స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్, అనేది ఒక ప్రధాన భారతీయ బ్యాంకు. భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఏడు అనుబంధ బ్యాంకులలో ఇది ఒకటి. ఇది 1966, ఏప్రిల్ 25 న ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ అనే రెండు బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకుకు ఈ పేరు ఏర్పడింది.[1]ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 850 కిపైగా శాఖలు ఉన్నాయి.ఇది 2017 మార్చి 31 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడింది.[1] 2015 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్ వివిధ ప్రాంతాలలో 1,360 శాఖలు నిర్వహణ కొనసాగిస్తుంది. ఇవి ఎక్కువగా భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. రాజస్థాన్ నుండి బ్రాంచ్ నెట్‌వర్క్ భారతదేశంలోని అన్ని ప్రధాన వ్యాపార కేంద్రాలను కవర్ చేసింది.1997 లో బ్యాంక్ 1,360,000 షేర్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌తో మూలధన మార్కెట్లోకి రూ. ఒక్కో షేరుకు 440 రూపాయలుగా ఉంది. 2015-16 సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ. 8.5 బిలియన్లుగా ఉంది.[2]
చరిత్రసవరించు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ 1943లో స్థాపించబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ 1944లో స్థాపించబడింది. ఈ రెండు బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్ అనే పేరు ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్, జైపూర్ పరిపాలనా ప్రధాన కార్యాలయం జైపూర్ (రాజస్థాన్) లో ఉంది[3] 1963 ఫిబ్రవరి 8 న స్థాపించబడిన మధురలోని గోవింద్ బ్యాంక్ (ప్రైవేట్) లిమిటెడ్‌ను ఎస్బిబిజె 1966 ఏప్రియల్ 25 న స్వాధీనం చేసుకుంది.ఈ రెండు బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సబ్సిడియరీ బ్యాంక్) చట్టం, 1959 ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ సంస్థలుగా పరిగణించబడ్డాయి.దీనిని 2017 ఫిబ్రవరి 15 న స్టేట్ బ్యాంకు ఆప్ ఇండియాలో విలీనం చేయటానికి భారత ప్రభుత్వం ఆమోదించింది. చివరకు ఇది 2017 మార్చి 31 న ఎస్బిఐలో విలీనం అయ్యింది.[3]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 https://www.policybazaar.com/state-bank-of-bikaner-and-jaipur-ifsc-code/
- ↑ "State Bank of Bikaner and Jaipur Profit & Loss account, State Bank of Bikaner and Jaipur Financial Statement & Accounts". www.moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-07.
- ↑ 3.0 3.1 https://bankifsccode.com/STATE_BANK_OF_BIKANER_AND_JAIPUR/RAJASTHAN/JAIPUR/OFFICE_ADMINISTRATION_DEPARTMENT