స్కర్టు
స్కర్టు అనునది నడుము నుండి (లంగా వలె) వ్రేలాడుతూ కాళ్ళకు పూర్తిగా గానీ, కొంత భాగం గానీ ఆచ్ఛాదననిచ్చే ఒక పాశ్చాత్య వస్త్రము.
సాధారణంగా వీటిని స్త్రీలు ధరించిననూ, (స్కాట్లండు, ఐర్లండు వంటి) కొన్ని దేశాలలో పురుషులు కూడా వీటిని ధరిస్తారు.
కొన్ని కాలాలలో కొంత మంది వనితలు (ఉదా: రాణులు/మహారాణులు) మూడు మీటర్ల వ్యాసం ఉన్న పాదాల వరకు అచ్చాదననిచ్చే స్కర్టులని ధరించటం ఒక వైపు అయితే, 1960 లలో వచ్చిన మినిస్కర్టులు ప్యాంటీల కంటే కొద్దిగా పెద్దవిగా మాత్రం ఉండేవి.
స్కర్టులలో రకాలు
మార్చు- స్ట్రెయిట్/పెన్సిల్ :
- ఫుల్ :
- షార్ట్ :
- బెల్ ఆకారం :
- ఎ-లైన్ :
- ప్లీటెడ్:
- సర్కిల్ :
- హాబుల్ :
లెహంగా
మార్చులెహంగా/ఘాగ్రా అనునది భారతీయ వనితలు ధరించే పొడవాటి, ప్లీటులు, ఎంబ్రాయిడరీలు కలిగిన స్కర్టు. ఇది ఘాగ్రా ఛోళీలో ఒక భాగము. ఉత్తర భారతదేశం, పాకిస్థాన్ లలో దీని వాడకం ఎక్కువ.
లంగా
మార్చులంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తులలో ఒకటి. లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) .
పెళ్ళైనవారు చీర లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇవి సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.
అయితే పెళ్ళికి ముందు లంగా ఓణిలు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో పట్టుతో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.
వివిధ శైలుల్లో స్కర్టు
మార్చు-
ఎ-లైన్ స్కర్టు
-
డ్రిండిల్
-
జీన్స్ మిని స్కర్టు
-
కిల్టు
-
మైక్రో స్కర్టు
-
పెన్సిల్ స్కర్టు
-
పూడుల్ స్కర్టు
-
సంపోత్