గాగ్రా ఛోళీ లేదా లెహంగా ఛోళీ లేదా చనియా ఛోళీ అనునది రాజస్థాన్[1][2], గుజరాత్[3], మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో స్త్రీలు ధరించే సాంప్రదాయ్ దుస్తులు. లంగా, బిగుతుగా ఉండే ఛోళీ[4], దుపట్టాలు వీటిలో భాగాలు.

1872 లో గాగ్రా ఛోళీని ధరించిన స్త్రీలు.

రవికె లేదాచోలీ భారతదేశంలో స్త్రీలు శరీరం పై భాగాన్ని అనగా వక్ష స్థలమును కప్పుకోవడానికి వారికి తగిన విధముగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. దక్షిణ నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చీరలు ధరించే ఇతర ప్రదేశాలలో ధరిస్తారు. దీని మీద చీర యొక్క పైట భాగం కప్పుతుంది. ఆధునిక కాలంలో దీనిలోపల బ్రా కూడా ధరిస్తున్నారు. భారతదేశంలో ధరించబడే గాగ్రా ఛోళీలో కూడా ఇది ఒక భాగము. శరీరానికి హత్తుకునేంత బిగుతుగా చిన్న చేతులతోలో నెక్ తో చోళీని రూపొందిస్తారు. వక్ష స్థలము క్రింద నుండి నాభి వరకు బహిర్గతం అయ్యేలా కత్తిరించబడటం వలన దక్షిణాసియా వేసవులలో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి దక్షిణాసియా దేశాలలో స్త్రీలు ప్రధానంగా ధరించే పై వస్త్రాలు[5].

లెహంగా

మార్చు
 
భారతదేశంలో వేర్వేరు ప్రదేశాలకు చెందిన స్త్రీలు ధరించబడే వివిధ రకాల గాగ్రా ఛోళీ లు

లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తులు లో ఒకటి. లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) [6][7] .

పెళ్ళైనవారు చీర లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇవి సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.

అయితే పెళ్ళికి ముందు లంగా ఓణిలు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో పట్టుతో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.

తయారీలో ఉపయోగించే వస్త్రాలు

మార్చు

నూలు, ఖాదీ,[8] జార్జెట్, క్రేప్, నెట్, సాటిన్, బ్రొకేడ్, షిఫాన్[9] వంటి వివిధ రకాల వస్త్రాలతో రూపొందించిననూ పట్టుతో చేసిన లెహంగా లకే ప్రాముఖ్యత ఎక్కువ.

అలంకారాలు

మార్చు

గోటా, ఫుల్కారీ, షీషా, చికన్ కారి, జరీ, జర్దోజీ, నక్షీ, కుందన్ వంటి వివిధ కుట్టుపని, అల్లిక లతో లెహంగాని అలంకరిస్తారు[8].[10]

ఎదిగిన స్త్రీ కి ప్రతీకగా

మార్చు

దక్షిణ భారతదేశంలో (ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లలో), స్త్రీ పుష్పించిన సందర్భంగా జరిగే వేడుకకి అమ్మమ్మ తరఫు వారు ప్రదానం చేసే గాగ్రా ఛోళీకి రూపాంతరమైన లంగా ఓణిని, నాన్నమ్మ తరపు వారు చీర ప్రదానం చేసిన చీరని ధరిస్తారు. నామకరణానికి, అన్నప్రాశనకి అమ్మమ్మ తరపు నుండి లంగా ఓణిని అందుకొనటం మొదలవగా ఆ సాంప్రదాయం పుష్పించిన సమయంలో అందుకొనటంతో ఆఖరవుతుంది. అవివాహిత స్త్రీలకి ఇవి దక్షిణాన సాంప్రదాయిక దుస్తులు.

లౌంచారి

మార్చు

హిమాచల్ ప్రదేశ్కు చెందిన మహిళలు ధరించే గాగ్రా ఛోళీ మరొక రూపాంతరం లౌంచారి. ఛోళీ, లంగాలు కలిపి కుట్టబడిన లౌంచారి యొక్క లెహంగా పావడ కంటే తక్కువ పొడవు కలిగి ఉంటుంది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Rajasthan (district Gazetteers) - Rajsamand
  2. People of India: Rajasthan, Part 1 - K. S. Singh
  3. Gujarat, Volume 1 - Rash Bihari Lal, Anthropological Survey of India
  4. India perspectives, Volumes 3-4 - India,Ministry of External Affairs
  5. "What is a Choli?". WiseGEEK. Retrieved 21 March 2012.
  6. Fashions from India - Tom Tierney
  7. "Social Science a Textbook in History for Class IX as per New Syllabus - FK Publications". Archived from the original on 2014-01-07. Retrieved 2013-09-21.
  8. 8.0 8.1 Dhanwanti Keshavrao (October 8, 2005). "Dressed for dandiya". The Tribune. Retrieved 12 April 2012.
  9. Types of Indian Lehengas - nrigujarati.co.in
  10. "The latest fashion trends in saree collection - newsbycompany.com". Archived from the original on 2012-04-02. Retrieved 2013-09-21.

యితర లింకులు

మార్చు