు
తనయ నాయక్   భారతదేశం గోవా
లక్ష్మీనారాయణ నేత్ర   భారతదేశం తమిళనాడు
ఎల్లుట్ల పద్మజ   భారతదేశం ఆంధ్ర
శిఖా పాండే   భారతదేశం గోవా
మోనికా పటేల్   భారతదేశం కర్ణాటక
శ్రేయాంక పాటిల్   భారతదేశం కర్ణాటక
సజీవన్ సజన   భారతదేశం కేరళ
సూర్య సుకుమార్   భారతదేశం కేరళ
పూజా వంక   భారతదేశం హైదరాబాద్
చందు వెంకటేశప్ప   భారతదేశం కర్ణాటక
దినేష్ బృందా   భారతదేశం కర్ణాటక

సీజన్లు

మార్చు

అంతర మండల మహిళల మూడు రోజుల పోటీలు

మార్చు
బుతువు లీగ్ స్టాండింగ్‌లు [13] గమనికలు
P W L DWF DLF ND BP Pts Pos
2014–15 4 0 0 1 2 1 0 6 4వ
2015–16 4 0 0 2 2 0 0 8 3వ
2016–17 4 0 3 1 0 0 0 3 5వ
2017–18 4 2 1 0 1 0 0 13 2వ

మహిళల సీనియర్ అంతర మండల T20 పోటీలు

మార్చు
బుతువు లీగ్ స్టాండింగ్‌లు గమనికలు
P W L T NR NRR Pts Pos
2022–23 5 3 2 0 0 +1.421 12 3వ

మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలు

మార్చు
బుతువు లీగ్ స్టాండింగ్‌లు గమనికలు
P W L T NR NRR Pts Pos
2022–23 5 2 3 0 0 +0.394 8 4వ

గౌరవాలు

మార్చు
  • మహిళల అంతర మండల ఒక రోజు పోటీలు :
    • విజేతలు (0) :
    • ఉత్తమ ముగింపు: రన్నర్స్-అప్ (2006–07 & 2012–13)
  • సీనియర్ మహిళల క్రికెట్ అంతర మండల మూడు రోజుల ఆట :
    • విజేతలు (0) :
    • ఉత్తమ ముగింపు: రన్నర్స్-అప్ ( 2017–18 )
  • మహిళల సీనియర్ అంతర మండల T20 పోటీలు:
    • విజేతలు (0) :
    • ఉత్తమ ముగింపు: 3వ ( 2022–23 )
  • మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలు :
    • విజేతలు (0) :
    • ఉత్తమ ముగింపు: 4వ ( 2022–23 )

ప్రస్తావనలు

మార్చు
  1. "Team Profile: South Zone Women (India)". CricketArchive. Retrieved 26 July 2021.
  2. 2.0 2.1 "Women's List A Matches Played by South Zone Women". CricketArchive. Retrieved 29 July 2021.
  3. "Inter Zone Women's One Day Competition 2006/07". CricketArchive. Retrieved 29 July 2021.
  4. "Inter Zone Women's One Day Competition 2012/13". CricketArchive. Retrieved 29 July 2021.
  5. "Inter Zone Women's Two Day Competition 2014/15". CricketArchive. Retrieved 29 July 2021.
  6. "Inter Zone Women's Three Day Competition 2015/16". CricketArchive. Retrieved 29 July 2021.
  7. "Inter Zone Women's Three Day Competition 2016/17". CricketArchive. Retrieved 29 July 2021.
  8. "Inter Zone Women's Three Day Competition 2017/18". CricketArchive. Retrieved 29 July 2021.
  9. 9.0 9.1 "Senior Women's Inter Zonal T20 Trophy 2022: Full squads, Fixtures & Preview: All you need to know". CricketWorld. 7 November 2022. Retrieved 9 November 2022.
  10. "Senior Women's Inter Zonal T20". BCCI. Retrieved 17 November 2022.
  11. "Senior Women's Inter Zonal One Day". BCCI. Retrieved 22 February 2023.
  12. "Senior Women's Inter Zonal One Day Trophy, 2023/Squads". Cricket.com. Retrieved 22 February 2023.[permanent dead link]
  13. "Women's First-Class Matches Played by South Zone Women". Retrieved 29 July 2021.